ఎంపీ నందిగామ సురేష్‌పై దాడియత్నం..

Best Web Hosting Provider In India 2024

బాపట్ల జిల్లా: పర్చూరు నియోజకవర్గం ఇంకొల్లు మండలం పెదనక్కలపాలెంలో టీడీపీ అరాచకం. బాపట్ల వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నందిగం సురేష్ కారుపై దాడికి ప్ర‌య‌త్నించారు. దాడి సమయంలో కారులో లేని నందిగం సురేష్, ఏజెంట్లు మాత్రమే కారులో ఉండడంతో కారుపై దాడి చేసి నందిగం సురేష్‌ను దుర్భాషలాడిన టీడీపీ కార్యకర్తలు. దాడిలో కారు అద్దాలు, ఇత‌ర పార్ట్స్ ధ్వంసం చేశారు, ఎజెంట్లు బెదిరించిన టీడీపీ కార్యకర్తలు. మూడురోజుల క్రితమే యద్దనపూడి మండలం చింతపల్లిపాడులో సురేష్‌పై దాడి చేసిన టీడీపీ శ్రేణులు. 
 
 తాడిపత్రిలో ఉద్రిక్తత.. పోలీసుల లాఠీచార్జి

అనంతపురం:   తాడిపత్రిలో టీడీపీ నేతల తీరుపై ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అభ్యంతరం వ్య‌క్తం చేశారు. అనుమతి లేకుండా పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి, టీడీపీ రౌడీషీటర్ పొట్టి రవి. ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి
 
హిందూపురంలో టీడీపీ నేత‌ల దౌర్జ‌న్యం
హిందూపురం నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ నేత‌లు దౌర్జ‌న్యానికి దిగారు. వైయ‌స్ఆర్‌సీపీ నేత పురుషోత్తం కారుపై దాడికి పాల్ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌లో వైయ‌స్ఆర్‌సీపీ కార్య‌ద‌ర్శి న‌వీన్‌కు తీవ్ర‌గాయాల‌య్యాయి. టీడీపీ నేత‌ల తీరును వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు తీవ్రంగా ఖండించారు. ఓట‌మి భ‌యంతో టీడీపీ ఇలాంటి దుశ్చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతుంది ఫైర్ అయ్యారు.

Best Web Hosting Provider In India 2024