Periods: పీరియడ్స్ డేట్ కన్నా ముందే రావాలనుకుంటున్నారా ఈ ఇంటి చిట్కాలను పాటించండి

Best Web Hosting Provider In India 2024

Periods: ఆరోగ్యకరమైన జీవనాన్ని సాగించే స్త్రీలలో పీరియడ్స్ ప్రతి నెలా ఒకే సమయానికి వస్తాయి. కొందరిలో మాత్రం పీరియడ్స్ చాలా ఆలస్యం అవుతూ ఉంటాయి. ఇలా ఆలస్యం అవ్వడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అధిక ఒత్తిడి కారణంగా కూడా పీరియడ్స్ ఆలస్యంగా వస్తూ ఉంటాయి. అధిక ఒత్తిడి వల్ల శరీరంలో కార్డిసోల్ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఇది ఋతుచక్రాన్ని మారుస్తుంది. హార్మోన్ అసమతుల్యతకు దారితీస్తుంది. దీని వల్ల పీరియడ్స్ ఆలస్యం అయ్యే అవకాశం ఉందని గైనకాలజిస్టులు చెబుతున్నారు. అలాగే అధిక వ్యాయామం చేసే వారిలో కూడా ఋతుచక్రంలో మార్పులు వస్తాయి. పీరియడ్స్ ఆలస్యం అవుతాయి.

హార్మోన్లు అసమతుల్యత సమస్యలతో బాధపడుతున్న వారిలో కూడా పీరియడ్స్ రావాల్సిన సమయం కన్నా లేటుగా వచ్చే అవకాశం ఉంది. అధిక బరువుతో బాధపడుతున్న వారు థైరాయిడ్ వంటి సమస్యలతో బాధపడుతున్నారు, PCOS ఉన్నవారు కూడా సమయానికి నెలసరి రాక ఇబ్బంది పడతారు. పీరియడ్స్ త్వరగా రావడానికి కొన్ని హోమ్ రెమెడీస్ ఉన్నాయి. వాటిని పాటిస్తే మీరు అనుకున్న దానికంటే ముందుగానే పీరియడ్స్ వచ్చే అవకాశం ఉంది .

వాము

ఇంట్లో వాము ఉండడం సహజం. ఈ వామును బెల్లంతో కలిపి తింటూ ఉంటే పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పి తగ్గుతుంది. ఉదయం పూట ఒక టీ స్పూను వాము, ఒక టీ స్పూన్ బెల్లం తురుము , ఒక గ్లాసు నీటిలో వేసి బాగా కలపాలి. వాటిని స్టవ్ మీద పెట్టి కాసేపు మరిగించాలి. ఆ తర్వాత స్టవ్ కట్టేసి గోరువెచ్చగా మారాక పరగడుపున తాగాలి. పొట్టతో ఈ జ్యూస్ ను తాగడం వల్ల పీరియడ్స్ త్వరగా వచ్చే అవకాశం ఉంది.

దానిమ్మ

దానిమ్మను అధికంగా తీసుకున్నా నెలసరి ముందే వచ్చే అవకాశం ఉంది. ప్రతిరోజూ ఒక గ్లాసు స్వచ్ఛమైన దానిమ్మ రసాన్ని తాగండి. ఇలా ఈ నెలసరి డేటుకు పది నుంచి 15 రోజులు ముందుగానే తాగడం ప్రారంభించాలి. ఇలా చేయడం వల్ల నెలసరి త్వరగా రావచ్చు. అలాగే చెరుకు రసాన్ని కూడా తాగుతూ ఉంటే నెలసరి త్వరగా వచ్చే అవకాశం పెరుగుతుంది.

పసుపు టీ

పసుపులో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను, యాంటీ ఇన్ఫ్లమేషన్ కలిగి ఉంటుంది. ఇది గర్భాశయానికి రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. గర్భాశయ పొరను బయటకు పంపేందుకు సహాయపడుతుంది. కాబట్టి ఒక గ్లాసు నీటిలో పచ్చి పసుపును వేసి పావుగంట సేపు మరిగించాలి. ఆ తర్వాత చల్లార్చి గోరువెచ్చగా మారాక ఆ పానీయాన్ని తాగుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల నెలసరి మీరు అనుకున్న సమయానికంటే ముందే రావచ్చు.

బొప్పాయి

పీరియడ్స్ ముందుగానే రావాలనుకుంటే బొప్పాయిని ప్రతిరోజు తినండి. బొప్పాయి లోని కెరోటిన్, ఈస్ట్రోజన్ హార్మోన్ ను పెంచుతుంది. ఇది రుతు చక్రాన్ని మెరుగుపరుస్తుంది. బొప్పాయిని రోజుకు రెండుసార్లు తినడం వల్ల ఉపయోగం ఉంటుంది. లేదా బొప్పాయి రసం తాగడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.

ధనియాలు

ప్రతి ఇంట్లోనూ ధనియాలు ఉండడం సహజం. ఒక స్పూను ధనియాలను రెండు కప్పుల నీటిలో వేసి స్టవ్ మీద పెట్టి చిన్న మంట మీద ఉడికించాలి. ఆ నీరు సగానికి తగ్గే వరకు ఉడికించాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని వడకట్టి గోరువెచ్చగా మారాక రోజులో మూడుసార్లు తాగాలి. ఇలా తాగడం వల్ల పీరియడ్స్ త్వరగా వచ్చే అవకాశం ఉంది.

పీరియడ్స్ త్వరగా రావడానికి టాబ్లెట్స్ వాడడం మంచిది కాదు. ఇలా తరచూ టాబ్లెట్స్ ను వాడడం వల్ల సైడ్ ఎఫెక్టులు అధికంగా వస్తాయి. అలాగే క్రమ రహిత పీరియడ్స్ కూడా రావచ్చు. పీరియడ్స్ లో రక్తస్రావం హెచ్చుతగ్గులకు గురవుతుంది. కాబట్టి పీరియడ్స్ త్వరగా రావాలన్నా లేక ఆలస్యం చేయాలననా ఇంటి చిట్కాలను పాటించడం ముఖ్యం.

WhatsApp channel

టాపిక్

Source / Credits

Best Web Hosting Provider In India 2024