99శాతం హామీలు నెరవేర్చి మేనిఫెస్టోకు పవిత్రత తెచ్చాం.. 

Best Web Hosting Provider In India 2024

టీవీ9 ఇంట‌ర్వ్యూలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ 

అతను అడుగులు పేదల అభ్యున్నతి వైపు. ఆయన ఆలోచనలు సంక్షేమాభివృద్ధి వైపు. ప్రతి నెల 1వ తేదీనే పెన్షన్ చేతిలో పెడుతున్న పెద్దకొడుకు. పేదరికంపై యుద్ధానికి చదువనే ఆయుధాన్నిస్తున్న నాయకుడు. నవరత్నాలతో కష్టాలు, కన్నీళ్లు తుడుస్తున్న పేదింటి పెద్దన్న. అక్కాచెల్లి-అవ్వాతాత అంటూ నోరారా పిలిచే ఏకైక ముఖ్యమంత్రి. బీసీలను బ్యాక్‌బోన్‌ క్లాస్‌గా మారుస్తూ.. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, అగ్రవర్ణ పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్న జననేత. సంక్షేమంతోనూ అభివృద్ధి సాధించొచ్చని నిరూపిస్తున్న టార్చ్‌ బేరర్. మరణించినా.. ప్రజల గుండెల్లో బతికి ఉండాలన్నదే ఆయన కల. పేదలకు మంచి చేసే విషయంలో ఎవ్వరి మాట విననంటారు. విశ్వసనీయత అనే బ్రాండ్‌నేమ్‌తో మరోసారి జనంలోకి వెళ్తున్నారు. ప్రత్యర్ధులంతా ఏకమైనా ఎన్నికల యుద్ధంలో గెలిచేది తానేనంటూ ధీమాగా చెబుతున్నారు. జననేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తో టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ ప్రత్యేక ఇంటర్వ్యూ .

వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి హయాంలో అభివృద్ధి జరగలేదని ప్రతిపక్షాల తీరును తప్పుబట్టారు సీఎం జగన్. గత 59 నెలల్లో కొత్తగా 17 మెడికల్ కాలేజీలు కడుతున్నామన్నారు. 13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్చి ప్రజలకు పరిపాలనను చేరువ చేశామని గుర్తు చేశారు. ఇచ్చిన ప్రతి హామీకి పరిష్కారాలు వెతుకుతూ అమల్లోకి తెచ్చామని సీఎం వైయ‌స్ జగన్ స్పష్టం చేశారు. 99శాతం హామీలు నెరవేర్చి మేనిఫెస్టోకు పవిత్రత తెచ్చామన్నారు. ప్రతి ఏటా మేనిఫెస్టోను ప్రజల దగ్గరికి తీసుకెళ్లాం. మ్యాన్‌మేడ్‌ సమస్యలకు పరిష్కారం మా 59 నెలల పరిపాలన అన్న జగన్, అర్హతే ప్రామాణికంగా సంతృప్త స్థాయికి పథకాలు తీసుకెళ్లామన్నారు. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, కొత్తగా నిర్మిస్తున్న ఓడ రేవులు, భోగాపురం ఎయిర్‌పోర్ట్ వంటి అభివృద్ధి కాదా ? అని ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి 33 వేల కోట్ల పెట్టుబడులు వస్తే.. వైసీపీ హయాంలో లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. ఈ విషయాలు ప్రజలు ఆలోచించాలని కోరారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి టీవీ9 ఇంటర్వ్యూలో ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించారు.  
 

ప్రజలను మోసం చేయడం నాకు ఇష్టం లేదు
రాష్ట్ర ప్రజలను మోసం చేయడం నాకు ఇష్టం లేదని జగన్‌ అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చేయడమే నా లక్ష్యమని, అలాగే ప్రజలు కూడా అభివృద్ధి కావడమే ఇష్టమన్నారు. రాష్ట్రం శ్రీలంక అవుతుందని మాట్లాడుతున్నారని, సూపర్‌-6, సూపర్‌ -7 అంటూ అడ్డగోలు హామీలు ఇస్తున్నారని అన్నారు.

