Best Web Hosting Provider In India 2024
Raju Yadav Director About Getup Srinu: జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతో పాపులర్ అయ్యాడు గెటప్ శ్రీను. వివిధ రకాల గెటప్స్ వేసి ప్రేక్షకులను నవ్వించాడు. సినిమాల్లోనూ తనదైన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు హీరోగా డెబ్యూ ఎంట్రీ ఇస్తున్నాడు. ఆ సినిమానే రాజు యాదవ్. ఈ సినిమాతో డైరెక్టర్‌గా కృష్ణమాచారి పరిచయం అవుతున్నారు. ఈ సినిమాకు సంగీతం యానిమల్ ఫేమ్ హర్షవర్ధన్ రామేశ్వర్ అందించారు.
మే 17 రాజు యాదవ్ సినిమా థియేటర్లలో విడుదలైన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సినిమా విశేషాలను చెప్పారు డైరెక్టర్ కృష్ణమాచారి. హర్ష వర్ధన్ రామేశ్వర్ ఉండగా సురేష్ బొబ్బిలి గారితో నేపథ్య సంగీతం చేయడానికి గల కారణాన్ని ఆయన వివరించారు.
“హర్ష వర్ధన్ రామేశ్వర్ గారు చాలా అద్భుతమైన పాటలని స్వరపరిచారు. యానిమల్‌కి ముందే పాటలన్నీ ఇచ్చేశారు. యానిమల్ విడుదలైన తర్వాత ఆయన చాలా బిజీ అయ్యారు. సురేష్ బొబ్బిలి కూడా నాకు మంచి స్నేహితుడు. ఆయనతో నేపథ్య సంగీతం చేయించాం. ఆయన నేపథ్య సంగీతం ఎమోషన్‌ని మరోస్థాయికి తీసుకెళుతుంది” డైరెక్టర్ తెలిపారు.
రాజు యాదవ్ కోసం గెటప్ శ్రీను ని తీసుకోవడానికి కారణం ?
రాజు యాదవ్ వెరీ పెర్ఫార్మెన్స్ బేస్డ్ క్యారెక్టర్. కథ రాసుకున్న తర్వాత ఒకరిద్దరి హీరోలతో వర్క్ షాప్ నిర్వహించాం. ఎందుకో నాకు నమ్మకం కుదరలేదు. పాత్రలో జీవిస్తున్నట్లు అనిపించలేదు. ఒక మంచి ఆర్టిస్ట్ కోసం వెతకడం మొదలుపెట్టాను. అప్పుడు గెటప్ శ్రీను గారు ఈ పాత్రకు పర్ఫెక్ట్ అనిపించారు. తను ఇప్పటివరకూ కామెడీ కోణంలోనే కనిపించారు కానీ.. నిజానికి ఆయన చాలా ప్రతిభావంతుడైన నటుడు.
అన్ని రకాల పాత్రలను గెటప్ శ్రీను చేయగలడు. ఈ సినిమా చూసిన తర్వాత తను సౌత్ ఇండియాలో ఒక బెస్ట్ యాక్టర్ అని ప్రేక్షకులు చెబుతారు. ప్రేక్షకులు ఊహించిన దానికంటే ఎక్కువ స్థాయిలో ఉంటుంది. రాజు యాదవ్ గెటప్ శ్రీను కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమా అవుతుంది. ఈ పాత్రలో ఆయన జీవించారు. ఇది మన స్నేహితుడి కథ, మన కథలా సహజంగా ఉంటుంది. అందరికీ కనెక్ట్ అయ్యే కథ.
“గెటప్ శ్రీను గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది ?” అన్న దానికి “గెటప్ శ్రీను గారు డైరెక్టర్స్ ఆర్టిస్ట్. చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు. ఈ సినిమాతో ఆయన మరో స్థాయికి వెళ్తారు” అని డైరెక్టర్ కృష్ణమాచారి పేర్కొన్నారు.
హీరోయిన్ పాత్ర, నిర్మాతల గురించి ?
ఇందులో హీరోది అండర్ రేటెడ్ పాత్ర. హీరోయిన్ పాత్ర గ్లామరస్‌గా ఉంటుంది. తను చాలా చక్కని నటన కనపరిచారు. ఇక నిర్మాతలు ప్రశాంత్ రెడ్డి గారు, రాజేష్ కల్లెపల్లి గారు చాలా సపోర్ట్ చేశారు. ఎక్కడా రాజీపడకుండా సినిమాని నిర్మించారు. ఫస్ట్ కాపీ చూశాం. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. టీం అందరం హ్యాపీగా ఉన్నాం.
భవిష్యత్‌లో ఎలాంటి కథలు చేయాలనుకుంటున్నారు, కొత్త ప్రాజెక్ట్స్ గురించి ?
సహజత్వంతో కూడుకున్న కథలే ఇష్టం. తెరపై చూస్తున్నపుడు ఇది మన కథే అని ప్రేక్షకులు ఫీలయ్యేలా కథలు చేయాలని ఉంది. కొన్ని కథలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం నా దృష్టి అంతా ఈ సినిమా విడుదలపైనే ఉంది.