Egg Kofta: ఎగ్ కోఫ్తా వండుకుంటే సాయంత్రం స్నాక్స్‌గా అదిరిపోతుంది, పిల్లలకు నచ్చడం ఖాయం

Best Web Hosting Provider In India 2024

Egg Kofta: మలై కోఫ్తా కర్రీ, మటన్ కోఫ్తా కర్రీ, పనీర్ కోఫ్తా కర్రీ విని ఉంటారు. అలాగే కోడిగుడ్డుతో కూడా కోఫ్తా చేయవచ్చు. దీన్ని కావాలనుకుంటే కూరలా వండుకోవచ్చు. లేదా స్నాక్స్ గా తినేయవచ్చు. చూడగానే నోరూరించేలా ఉంటుంది. మటన్ కీమాతో కలిపి ఎగ్ కోఫ్తా రెసిపీ చేస్తే రుచి అదిరిపోతుంది. ఇంటికి వచ్చే అతిధులకు వడ్డిస్తే వారు మెచ్చుకోవడం ఖాయం.

ఎగ్ కోఫ్తా రెసిపీకి కావాల్సిన పదార్థాలు

మటన్ కీమా – 200 గ్రాములు

కోడిగుడ్లు – నాలుగు

ఉప్పు – రుచికి సరిపడా

ధనియాల పొడి – అర స్పూను

కొత్తిమీర తరుగు – మూడు స్పూన్లు

నూనె – సరిపడినంత

నిమ్మరసం – ఒక స్పూను

గరం మసాలా – అర స్పూను

పచ్చిమిర్చి – నాలుగు

అల్లం వెల్లుల్లి పేస్టు – రెండు స్పూన్లు

కారం – అర స్పూను

శెనగపిండి – రెండు స్పూన్లు

ఎగ్ కోఫ్తా రెసిపీ

1. కోడిగుడ్లను ఉడికించి పైన పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి.

2. ఇప్పుడు కుక్కర్లో మటన్ కీమా వేయాలి.

3. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్టు, నిమ్మరసం, కారం, ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు, పచ్చిమిర్చి తరుగు, శెనగపిండి, కొత్తిమీర తరుగు వేసి బాగా కలుపుకోవాలి.

4. నాలుగైదు విజిల్స్ వచ్చే దాకా ఉంచాలి. తరువాత స్టవ్ కట్టేయాలి.

6. ఆ మొత్తం మిశ్రమాన్ని చల్లార్చి మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఆ మొత్తం రుబ్బును తీసి ఒక గిన్నెలో వేయాలి.

7. ఈ మిశ్రమాన్ని ఒక గుడ్డు చుట్టూ పెట్టడానికి సరిపడా ముద్దని తీసుకోవాలి.

8. . ముద్దని చేత్తోనే గుడ్డు చుట్టూ అద్దుకోవాలి.

9. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.

10. నూనె వేడెక్కాక అందులో గుడ్లను వేసి వేయించుకోవాలి.

11. వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. అంతే ఎగ్ కోఫ్తా రెడీ అయినట్టే.

ఉడికించిన గుడ్డును తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. గుడ్డులో పొటాషియం, విటమిన్ ఇ, ఐరన్, జింక్ వంటి పోషకాలు ఉంటాయి. గుడ్డులో ప్రొటీన్ అధికంగా ఉంటుంది. ఇందులో వాడే మటన్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మటన్ తినడం వల్ల గర్భిణులకు మంచిది. పుట్టబోయే పిల్లలకు న్యూరల్ ట్యూబ్ సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది. ఎగ్ కోఫ్తా రెసిపీ తింటే పోషకాహారం లోపం రాకుండా ఉంటుంది.

WhatsApp channel

టాపిక్

Source / Credits

Best Web Hosting Provider In India 2024