14 ఏళ్లుగా చంద్రబాబు మోసం చేస్తూనే ఉన్నారు
చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకం గుర్తొస్తుందా..? 14 ఏళ్లుగా చంద్రబాబు మోసం చేస్తూనే ఉన్నారని సీఎం జగన్‌ అన్నారు. గతంలో ఎక్కువ కాన్ఫిడెన్స్‌తో ఉన్నా.. 90 శాతం కుటుంబాల అభివృద్ధిలో జగన్‌ పాత్ర ఉందన్నారు. చేయగలిగేవి మేనిఫెస్టోలో పెట్టాలి అని అన్నారు. ఇష్టానుసారం హామీలు ఇస్తే నిధులు ఎలా వస్తాయన్నారు. చంద్రబాబు సీఎంగా చేసిన సమయంలో ఒక్క మంచి పనైనా చేసింది ఉందా అని అన్నారు.

అందుకే అమ్మ ఒడి ఇస్తున్నాము
పిల్లల చదువులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని, పిల్లల బతుకులు మారాలంటే నాణ్యమైన విద్య అవసరమన్నారు సీఎం జగన్. నాణ్యమైన విద్యతో పిల్లల టాలెంట్‌ మెరుగవుతుందన్నారు. అందుకే అమ్మ ఒడి ఇస్తున్నామని అన్నారు. పిల్లలకు పెట్టే ప్రతి రూపాయి వారి అభివృద్ధి కోసమేనని అన్నారు.

నెక్ట్స్‌ విశాఖలోనే సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తా
ఈ ఎన్నికల తర్వాత తాను విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తానని సీఎం జగన్‌ అన్నారు. ఇక నుంచి విశాఖ నుంచే పాలన కొనసాగుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో విశాఖ అతిపెద్ద సిటీ అని, విశాఖలో ఉన్న మౌలిక సదుపాయాలు ఏపీలో మరెక్కడా లేవన్నారు.

పచ్చకామెర్లు ఉంటే లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది
రాష్ట్రంలో ఎంత అభివృద్ధి జరుగుతున్నా పచ్చకామెర్లు ఉంటే లోకమంతా పచ్చగానే కనిపించినట్లు ఉంటుందని సీఎం జగన్‌ అన్నారు. ఎంత అభివృద్ధి జరుగుతున్నా వారికి కనిపించదని అన్నారు.

గతంలో ఎప్పుడు జరగని అభివృద్ధిని చేశాం
రాష్ట్రంలో గతంలో ఎప్పుడు జరగని అభివృద్ధిని చేశామని జగన్‌ అన్నారు. మా పాలనలో లక్ష కోట్లకుపైగా పెట్టుబడులు వచ్చాయన్నారు. పారిశ్రామిర వేత్తలు సైతం క్యూ కడుతున్నారని అన్నారు. మూడు వేల లైబ్రరీలు నిర్మాణంలో ఉన్నాయన్నారు. నేను చేసిన అభివృద్ధి కళ్ల ముందు కనిపిస్తోందన్నారు. చూడాలని లేనప్పుడు అభివృద్ధి కనిపించదన్నారు.

కొత్తగా 17 మెడికల్‌ కాలేజీలు కడుతున్నాము
తమ ప్రభుత్వం రాష్ట్రం అభివృద్ధే దిశగా అడుగులు వేస్తోందని, రాష్ట్రంలో కొత్తగా 17 మెడికల్‌ కాలేజీలు కడుతున్నామని సీఎం జగన్‌ అన్నారు. అంతేకాకుండా కొత్తగా నాలుగు సి పోర్టులు కడుతున్నామని, అలాగే 10 ఫిషింగ్‌ హార్బర్లు కడుతున్నాం.. మూడు ఇండస్ట్రియల్‌ కారిడార్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈజ్‌ ఆఫ్ డూయింగ్‌లో నెంబర్‌గా ఉన్నామన్నారు.

చంద్రబాబు మోసపూరిత మనిషి
చంద్రబాబు ఒక మోసపూరిత మనిషి అని సీఎం జగన్‌ ఆరోపించారు. చంద్రబాబుపైనే ఎన్నికల కమిషన్‌ కేసు పెట్టిందని గుర్తు చేశారు. మోడీ, అమిత్‌షా ముందు చంద్రబాబు మాట్లాడాలని అన్నారు. దేశం మొత్తం ఏపీ మోడల్‌ను ఫాలో అవుతుందన్నారు. తమ ప్రభుత్వం మనసుపెట్టి పాలన చేస్తున్నామని అన్నారు.

