Dakshina Trailer: తెలుగులో క‌బాలి హీరోయిన్ సైకో కిల్ల‌ర్ మూవీ – ట్రైల‌ర్ రిలీజ్ చేసిన ఉప్పెన డైరెక్ట‌ర్‌

Best Web Hosting Provider In India 2024

Dakshina Trailer: క‌బాలి మూవీలో ర‌జ‌నీకాంత్ కూతురిగా యాక్ష‌న్ రోల్‌లో తెలుగు, త‌మిళ భాష‌ల్లో పాపుల‌ర్ అయ్యింది సాయిధ‌న్సిక‌. క‌బాలి క్రేజ్‌తో టాలీవుడ్‌లో ప‌లు సినిమాలు చేసింది. త్వ‌ర‌లో ఓ సైకో కిల్ల‌ర్ మూవీతో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది సాయిధ‌న్సిక‌. ద‌క్షిణ పేరుతో తెర‌కెక్కుతోన్న ఈ మూవీ మంత్ర డైరెక్ట‌ర్ ఓషో తుల‌సిరామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

బుచ్చిబాబు సానా…

ద‌క్షిణ‌ ట్రైల‌ర్‌ను ఉప్పెన ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు సానా విడుద‌ల‌చేశారు. మ‌హిళ‌ల‌ను హ‌త్య చేసి, వారి త‌ల‌ల స్థానంలో క్వ‌శ్చ‌న్ మార్క్ పెడుతోన్న ఓ సైకో కిల్ల‌ర్ పాయింట్‌తో ట్రైల‌ర్ ఇంట్రెస్టింగ్ మొద‌లైంది. ఈ ట్రైల‌ర్‌లో సీరియ‌ల్ మ‌ర్డ‌ర్స్ వెనుక‌న్న సీక్రెట్‌ను రివీల్ చేసే పోలీస్ ఆఫీస‌ర్‌గా… నెగెటివ్ షేడ్స్‌తో కూడిన ర‌ఫ్ లుక్‌లో సాయిధ‌న్సిక క‌నిపిస్తోంది.

ఆమె క్యారెక్ట‌ర్‌లోని వేరియేష‌న్స్ ఆస‌క్తిని పంచుతోన్నాయి. ట్రైల‌ర్ రిలీజ్ అనంత‌రం బుచ్చిబాబు మాట్లాడుతూ…. ఈ మధ్య కాలం లొ త‌న‌ను ఎక్కువ‌గా భ‌య‌పెట్టింది ద‌క్షిణ ట్రైల‌ర్ అని చెప్పాడు. తుల‌సిరామ్‌కు మంచి క‌మ్ బ్యాక్ మూవీగా సైకో థ్రిల్లర్ క‌థాంశంతో తెర‌కెక్కుతోన్న ద‌క్షిణ మూవీ నిల‌వాల‌ని అన్నారు.

సీట్ ఎడ్జ్ థ్రిల్ల‌ర్‌…

.దక్షిణ సినిమా సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది, నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే సస్పెన్స్ ప్రేక్షకుల్లో ఉత్కంఠ రేవుతోందని త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని చిత్ర నిర్మాత అశోక్ షిండే తెలిపారు.

మ‌రీనా పేరుతో…

మ‌రీనా పేరుతో కోలీవుడ్‌లో కెరీర్‌ను ప్రారంభించింది సాయిధ‌న్సిక‌. ఆ త‌ర్వాత త‌న పేరును సాయి ధ‌న్సిక‌గా మార్చుకున్న‌ది. ర‌జ‌నీకాంత్ హీరోగా పా రంజిత్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన క‌బాలి సినిమాలో యాక్ష‌న్ రోల్‌లో న‌టించింది. ఈ మూవీ తెచ్చిపెట్టిన క్రేజ్‌తో త‌మిళంలో ప‌లు అవ‌కాశాల‌ను అందుకున్న‌ది. అర‌వ‌న్‌, ప‌ర‌దేశి, కాత్త‌డి, ఉరు, లాభంతో పాటు చాలా సినిమాల్లో న‌టించిన అవేవీ ఆమెకు విజ‌యాల్ని తెచ్చిపెట్ట‌లేక‌పోయాయి.

మంత్ర …టెండ్ సెట్ట‌ర్‌…

మ‌రోవైపు ఛార్మి, శివాజీ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన మంత్ర మూవీతో డైరెక్ట‌ర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు ఓషో తుల‌సిరామ్‌. 2007లో ఎలాంటి అంచ‌నాలు లేకుండా ఛార్మి క్రేజ్‌తో రిలీజైన ఈ మూవీ చిన్న సినిమాల్లో ట్రెండ్ సెట్ట‌ర్‌గా నిలిచింది. ఛార్మితో మంచి క్రేజ్‌ను తీసుకొచ్చింది. వ‌రుస ప‌రాజ‌యాల్లో ఉన్న శివాజీ కెరీర్‌ను గ‌ట్టెక్కించింది. మంత మూవీకి సీక్వెల్‌లో ఛార్మితోనే మంగ‌ళ మూవీ చేశాడు ఓషో తుల‌సిరామ్‌.

IPL_Entry_Point

టాపిక్

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024