చంద్రబాబు ఓడిపోతాడని తెలిసి మహిళల మీద దాడులు  

Best Web Hosting Provider In India 2024

వైయ‌స్ఆర్‌సీపీ మ‌హిళా విభాగం  రాష్ట్ర అధ్యక్షురాలు పోతుల సునీత  

తాడేప‌ల్లి: చంద్రబాబు  ఎన్నిక‌ల్లో ఓడిపోతాడని తెలిసి మహిళల మీద దాడులు చేయిస్తున్నాడ‌ని వైయ‌స్ఆర్‌సీపీ మ‌హిళా విభాగం  రాష్ట్ర అధ్యక్షురాలు పోతుల సునీత మండిప‌డ్డారు.  హోంమంత్రి తానేటి వనితపై దాడికి ప్రయత్నించడం చంద్రబాబు దిగజారుడుతనానికి నిదర్శనమ‌న్నారు. బుధ‌వారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. సాక్షాత్తు హోమ్ మినిస్టర్ పై దాడికి ప్రయత్నం  అంటే టిడిపి బరితెగింపును అర్ధం చేసుకోవచ్చు. దళిత మహిళ తానేటి వనిత పై దాడి దళితులపట్ల టిడిపి,చంద్రబాబు వైఖరిని తెలియచేస్తోంది. మహిళలపై టీడీపీ ఆగడాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి విజయవాడలో కూడ బొండా ఉమా మహిళల మీద దాడులు చేయించారు.. మహిళలకు పెద్ద పీఠ వేసి రాజకీయంగా అనేక పదవులు,రాజకీయంగా మహిళలకు 50% రిజర్వేషన్ వైయ‌స్ఆర్‌ సీపీ ఇచ్చింద‌ని సునీత తెలిపారు. 

 టీడీపీ,జనసేన, బీజేపీ,కాంగ్రెస్ అన్ని పార్టీలు వైయ‌స్‌ జగన్ మీద కక్ష కట్టార‌ని పోతుల సునీత ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.  2019లో టీడీపికి ప్రజలు బుద్ది చెప్పారు మళ్ళీ 2024 లో టిడిపి కూటమికి బుద్ది చెప్పబోతున్నారు.  దళితులు అందరూ అవమానం పడేలా చంద్రబాబు చేస్తున్నాడు. దళితులు జగన్ కి అండగా ఉంటారు.. మహిళలకు వచ్చే ఆసరా,చేయూత పథకాలను రాకుండా చంద్రబాబు అడ్డుకున్నాడు.అవ్వ తాత పెన్షన్స్ ఆలస్యం అయ్యేలా చంద్రబాబు చేసాడు.. అవ్వాతాతల ఉసురు చంద్రబాబు,పవన్ కల్యాణ్ లకు తగులుతుంద‌ని పోతుల సునీత హెచ్చ‌రించారు.

Best Web Hosting Provider In India 2024