గ్రామ పంచాయతీ వ్యవస్థను మార్చాం
రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చాక గ్రామ పంచాయతీ వ్యవస్థను మార్చామని సీఎం జగన్‌ అన్నారు. గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న భూరికార్డులన్ని కూడా పంచాయతీలో ఉంచామని, ఎక్కడికో వెళ్లకుండా గ్రామ పంచాయతీలోనే చెక్‌ చేసుకునే సదుపాయం కల్పించామన్నారు. రైతుల భూములకు సంబంధించి హక్కులు వారికే కల్పించేలా చర్యలు తీసుకున్నామన్నారు.

ల్యాండ్‌ టైటిలింగ్‌పై చంద్రబాబు వివాదం సృష్టిస్తున్నారు
ల్యాండ్‌ టైటిలింగ్‌పై చంద్రబాబు వివాదం సృష్టిస్తు్న్నారని, ల్యాండ్‌ టైటిలింగ్‌ అంటే ప్రజల భూములపై వారికి హక్కులు కల్పించడమేనని అన్నారు. ప్రతి హామీకి పరిష్కారాలు వెతుకుతూ అమల్లోకి తెచ్చామన్నారు. 99 శాతం హామీలు నెరవేర్చి మేనిఫెస్టోకు పవిత్రత తెచ్చామన్నారు. తాము ల్యాండ్‌ టైటిలింగ్‌ తీసుకువచ్చిన తర్వాత వారి భూములు ఎవరికైనా అమ్మవచ్చు.. క్రయ విక్రయాలు చేయవచ్చన్నారు.

అప్పుడే తాను ఆనంద పడ్డాను
గత ప్రభుత్వ హయాంలో ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారని, లంచం ఇస్తే గానీ పని జరగని పరిస్థితి ఎదురైందని, అలాగే విద్యా కూడా సరిగ్గా లేని పరిస్థితి ఉందని, అందుకే పాలనలో ప్రక్షాళన చేశానని సీఎం జగన్‌ అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ఒక వ్యస్థను తీసుకువచ్చామని, అన్ని అంశాలను ప్రక్షళాన చేశామని అన్నారు. తాను సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రజల కోసం వ్యస్థను మార్చడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు.

పాదయాత్రలో ప్రజల సమస్యలను చూశా – సీఎం జగన్
గత ఎన్నికలకు ముందు తాను చేసిన పాదయాత్రలో ప్రజల సమస్యలు తెలుసుకున్నానని, తాను కళ్లారా చూశానని, అందుకే తనను ప్రజలు ఆదరించారని, ఆ తర్వాతే అధికారంలోకి వచ్చామని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు. టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ ఇంటర్వ్యూలో పలు కీలక విషయాలు పంచుకున్నారు.

గతంలో కంటే 2 లక్షల ఉద్యోగాలు సృష్టించాం.. 
తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో అదనంగా 2 లక్షల 31 వేల ఉద్యోగాలు సృష్టించామని టీవీ నైన్‌ ఇంటర్వ్యూలో సీఎం జగన్‌ వెల్లడించారు. చంద్రబాబు హయాంలో వచ్చిన పెట్టుబడులకు తమ 59 నెలల పాలనలో వచ్చిన పెట్టుబడులను ఆయన వివరించారు. గ్రామ సచివాలయాల్లో లక్షా 35వేల మంది పనిచేస్తున్నారు. వైద్యరంగంలో 54వేల మందికి ఉద్యోగాలు ఇచ్చాం. ఎంఎస్‌ఎంఈలపై మేం పెట్టిన దృష్టి ఇంతకుముందెన్నడూ లేదు. ఎంఎస్‌ఎంఈల్లో అదనంగా 20 లక్షల మందికి ఉపాధి దొరికింది. 2019 ఎన్నికలతో పోల్చితే తన కాన్ఫిడెన్స్‌ ఈసారి చాలా ఎక్కువుందని సీఎం జగన్‌ అన్నారు. రాష్ట్రంలో 90 శాతం కుటుంబాల అభివృద్ధిలో జగన్‌ పాత్ర ఉందని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో తాను మాట్లాడే ప్రతీ మాట ఎంతో గౌరవప్రదంగానే ఉంటుందని జగన్‌ స్పష్టం చేశారు. విపక్షాల మాటల్లో నిరాశ కనిపిస్తోందని తెలిపారు.

