Single Reasons : మీరు సింగిల్‌గా ఉండడానికి ఈ 5 అంశాలు కారణం కావొచ్చు

Best Web Hosting Provider In India 2024

మీరు ఇప్పటికీ ఒంటరిగా ఉన్నారా? ఎవరితోనూ ప్రేమలో లేరా? ఎవరితోనూ డేటింగ్ చేయడం లేదా? అవును ఇటీవల ఒంటరి అబ్బాయిలు, బాలికల సంఖ్య పెరిగింది. ఇది కొన్ని గణాంకాల వివరణ. ముఖ్యంగా అబ్బాయిలు ఇప్పుడు ఒంటరిగా జీవిస్తున్నారు. జీవితంలో ఒంటరిగానే ఏదైనా సాధించవచ్చనే ఆలోచనలో చాలా మంది బతుకుతున్నారు. ప్రేమ, పెళ్లి అంటూ ఇబ్బందులకు గురికావడం ఎందుకని అనేక మంది అనుకుంటున్నారు. కానీ ఇందులో కొన్ని అంశాలు ఉన్నాయి. ఆ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలి.

ఈ ఆధునిక యుగం, వేగవంతమైన ప్రపంచంలో కూడా మీరు ఒంటరిగా ఉంటే, ఏదో తప్పు ఉందని అర్థం. మీరు ఎందుకు ఒంటరిగా ఉన్నారు? కారణం ఏం కావచ్చు? అని ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు మీరు ఒంటరిగా ఉండటానికి గల 5 ప్రధాన కారణాలను తెలుసుకోండి

లక్ష్యాల కోసం

మీరు ఈ రోజు ఒంటరిగా ఉన్నారనే వాస్తవం మీరు ఒక నిర్దిష్ట లక్ష్యం వెనుక పడిపోయినట్లు అర్థం. అంటే ముందు సెటిల్ అవ్వాలని, మంచి ఉద్యోగం సంపాదించుకోవాలని, ఆ తర్వాత మీ లవ్ లైఫ్ లేదా మ్యారేజ్ గురించి ఆలోచించాలని అనుకుంటున్నారు. బహుశా మీరు మీ కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లాలి లేదా ముందుగా వ్యక్తిగత లక్ష్యాలను చేరుకోవాలి. మీరు ఈ లక్ష్యాల గురించి మరింత ఆందోళన చెందుతున్నారు. ఇది మీకు మంచిదే అయినప్పటికీ, ఎక్కువ కాలం ఒంటరిగా జీవించడం కూడా సమస్యలను కలిగిస్తుంది.

చేదు సంఘటనలు

మీరు నేటికీ ఒంటరిగా ఉన్నట్లయితే మీ జీవితంలో కొన్ని చేదు సంఘటనలు జరిగి ఉండవచ్చు. అంటే మీ ప్రేమను తిరస్కరించడం, ప్రేమ విఫలమైన సంఘటనలు మిమ్మల్ని మళ్లీ ఆ సంబంధాన్ని కొనసాగించకుండా నిరోధించి ఉండవచ్చు. ఈ భావాలకు ఆటంకం ఏర్పడి నేటికీ ఒంటరిగా ఉండవచ్చు. ఈ ఘటన నుంచి కోలుకోవడానికి కొంత సమయం పట్టవచ్చు. గతంలో తిరస్కరించబడటం మిమ్మల్ని గందరగోళానికి గురిచేసి ఉండవచ్చు.

కోరుకున్నవారు లేకపోవడం

మీరు కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి మీకు లభించకపోవచ్చు. ఇక్కడ మీ కోరిక చాలా వింతగా ఉండవచ్చు. మీరు అనుకున్న లక్షణాలు ఉన్న వ్యక్తిని ఇంకా కనుగొనలేకపోవచ్చు. మీరు ఒంటరిగా ఉండేందుకు ఇది కూడా కారణం కావచ్చు. అలాగే మీ కలల అబ్బాయి లేదా అమ్మాయి ఇంకా మీ దృష్టిని ఆకర్షించకపోవచ్చు.

భయం

మరోవైపు మీరు డేటింగ్ నుండి సంబంధానికి మారినప్పుడు మీరు తిరస్కరణకు భయపడవచ్చు. ఎవరైనా మిమ్మల్ని తిరస్కరిస్తారని లేదా అవమానకరమైన రీతిలో మాట్లాడతారని మీరు భయపడవచ్చు. ఇది మిమ్మల్ని ఒంటరిగా చేసి ఉండవచ్చు. అందుకే చాలా మంది బంధంలోకి దిగేందుకు భయపడుతున్నారు.

భావోద్వేగాలు

చాలా మంది ఇప్పటికీ ఒంటరిగా ఉండటానికి ప్రధాన కారణం భావోద్వేగాలు. మీ భావాలను వ్యక్తీకరించడానికి మీరు ఇప్పటికీ సంకోచించడమే ఒంటరిగా ఉండటానికి కారణం కావచ్చు. మీరు మీ భావాలను వ్యక్తీకరించడానికి సరైన సమయం కోసం వేచి ఉండవచ్చు. కానీ ఈ భావాలు వ్యక్తమయ్యే వరకు మీరు ఒంటరిగా ఉంటారని మర్చిపోకండి. ఏదైనా ఉంటే నేరుగా చెప్పేయాలి.

WhatsApp channel
Source / Credits

Best Web Hosting Provider In India 2024