Best Web Hosting Provider In India 2024
Devara Release: మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమా కోసం సినీ ప్రేక్షకులు చాలా ఎదురుచూస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో పవర్‌ఫుల్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ ఏడాది ఏప్రిల్ 5న దేవర మూవీని రిలీజ్ చేస్తామని మూవీ టీమ్ ముందుగా ప్రకటించింది. అయితే, షూటింగ్ ఆలస్యమవటంతో ఏకంగా అక్టోబర్ 10వ తేదీకి రిలీజ్‍ను వాయిదా వేసింది. అయితే, మరోసారి దేవర సినిమా విడుదల తేదీ మారునుందనే రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి.
ముందుగానే..!
దసరా సందర్భంగా అక్టోబర్ 10వ తేదీన దేవర సినిమాను రిలీజ్ చేయనున్నట్టు మూవీ టీమ్ ఇప్పటికే ఖరారు చేసింది. అధికారికంగా ప్రకటించింది. అయితే, రిలీజ్ ప్లాన్‍ల్లో మళ్లీ మార్పులు వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో ఇప్పుడు పుకార్లు షురూ అయ్యాయి. వారం లేకపోతే రెండు వారాలు ముందుగానే దేవర చిత్రాన్ని రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.
దేవర పనులను వీలైనంత తొందరగా పూర్తి చేసేలా మూవీ టీమ్ ప్లాన్ చేస్తోందని తెలుస్తోంది. అక్టోబర్ తొలివారంలో రిలీజ్ చేసేందుకు వీలుగా సినిమాను సిద్ధం చేయాలని అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఒకవేళ ఓజీ మూవీ వాయిదా పడితే సెప్టెంబర్ చివరి వారాన్ని కూడా పరిశీలించే ఛాన్స్ ఉంది.
కారణం ఇదేనా!
దేవర సినిమా పాన్ ఇండియా రేంజ్‍లో గ్రాండ్‍గా రిలీజ్ కానుంది. ఆర్ఆర్ఆర్ గ్లోబల్ హిట్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడంతో దేశవ్యాప్తంగా ఈ చిత్రంపై ఫుల్ హైప్ ఉంది. దసరా సందర్భంగా తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన వైట్టైయన్‍ను రిలీజ్ చేసేందుకు ఆ మూవీ టీమ్ సిద్ధమైంది. బాలీవుడ్‍లో షాహిద్ కపూర్ మూవీ దేవ కూడా దసరాకే రానుంది. దీంతో ముందుగా ప్రకటించిన అక్టోబర్ 10 కంటే కనీసం వారం రోజుల ముందుగా వస్తే పాన్ ఇండియా రేంజ్‍లో కలిసి వస్తుందని దేవర టీమ్ భావిస్తున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ముఖ్యంగా అక్టోబర్ 5వ తేదీని దేవర మేకర్స్ పరిశీలిస్తున్నట్టుగా టాక్. మరి ఏం జరుగుతుందో చూడాలి.
అభిమానులందరూ కాలర్ ఎగరేసేలా దేవర మూవీ ఉంటుందని జూనియన్ ఎన్టీఆర్ ఇటీవల చెప్పారు. ఇక, ఈ చిత్రం తనకు, ఎన్టీఆర్ అభిమానులకు స్పెషల్‍గా ఉంటుందని దర్శకుడు కొరటాల శివ ఇటీవల అన్నారు. సముద్రం బ్యాక్‍డ్రాప్‍లో హైవోల్టేజ్ భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో దేవర అద్బుతంగా ఉంటుందనే అంచనాలు ఉన్నాయి.
దేవర ఫస్ట్ సాంగ్!
జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజైన మే 20వ తేదీన దేవర సినిమా నుంచి మొదటి పాట రానుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ పాటను సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ సిద్ధం చేస్తున్నారని టాక్. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. దేవర మూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ బానర్లు నిర్మిస్తున్నాయి.
దేవర సినిమాలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‍గా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఈ మూవీ నుంచి వచ్చిన యాక్షన్ గ్లింప్స్ అంచనాలను భారీగా పెంచేసింది.