హైదరాబాద్‌లాంటి నగరం ఆంధ్రప్రదేశ్‌లో లేకపోవడం దురదృష్టమని సీఎం జగన్‌ అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం చేపడుతున్న అభివృద్ధి పనుల వల్ల వచ్చే పదేళ్లలో విశాఖ నగరం హైదరాబాద్‌, బెంగళూరుతో పోటీ పడే స్థాయికి ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే పదేళ్లలో విశాఖను అభివృద్ధి చేసేందుకు రూ. 1,05,000 కోట్ల పెట్టుబడితో విజన్‌విశాఖను రూపొందిస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. అగ్రగామి పారిశ్రామికవేత్తలంతా వైజాగ్‌ను తమ నెక్ట్స్ ఫిన్-టెక్ క్యాపిటల్‌గా చూస్తున్నారన్నారు. విశాఖ ప్రజల పట్ల ఉన్న నా నిబద్ధతకు ఇదే నిదర్శనమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

ఏపీలో చేపడుతున్న విధానాలను దేశమంతా అనుసరిస్తుందని సీఎం జగన్ అన్నారు. మనస్సు పెట్టి తాము పరిపాలన చేస్తుండటమే దానికి కారణమని తెలిపారు. తమ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులను ఆయన ప్రస్తావించారు. ఈజ్‌ ఆఫ్ డూయింగ్‌ బిజినెస్‌లో నెంబర్‌ వన్‌ పొజిషన్‌లో కొనసాగుతున్నామని తెలిపారు. అమరావతిలో మౌలిక సదుపాయాలకే లక్ష కోట్లు ఖర్చు చేశారన్నారు. టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక అంశాలను వెల్లడించారు.

ఉచిత వైద్యం, వైద్య విద్యలో ప్రోత్సాహకంగా మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టాం.. ఇది కాదా అభివృద్ధి? అని జగన్ ప్రశ్నించారు. కొత్తగా 4 పోర్టులు నిర్మిస్తున్నాం, ఫిషింగ్‌ హార్బర్‌లు నిర్మిస్తున్నామన్నారు. క్వాలిటీ చదువులు అందించడం అభివృద్ధి కాదా..? బడికి వెళ్ళే పిల్లలకు ట్యాబులు ఇస్తారని ఎవరైనా ఊహించారా? అమ్మబడి పేరుతో పాఠశాలకు కొత్త రూపు తీసుకువచ్చామన్నారు. అలాగే ఇంటి వద్దకే పెన్షన్‌, ఇంటి వద్దకే రేషన్.. 14 ఏళ్లలో ఏ రోజైనా ఇలాంటి అభివృద్ధి జరిగిందా” అంటూ సీఎం జగన్‌ ప్రశ్నించారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్ బిజినెస్‌ నెంబర్‌వన్‌గా నిలిచామన్నారు.

రాజకీయ స్వార్థంతో ల్యాండ్‌ టైటిల్‌ చట్టం గురించి అబద్ధాలు చెప్పడం చాలా దారుణమని సీఎం జగన్‌ అన్నారు. భూయజమానులకు ఎంతో మేలు చేసే చట్టం ఇది అని తెలిపారు. రిజస్ట్రేషన్‌ చేసుకున్న వారికి జిరాక్స్ పేపర్లు ఇస్తారని చెప్పడం అవాస్తవమని స్పష్టం చేశారు. భూములకు సంబంధించి ఇదొక పెద్ద సంస్కరణ అని అన్నారు. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను ఎంతో సులభతరం చేశామని వెల్లడించారు. మార్పు అనేది దేశవ్యాప్తంగా జరుగుతోందని, ఇది ఏపీకి పరిమితమైన విషయం కాదని జగన్‌ తెలిపారు. వందేళ్ల తర్వాత సర్వే చేసి.. భూ రికార్డులు సిద్దం చేశామన్నారు. భూమిపై యజమానికి సర్వహక్కులు కల్పించేదే ఈ చట్టం. 17 వేల గ్రామాల్లో రికార్డులు పూర్తయ్యాయి. టైటిల్స్‌లో తప్పులు లేకుండా చూడటమే ప్రభుత్వం గ్యారంటీ. భూములకు ఇన్సూరెన్స్ ఉంది. సచివాలయాలనే రిజిస్ట్రేషన్ ఆఫీసులుగా మార్చాం అని వెల్లడించారు.

