Krishnamma OTT: ఓటీటీలోకి ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే?

Best Web Hosting Provider In India 2024

Krishnamma OTT Release: ఓటీటీలోకి ఎమోషనల్ క్రైమ్ రివేంజ్ డ్రామా మూవీ రానుంది. ఆ సినిమానే యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ (Satyadev) నటించిన కృష్ణమ్మ సినిమా. సైడ్ రోల్స్ చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు సత్యదేవ్. సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, ముకుంద వంటి ఇతర సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేసిన సత్యదేవ్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన జ్యోతిలక్ష్మీ సినిమాలో ప్రధాన పాత్ర పోషించాడు.

అనంతరం బ్లఫ్ మాస్టర్ మూవీతో హీరోగా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఈ సినిమా విజయం తర్వాత రాగల 24 గంటల్లో, ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య, 47 డేస్, తిమ్మరుసు, స్కైలాబ్ వంటి సినిమాలు వరుసగా చేసి సత్తా చాటాడు. అంతేకాకుండా గాడ్ ఫాదర్ (God Father Movie) సినిమాలో చిరంజీవికి (Chiranjeevi) మెయిన్ విలన్‌గా నటించి ఆకట్టుకున్నాడు. అలాగే అక్షయ్ కుమార్ రామసేతు సినిమాలో నటించి హిందీలో కూడా ఎంట్రీ ఇచ్చాడు.

ఇటీవల గాడ్‌సే, తమన్నా భాటియాతో (Tamanna) గుర్తుందా శీతాకాలం సినిమాలతో అలరించాడు సత్యదేవ్. ఎంతో టాలెంట్ ఉన్న సత్యదేవ్ నటించిన లేటెస్ట్ సినిమానే కృష్ణమ్మ (Krishnamma Movie). మే 10న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. కానీ, తొలి రోజు ఓపెనింగ్ డే కోటి రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసి ఆశ్చర్యపరిచింది.

సత్యదేవ్ (Satyadev Movies) సినీ కెరీర్‌లో ది బెస్ట్ ఓపెనింగ్స్ తీసుకొచ్చిన సినిమాగా కృష్ణమ్మ మూవీ రికార్డ్‌ కొట్టింది. ఇప్పటికీ ఇంకా థియేటర్లలో ఉన్న ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ వివరాలు లీక్ అయ్యాయి. కృష్ణమ్మ ఓటీటీ హక్కులకు మంచి పోటీ నెలకొందని, వాటన్నింటిని అధిగమించి అమెజాన్ ప్రైమ్ (Amazon Prime OTT) ఆ రైట్స్ కొనుగోలు చేసిందని సమాచారం.

కృష్ణమ్మ సినిమా ఓటీటీ హక్కుల కోసం అమెజాన్ ప్రైమ్ మంచి ధర చెల్లించినట్లు వార్తలు వచ్చాయి. ఇక ఈ మూవీని థియేట్రికల్ రిలీజ్ అనంతరం 30 రోజులకు డిజిటల్ ప్రీమియర్ చేసేలా అమెజాన్ ప్రైమ్ అగ్రిమెంట్ కుదుర్చుకుందట. దాంతో కృష్ణమ్మ మూవీ జూన్ రెండో వారంలో ఓటీటీ (OTT) స్ట్రీమింగ్‌కు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే, కృష్ణమ్మ ఓటీటీ స్ట్రీమింగ్‌పై ఇప్పటివరకు అయితే ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కాగా పలు పరిస్థితులను బట్టి కృష్మమ్మ ఓటీటీ రిలీజ్ డేట్ మారే అవకాశం కూడా ఉంది. అది ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెండు మూడు రోజుల ముందే అధికారిక ప్రకటన ద్వారా తెలిసే అవకాశం ఉంది.

కాబట్టి కృష్ణమ్మ జూన్ రెండో వారంలోనే ఓటీటీ స్ట్రీమింగ్ అవుతుందా లేదా నెలకంటే ముందుగానే ఓటీటీలోకి వస్తుందా అనేది ఇప్పుడే చెప్పలేం. కాగా కృష్ణమ్మ సినిమా ముగ్గురు స్నేహితుల చుట్టూ తిరిగే కథగా తెలుస్తోంది. చేయని నేరాలు ఒప్పుకుని జైలుకెళ్లే ముగ్గురి జీవితంలో ఓ సంఘటన ఎలాంటి మార్పు తీసుకొచ్చింది, వారి జీవితం ఎలా మలుపు తిరిగింది అనేది ప్రధానంశంగా చిత్రీకరించినట్లు సమాచారం.

 
IPL_Entry_Point
 

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024