కొంద‌రు పోలీసులు టీడీపీ కార్య‌క‌ర్త‌ల్లా ప‌నిచేశారు

Best Web Hosting Provider In India 2024

ఓట‌మి భ‌యంతోనే టీడీపీ దాడుల‌కు పాల్ప‌డింది

వైయ‌స్ఆర్ సీపీ ఎంపీ అభ్య‌ర్థి అనిల్ కుమార్ యాద‌వ్‌

నరసరావుపేట: ఓట‌మి భ‌యంతో టీడీపీ నేత‌లు దాడుల‌కు పాల్ప‌డ్డార‌ని, ముంద‌స్తు ప్లాన్ ప్ర‌కార‌మే పల్నాడులో టీడీపీ అరాచకాలకు తెగబడిందని వైయ‌స్ఆర్‌ సీపీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్‌ యాదవ్‌ మండిపడ్డారు. మాచర్లలో టీడీపీ నేతలు విధ్వంసం సృష్టించారని.. వైయ‌స్ఆర్ సీపీ అభ్య‌ర్థి పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డి, ఆయన కుమారుడిపై టీడీపీ నేతలు దాడి చేశారన్నారని ధ్వ‌జ‌మెత్తారు. పోలింగ్‌ బూత్‌ లోపలికి వెళ్లి టీడీపీ నేతలు దాడులు చేశారని, వైయ‌స్ఆర్ సీపీకి మద్దతు తెలిపిన గ్రామాలపై దాడులకు తెగ‌బ‌డ్డార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కొందరు పోలీసులు టీడీపీ అభ్యర్థుల్లా వ్యవహరించారని, టీడీపీ దాడులపై తాము ఫోన్లు చేసినా పోలీసులు స్పందించలేదన్నారు. పల్నాడు ఎస్పీకి ఫోన్‌ చేసినా స్పందించలేదు పోలీసులు టీడీపీ కార్యకర్తల్లా పనిచేశారంటూ అనిల్‌ మండిపడ్డారు. 

టీడీపీ అభ్యర్థులకు ఈసీ రూల్స్‌ వర్తించవా?
కొందరు అధికారులు టీడీపీకి కొమ్ము కాశారని వైయ‌స్ఆర్ సీపీ అభ్య‌ర్థి గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు పోలీసులు రూల్స్‌కు వ్యతిరేకంగా పనిచేశారని, త‌నను పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారన్నారు. టీడీపీ అభ్యర్థులకు ఈసీ రూల్స్‌ వర్తించవా? అంటూ గోపిరెడ్డి శ్రీ‌నివాస్‌రెడ్డి ప్రశ్నించారు.

Best Web Hosting Provider In India 2024