పేదలకు ఉచిత విద్య, వైద్యం అందించడం ప్రభుత్వాల బాధ్యత అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా టీవీ9కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కీలక విషయాలను వెల్లడించారు. ప్రజారోగ్య సంరక్షణకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నామన్నారు. విద్య, వైద్యం ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తేనే పేదలకు నిజమైన ప్రయోజనం చేకూరుతుందన్నారు. మనిషి ప్రాణం విలువ తెలిసిన వ్యక్తిగా ప్రజారోగ్య పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. గత ఐదేళ్లలో ప్రభుత్వాస్పత్రుల రూపురేఖలను మార్చడానికి రూ.16 వేల కోట్లకుపైగా నిధులతో నాడు–నేడు కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. వైద్య సేవలే కాదు.. వైద్య విద్యకు ప్రోత్సహిస్తున్నామన్నారు.

విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకర కాకుండా తాను అడ్డుకోవడం వల్లే ఆగిందని సీఎం జగన్ గుర్తు చేశారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా చేస్తామని పునరుద్ఘాటించిన జగన్, అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి విశాఖ నుండి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తానని ధీమా వ్యక్తం చేశారు. విశాఖలో ఉన్నన్ని మౌలిక సదుపాయాలు ఏపీలో మరెక్కడా లేవన్నారు. గతంలో చూడని ఐకానిక్‌ కన్వెన్షన్‌ హాల్, స్టేడియం, సెక్రటేరియట్‌ విశాఖలో కట్టాలని నా ఆలోచన అని జగన్ స్పష్టం చేశారు.

ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సచివాలయాల్లో లక్షా 35వేల మంది పనిచేస్తున్నారని జగన్ తెలిపారు. వైద్యరంగంలో 54వేల మందికి ఉద్యోగాలు ఇచ్చామని, ఎంఎస్‌ఎంఈలపై మేం పెట్టిన దృష్టి ఇంతకుముందెన్నడూ లేదన్నారు. ఎంఎస్‌ఎంఈల్లో అదనంగా 20 లక్షల మందికి ఉపాధి దొరికిందని సీఎం జగన్ వెల్లడించారు.

రిలేషన్స్‌లో రాజకీయాలు చొరబడితే కుటుంబాల్లో కల్మషం వస్తుందని సీఎం జగన్‌ అన్నారు. చెల్లెలు షర్మిల వ్యవహారంపై ఆయన స్పందించారు. కుట్ర కోణంలో ఉండే చంద్రబాబు ఆ వివాదాన్ని మరింత రెచ్చగొట్టారని అన్నారు. ప్రజాజీవితంలో ఉన్నప్పుడు సవాళ్లు వస్తాయని స్పష్టం చేశారు. ఒక స్థాయి వరకు గొడవను సర్దుబాటు చేయవచ్చని, అది శృతి మించితే ఏం చేయలేమని జగన్‌ అన్నారు.

