Best Web Hosting Provider In India 2024

పల్నాడులో పోలీస్ యంత్రాంగం పూర్తిగా విఫలమైంది
పల్నాడులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో టీడీపీ దాడులకు తెగబడింది
ఓటర్లలో చైతన్యం.. సంక్షేమ పాలన మళ్లీ తెచ్చుకోవడానికి ముందుకొచ్చారు
మహిళలు 70 శాతం ఫ్యాన్ గుర్తుకే ఓటు వేశారు
రిగ్గింగ్ జరిగిన చోట్ల.. రీపోలింగ్ జరపాల్సిందే..
సత్తెనపల్లి వైయస్ఆర్ సీపీ అభ్యర్థి అంబటి రాంబాబు డిమాండ్
సత్తెనపల్లి: పల్నాడులో టీడీపీ నేతలు బీభత్సం సృష్టించారని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపై దాడులకు తెగబడ్డారని, వారిని అడ్డుకోవడంలో పల్నాడులో పోలీస్ యంత్రాంగం విఫలమైందని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. కన్నా లక్ష్మినారాయణ కుమారుడు ఓటర్లను బెదిరిస్తే పోలీసులు పట్టించుకోలేదన్నారు. నిబద్ధతతో పనిచేసే పోలీస్ అధికారులను మార్చేశారని, టీడీపీతో పోలీసులు కుమ్మక్కయ్యారా..? అని ప్రశ్నించారు. చీమలమ్రరి, నాగనుపాడు సహా కొన్ని చోట్ల పోలింగ్ సరిగ్గా జరగలేదని, దమ్మాలపాడు, నార్నేపాడులోని కొన్ని చోట్ల రిగ్గింగ్ చేశారని, రిగ్గింగ్ జరిగిన చోట రీపోలింగ్ చేయాలని డిమాండ్ చేశారు. సత్తెనపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో అంబటి రాంబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు.
అంబటి రాంబాబు ఇంకా ఏం మాట్లాడారంటే..
సీఎం వైయస్ జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలనే తపన ఓటర్లలో కనిపించింది. మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు పెద్దసంఖ్యలో ఓటేశారు. పోలింగ్ శాతం పెరగటం అంటే అది పాజిటివ్ ఓటింగ్. మహిళా సాధికారత కోసం సీఎం వైయస్ జగన్ కృషి చేశారు. మహిళలంతా సీఎం వైయస్ జగన్‌కే ఓటు వేశారు. రాష్ట్యవాప్తంగా ఓటర్లలో చైతన్యం కనిపించింది. టీడీపీ నేతలు అరాచకాలకు తెగబడ్డారు. మేం ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించలేదు. పల్నాడులో పోలీసు యంత్రాంగం విఫలమైంది. టీడీపీతో పోలీసులు కుమ్మక్కయ్యారా?. పల్నాడులో పోలీసు యంత్రాంగం విఫలమైంది. మా కార్యకర్తలకు రక్షణ కల్పించలేని పరిస్థితి ఏర్పడింది. నన్ను తిరగకుండా అడ్డుకున్నారు. ఒక బూత్‌లో వెయ్యి ఓట్లు రిగ్గింగ్ చేశారు. రీపోలింగ్ నిర్వహించబోమన్న మాట సరికాదు. దమ్మాలపాడు, నార్నేపాడులో రిగ్గింగ్ జరిగిన పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్ నిర్వహించాలి.
ఉదయం 6 గంటల నుండి అర్ధరాత్రి వరకూ పోలింగ్ జరిగింది. ఇది ప్రతిష్టాత్మకమైన ఎన్నిక. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ ఐదేళ్లపాటు పాలన చేసిన తర్వాత జరిగిన ఎన్నిక. చంద్రబాబు, వైయస్ జగన్ పాలన చూసినవారు ఓటు వేయడానికి పోటెత్తిన తీరు ఆశ్చర్యం కలిగింది. మహిళలు, వృద్ధులు తెల్లవారుజామునే బూత్ లకు చేరుకున్నారు. తమ సంక్షేమ పాలన మళ్ళీ తెచ్చుకోవడానికి ప్రజలు ముందుకు వచ్చారు. చంద్రబాబు మోసగాడు.. ప్రజలను 14 ఏళ్లు మోసం చేశాడు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన మొనగాడు వైయస్ జగన్. మోసగాడిని ఓడించి ప్రజలు మొనగాడిని గెలిపించనున్నారు.
ఓట్ల శాతం పెరిగితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనుకునేవాళ్లం, కానీ ఈసారి సీఎం వైయస్ జగన్ కోసం తాపత్రయపడి ఓటు వేశారు. ఈ ఎన్నికల్లో మహిళలే ఎక్కువగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మహిళలు 70 శాతం ఫ్యాన్ గుర్తుకే ఓటు వేశారు. అమ్మఒడి, డ్వాక్రా రుణమాఫీ, ఇళ్ల పట్టాలు మహిళలకు ఇచ్చి వారి సాధికారతకు కృషి చేశారు. ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కడా లేదు. సీఎం వైయస్ జగన్ కోసం ఓటర్లు పడిన తపన, తాపత్రయం స్పష్టంగా కనిపించింది అని అంబటి రాంబాబు అన్నారు.