Aquaman and the Lost Kingdom OTT Release Date: ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్.. ఫ్రీగా చూసేయండి

Best Web Hosting Provider In India 2024

Aquaman and the Lost Kingdom OTT Release Date: హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఆక్వామాన్ అండ్ ద లాస్ట్ కింగ్‌డమ్ మూవీ ఓటీటీలోకి ఫ్రీగా అందుబాటులోకి వచ్చేస్తోంది. ఇన్నాళ్లూ ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంట్ విధానంలో అందుబాటులో ఉండేది. అయితే ఇక జియో సినిమాలో ఈ సినిమాను ఫ్రీగా చూసే వీలు కలగనుంది.

ఆక్వామాన్ అండ్ ద లాస్ట్ కింగ్‌డమ్ ఓటీటీ రిలీజ్

డీసీ కామిక్స్ సూపర్ హీరో మూవీ అయిన ఆక్వామాన్ అండ్ ద లాస్ట్ కింగ్‌డమ్ మూవీ డీసీ ఎక్స్‌టెండెడ్ యూనివర్స్ (డీసీఈయు) నుంచి వచ్చిన 15వ, చివరి సినిమా. 2018లో వచ్చిన ఆక్వామాన్ సినిమాకు ఇది సీక్వెల్. ఇప్పుడీ మూవీ మే 21వ తేదీ నుంచి జియో సినిమాలో ఫ్రీగా అందుబాటులోకి రానుంది. నిజానికి మూడు వారాలుగా ఈ మూవీ ప్రైమ్ వీడియోలో రెంట్ విధానంలో చూసే వీలు కల్పించింది.

జేమ్స్ వాన్ డైరెక్ట్ చేసిన ఈ ఆక్వామాన్ అండ్ ద లాస్ట్ కింగ్‌డమ్ మూవీలో జేసన్ మొమొవా ఈ ఆక్వామాన్ (ఆర్థర్ కర్రీ) పాత్ర పోషించాడు. ఈ సినిమాలో ఆక్వామాన్ ను అట్లాంటిస్ రూలర్ గా చూపించారు. అతడో సూపర్ హ్యూమన్. నీళ్లలో అత్యంత వేగంగా స్విమ్ చేయడంతోపాటు నీటి లోపల ఉండే జీవులను నియంత్రించే శక్తి కలిగి ఉంటాడు.

అట్లాంటిస్ కు రాజుగా ఉంటూనే తన కుటుంబాన్ని కాపాడుకునే ఫ్యామిలీ మ్యాన్ గానూ ఆక్వామాన్ ను చూపించారు. 2018లో వచ్చిన ఆక్వామాన్ తొలి భాగానికి అతికినట్లు సరిపోయే సీక్వెల్ ఇది అని డైరెక్టర్ జేమ్స్ వాన్ చెప్పాడు. ఈ మూవీని 21 కోట్ల డార్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 43.4 కోట్ల డాలర్లు వసూలు చేసింది. నిజానికి మొదటి నుంచీ సినిమాకు నెగటివ్ రివ్యూలు వచ్చినా.. ఆ ప్రభావం వసూళ్లపై పడలేదు.

ఆక్వామాన్ సీక్వెల్ కథ ఇదే

ఆక్వామాన్ క్యారెక్ట‌ర్ జోస‌న్ మోమోవాపై తెర‌కెక్కించిన యాక్ష‌న్ ఎపిసోడ్స్ అభిమానుల‌ను ఆక‌ట్టుకున్నాయి. యుద్ధంలో త‌న సోద‌రుడు ఓర‌మ్‌ను ఓడించిన అక్వామెన్ అలియాస్ అర్థ‌ర్ క‌ర్రీ అట్టాంటిస్‌కు రాజు అవుతాడు. మోరాను పెళ్లిచేసుకొని సంతోషంగా జీవిస్తుంటాడు.

ఆక్వామాన్ ప‌గ‌తో ర‌గిలిపోయిన డేవిడ్ కేన్.. బ్లాక్ ట్రైడెంట్ స‌హాయంతో కొత్త శ‌క్తుల‌ను కూడ‌గ‌ట్టుకొని అక్వామెన్‌పై తిరిగి యుద్ధానికి స్తాడు. డేవిడ్ కేన్‌ను అక్వామెన్ ఎలా ఎదుర్కొన్నాడు? డేవిడ్ కేన్ కొత్త శ‌క్తుల‌ ముందు అక్వామెన్ బ‌లం స‌రిపోయిందా? ఈ పోరాటంలో అక్వామెన్‌కు అత‌డి సోద‌రుడు ఓర‌మ్ ఎలా అండ‌గా నిలిచాడ‌న్న‌దే అక్వామెన్ అండ్ ది లాస్ట్ కింగ్‌డ‌మ్ మూవీ క‌థ‌.

ఫ‌స్ట్ పార్ట్‌లో క‌థ‌, క‌థ‌నాల‌తో పాటు యాక్ష‌న్ ఎమోష‌న్స్‌కు పెద్ద‌పీట వేశారు మేక‌ర్స్‌. సెకండ్ పార్ట్‌లో ఆ మ్యాజిక్ మిస్స‌యింది. కంప్లీట్ రివేంజ్ డ్రామాగా బోరింగ్ క‌థ సాగ‌డం కూడా ఈ సీక్వెల్‌కు మైన‌స్‌గా మారింది. అక్వామెన్ అండ్ ది లాస్ట్ కింగ్‌డ‌మ్‌లో అంబ‌ర్ హెర్డ్‌, ప్రాట్రిక్ విల్స‌న్ కీల‌క పాత్ర‌లు పోషించారు.

IPL_Entry_Point

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024