UK Election Telugu Man Contest : బ్రిటన్ ఎన్నికల బరిలో తెలుగు బిడ్డ, లేబర్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఉదయ్ నాగరాజు

Best Web Hosting Provider In India 2024

UK Election Telugu Man Contest : బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల బరిలో తెలుగు బిడ్డ నిలుస్తున్నాడు. తెలుగోడి సత్తా చాటే పనిలో నిమగ్నమయ్యారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామానికి చెందిన ఉదయ్ నాగరాజు లేబర్ పార్టీ నుంచి ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. నార్త్ బెడ్ ఫోర్డ్ షైర్ నుంచి లేబర్ పార్టీ పార్లమెంటరీ క్యాండిడేట్ గా పార్టీ పక్రటించింది. నార్త్ బెడ్ ఫోర్డ్ షైర్, బౌండరీ కమిషన్ సూచనతో కొత్తగా ఏర్పడ్డ పార్లమెంట్ నియోజకవర్గం. ప్రఖ్యాత సర్వే సంస్థ ఎలెక్టోరల్ కాల్కులస్ ప్రకారం నియోజకవర్గంలో 68 శాతం లేబర్ పార్టీ గెలవబోతుందన్న అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం బ్రిటన్ లో ఎన్నికల హడావిడి మొదలైంది. భారతదేశంలో ఇప్పటికే ఎన్నికలు జరుగుతుండగా ఈ సంవత్సరంలోనే బ్రిటన్, అమెరికాలో సైతం ఎన్నికలు జరగనున్నాయి. రష్యా -ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయిల్ -పాలస్తీనా సంఘర్షణ, ప్రపంచ వ్యాప్తంగా ఆర్థికమాంద్యం ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో జరుగుతున్న బ్రిటన్, అమెరికా ఎన్నికల మీద ప్రపంచ దేశాలు దృష్టి కేంద్రీకృతమై ఉంది.

తెలంగాణ వాసి

ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామానికి చెందిన ఒక సామాన్య మధ్య తరగతి కుటుంబంలో ఉదయ్ నాగరాజు జన్మించారు. శనిగరం గ్రామానికి చెందిన నాగరాజు హనుమంత రావు నిర్మలాదేవి దంపతుల కుమారుడు.చిన్నప్పటి నుంచి కష్టపడేతత్వం కలిగిన ఉదయ్ అంచెలంచాలుగా ఎదిగారు. బ్రిటన్ లోని ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ లండన్ లో పాలనా శాస్త్రంలో పీజీ చేశారు. ప్రపంచ సమాజం, భావితరాలపై ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ పభ్రావం ముందుగానే పసిగట్టి ఏఐ పాలసీ లాబ్స్ అనే థింక్-ట్యాంక్ ని నెలకొల్పారు. అంతర్జాతీయ వక్తగా, రచయితగా మంచి పేరు సంపాదించారు. క్షేత్రస్థాయి సమస్యలపైన ఉదయ్ కు మంచిపట్టు ఉంది. స్కూల్ గవర్నర్ గా, వాలంటీర్ గా, విస్తృత రాజకీయ ప్రచారకుడిగా ఒక దశాబ్దకాలంగా ఇంటింటికీ పచ్రారంతో సామాన్యుల కష్టాలపై మంచి అవగాహన సాధించారు ఉదయ్.

సర్వేల్లో ముందున్న మనోడు

బ్రిటన్ లో అన్ని సర్వే సంస్థల ప్రకారం ఈ ఎన్నికల్లో లేబర్ పార్టీ అఖండ విజయం సాధించి పభ్రుత్వం నెలకొల్పనుందని తెలుస్తుంది. ప్రఖ్యాత తెలుగు రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా ఈ సర్వేల ఆధారంగా కన్సర్వేటివ్ పార్టీ కనీవిని ఎరుగని రీతిలో ఓడిపోయి లేబర్ పార్టీ గెలుస్తుందని విశ్లేషించారు. గత కొన్ని ఎన్నికల్లో లేబర్ పార్టీ ఎంపీలు వరుసగా గెలుస్తూ వస్తున్నారు. ఈ నెలలో జరిగిన కౌన్సిలర్, రాష్ట్ర మేయర్ ఎన్నికలోను లేబర్ పార్టీ ఘనవిజయం సాధించింది. దాంతో తెలుగు ముద్దు బిడ్డ ఉదయ్ నాగరాజు కూడా బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా ఘన విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. తెలుగు బిడ్డ బ్రిటన్ లో ఎంపీగా పోటీ చేస్తుండడం.. గెలుపు దిశగా పయనించడంతో ఆయన స్వగ్రామంలో హర్షం వ్యక్తం అవుతుంది. తెలుగు బిడ్డ ఆ స్థాయికి వెళ్లినందుకు గర్విస్తున్నారు.

HT Telugu Correspondent K.V.REDDY, Karimnagar

IPL_Entry_Point

టాపిక్

Telangana NewsBritainParliamentHyderabadTelugu NewsTrending Telangana
Source / Credits

Best Web Hosting Provider In India 2024