EAPCET Exam Centres: విద్యార్ధులకు అలర్ట్.. నంద్యాలలో ఈఏపీ సెట్‌ పరీక్షా కేంద్రాల మార్పు

Best Web Hosting Provider In India 2024

EAPCET Exam Centres: విద్యార్ధులకు అలర్ట్ నంద్యాలలో ఈఏపీ సెట్‌ కేంద్రాల మార్పు చేసినట్టు ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. ఏపీలో రేపటి నుంచి ఈఏపీ సెట్ 2024 పరీక్షలు జరుగనున్నాయి. నంద్యాలలో రెండు పరీక్షా కేంద్రాలను మారుస్తున్నట్లు ఉన్నత విద్యా మండలి ప్రకటించింది.

ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశాలకు గురువారం నుంచి ప్రవేశ పరీక్షలు జరుగనున్నాయి. మే 16 నుంచి 23వ తేదీ వరకు ఈఏపీ సెట్ పరీక్షలు జరుగనున్నాయి.

ఏపీలో ఈఏపీ సెట్‌ 2024 కు హాజరయ్యే కీలక అప్డేట్లను ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పలు కేంద్రాల్లో పరీక్షలు జరుగుతున్నాయి.

ఈఏపీ సెట్‌కు హాజరయ్యే విద్యార్ధులకు ఇప్పటికే హాల్‌ టిక్కెట్లను జారీ చేశారు. నంద్యాలలో రాజీవ్‌ గాంధీ మెమోరియల్ ఇంజనీరింగ్ కాలేజీ, శాంతిరాం ఇంజనీరింగ్ కాలేజీలను కేటాయించిన అభ్యర్థులకు పరీక్షా కేంద్రాలు మారుస్తున్నట్లు ప్రకటించారు.

అయా సెంటర్లకు కేటాయించిన విద్యార్ధులు మరోసారి హాల్‌ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని ఉన్నత విద్యామండలి సూచించింది. అభ్యర్థులు చివరి నిమిషంలో గందరగోళానికి గురి కాకుండా పరీక్షా కేంద్రాల్లో మార్పుల్ని గమనించాలని సూచించారు. నంద్యాలలో మాత్రమే పరీక్షా కేంద్రాల్లో మార్పులు ఉన్నాయని ఉన్నత విద్యామండలి స్పష్టంచసింది.

మరోవైపుఆంధ్రప్రదేశ్‌ ఈ ఏపీఈఏపీ సెట్-2024కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈఏపీ సెట్‌ నిర్వహ ణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జేఎన్టీయూ కాకినాడ వీసీ జీవీఆర్ ప్రసాదరాజు తెలిపారు.

ఈఏపీసెట్‌ నిర్వహణపై కాకినాడలో జేఎన్టీ‍యూ అధికారులు సెట్ కన్వీనర్, కో కన్వీనర్లు, కోఆర్డినేటర్లతో పరీక్ష నిర్వహణ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈఏపీసెట్‌ నిర్వహణను ఏపీలో 47 కేంద్రాల్లో, హైదరాబాద్ ఎల్బీనగర్, సికింద్రాబాద్‌లోని రెండు సెంటర్లలో కామన్‌ ఎంట్రన్స్‌ నిర్వహిస్తున్నారు.

అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు మే 16, 17 తేదీల్లో, ఇంజినీరింగ్ విభాగానికి 18 నుంచి 23 వరకు పరీక్షల నిర్వహిస్తారు. ఇంజినీ రింగ్ విభాగంలో 2,73,010 మంది, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల్లో 87,419 మంది, రెండు విభాగాల్లో కలిపి 1,211 మంది ఈఏపీ సెట్‌కు దరఖాస్తు చేసినట్లు చెప్పారు. మొత్తం 3,61,640 మంది పరీక్షలకు హాజరు కానున్నారు. విద్యార్ధులకు ఏదైనా సందేహాలు ఉంటే 0884-2359599, 2342499 నంబర్లలో సంప్రదించవచ్చని వీసీ తెలిపారు.

ఏపీ ఉన్నత విద్యామండలి ఆన్‌లైన్‌లో ఈఏపీ సెట్ 2024 నిర్వహిస్తోంది. ఇప్పటికే హాల్ టిక్కెట్లను విడుదల చేసింది. ఈఏపీసెట్ పరీక్షల నిర్వహణను ఈ ఏడాది జేఎన్‌టియూ కాకినాడ నిర్వహిస్తోంది.

హాల్‌ టిక్కెట్లను డౌన్‌లోడ్‌ చేయడానికి ఈ లింకును అనుసరించండి. https://cets.apsche.ap.gov.in/EAPCET/Eapcet/EAPCET_GetPrintHallticket.aspx

మే 16 నుంచి 23 వరకు ఈఏపీసెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీ కాలేజీలు, ప్రైవేట్, అన్ ఎయిడెడ్ , అనుబంధ కాలేజీల్లో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈఏపీసెట్-2024 నిర్వహిస్తున్నారు.

IPL_Entry_Point

టాపిక్

Ap EapcetAndhra Pradesh NewsEducationEntrance Tests
Source / Credits

Best Web Hosting Provider In India 2024