కొత్త‌గ‌ణేషునిపాడులో టీడీపీ దాడుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాలి

Best Web Hosting Provider In India 2024

ఈసీకి ఫిర్యాదు చేసిన వైయ‌స్ఆర్ సీపీ

స‌చివాల‌యం: ప‌ల్నాడు జిల్లా కొత్త‌గ‌ణేషునిపాడులో టీడీపీ నేత‌ల దాష్టీకంపై వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నిక‌ల క‌మిష‌న్‌కు ఫిర్యాదు చేసింది. మంత్రి అంబటి రాంబాబు, వైయ‌స్ఆర్ సీపీ లీగ‌ల్ సెల్ ప్రెసిడెంట్  మ‌నోహ‌ర్‌రెడ్డి, గ్రీవెన్స్ సెల్ అధ్య‌క్షుడు నారాయ‌ణ‌మూర్తి ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారి ముకేష్‌కుమార్ మీనాను క‌లిసి ఫిర్యాదుప‌త్రం అంద‌జేశారు. కొత్త‌గ‌ణేషునిపాడులో టీడీపీ నేత‌లు అరాచ‌కం సృష్టించార‌ని, వైయ‌స్ఆర్ సీపీకి ఓటు వేశార‌నే కార‌ణంతో బీసీ మ‌హిళ‌ల ఇళ్ల‌ల్లోకి చొర‌బ‌డి విధ్వంసం సృష్టించార‌ని ఈసీకి వివ‌రించారు. బీసీ మ‌హిళ‌ల ఇళ్ల‌ను, ఇళ్ల‌ల్లోని సామ‌గ్రిని టీడీపీ నేత‌లు పూర్తిగా ధ్వంసం చేశార‌ని, బాధితుల‌ను ప‌రామ‌ర్శించేందుకు వెళ్లిన వైయ‌స్ఆర్ సీపీ అభ్య‌ర్థులు కాసు మ‌హేష్‌రెడ్డి, అనిల్ కుమార్ యాద‌వ్ కాన్వాయ్‌పై రాళ్లు, క‌ర్ర‌ల‌తో దాడికి తెగ‌బ‌డ్డార‌ని చెప్పారు. కొత్తగణేషునిపాడులో టీడీపీ దాడులపై త‌క్ష‌ణ‌మే చర్యలు తీసుకోవాలని కోరారు. 

Best Web Hosting Provider In India 2024