Best Web Hosting Provider In India 2024

Mlc Kavitha Remand : దిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో షాక్ తగలింది. కవిత జ్యుడీషియల్ రిమాండ్ ను దిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. ఈడీ కేసులో రిమాండ్ ముగియడంతో తీహార్ జైలులో ఉన్న కవితను వీడియో కాన్ఫరెన్స్ హాజరుపర్చారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతుందని, రిమాండ్ పొడిగించాలని ఈడీ కోర్టును కోరింది. దీంతో ఈ నెల 20వ తేదీ వరకు కవిత కస్టడీనీ పొడిగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుపై తదుపరి విచారణను మే 20కి వాయిదా వేసింది. ఈ కేసులో 8 వేల పేజీల సప్లిమెంటరీ ఛార్జిషీట్ ను ఈడీ దాఖలు చేసింది.
టాపిక్
Telangana NewsKavitha KalvakuntlaLiquor ScamEnforcement DirectorateTrending TelanganaLatest Telugu News