రాష్ట్రంలో నోటాకు వచ్చినన్ని ఓట్లు కూడా కాంగ్రెస్‌కు రాలేదన్న జగన్, ప్రజా జీవితంలో ఉన్నప్పుడు కొన్ని సవాళ్లు వస్తాయన్నారు. మనం తీసుకునే సిద్దాంతాలు మన క్యారెక్టర్‌ను నిర్వచిస్తాయి. కుటుంబ సభ్యులకు ఛాన్స్ ఇస్తే బంధుప్రీతి, అవినీతి ఆరోపణలు తప్పవన్నారు. ఎన్నికలయ్యాక షర్మిల స్టాండ్‌ ఏంటో తెలుస్తుందన్నారు జగన్. చరిత్రలో ఎవరూ చేయని విధంగా పాలన చేస్తున్నా, నా ఫొటో ప్రతి ఇంట్లో ఉండాలనేలా పాలన. నేను చనిపోయినా.. ప్రతి పేదవాడి గుండెల్లో బతికే ఉండాలనుకుంటానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఒకే కుటుంబం నుంచి ఒకే తరం వాళ్లు రావడం వల్ల మంచి కంటే చెడు ఎక్కువగా జరుగుతుంది. వైసీపీపై కోట్ల మంది ఆధారపడి ఉన్నారన్నారు.

రాష్ట్రంలో అంతా మంచే చేసినప్పుడు వైనాట్ 175 అని జగన్ ప్రశ్నించారు. అందరితో సత్సంబంధాలు ఉండాలని నేను ఆశిస్తాను. నాకు ప్రైవేట్‌ లైఫ్‌ అంటూ ప్రత్యేకంగా లేదు. పబ్లిక్ లైఫ్, ప్రైవేట్ లైఫ్‌ అంతా ఒక్కటే. దేవుడిపై నమ్మకం, ప్రజలపై విశ్వాసం ఉందని జగన్ స్పష్టం చేశారు.

బీజేపీ విషయంలో తనకు సాఫ్ట్‌ కార్నర్‌ ఏమి లేదని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. వ్యతిరేకించే విషయాల్లో కచ్చితంగా వ్యతిరేకిస్తామని తెలిపారు. ముస్లిం రిజర్వేషన్ల విషయంలో తన వైఖరిని జగన్‌ విస్పష్టంగా టీవీ నైన్‌ వేదికగా వెల్లడించారు. మతం వేరు రిజర్వేషన్లు వేరని జగన్‌ అన్నారు. నాలుగు శాతం ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని చెబుతున్న బీజేపీతో టీడీపీ అధినేత చంద్రబాబు జతకట్టారన్నారు. వెనుకబాటుకు గురైన వారి రిజర్వేషన్లు తొలగించడం కరెక్టేనా అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో విజయం సాదించి కేంద్రం నుంచి రావల్సిన నిధులను రాబట్టుకుంటామన్నారు. కేంద్ర ఏ ప్రభుత్వం వచ్చినా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు కొనసాగించాల్సిందే అన్నారు వైయ‌స్‌ జగన్.

సునీత ప్రచారం ఎన్నికల్లో ఎటువంటి ప్రభావం చూపదు
తన సోదరి సునీత చేస్తున్న ప్రచారం ఎన్నికల్లో ఎటువంటి ప్రభావం చూపదని జగన్‌ విస్పష్టంగా చెప్పారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్‌ రెడ్డి చెప్తున్న మాటలను ప్రజలు నమ్ముతున్నారని జగన్ తెలిపారు. కడప ప్రజలకు అవినాష్‌ రెడ్డి ఎలాంటి వాడో తెలుసని అన్నారు.

బాబాయ్‌ హత్యా కేసును ఒక రాజకీయ అంశంగా
బాబాయ్‌ హత్యా కేసును ఒక రాజకీయ అంశంగా మార్చి, రాజకీయంగా ఒక వ్యాక్యూమ్ సృష్టించే ప్రయత్నం చేశారని జగన్‌ అన్నారు. కేసును తప్పుదారి పట్టిస్తూ వాళ్లే కోర్టును ఆశ్రయించారని వివరించారు. ఈ ఎన్నికను కడప సెంట్రిక్‌గా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు.

ప్రత్యేక హోదా వైయ‌స్ఆర్‌ సీపీ ఎజెండా
రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడమే వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎజెండా అని అన్నారు సీఎం జగన్‌. హోదాను అమ్మేసి చంద్రబాబు ప్యాకేజీ అన్నారు. చంద్రబాబు కారణంగా రాష్ట్రం నష్టపోయిందని ఆరోపించారు. కాంగ్రెస్‌ రాష్ట్రాన్ని విభజించి అన్యాయం చేసిందన్నారు.

Best Web Hosting Provider In India 2024