Best Web Hosting Provider In India 2024
Akhila Priya Bodyguard Attacked : ఏపీలో పోలింగ్ అనంతరం వరుసగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ప్రత్యర్థులపై దాడులకు తెగబడుతున్నారు. మంగళవారం రాత్రి ఆళ్లగడ్డలో టీడీపీ అభ్యర్థి అఖిల ప్రియ బాడీ గార్డ్ నిఖిల్ పై దాడి జరిగింది. నిఖిల్ మీద అతని ఇంటి ఎదురుగా హత్యాయత్నం చేశారు ప్రత్యర్థులు. కారుతో గుద్ది, రాడ్లతో దాడి చేస్తారు. ఈ దాడి నుంచి తప్పించుకున్న నిఖిల్ ఇంట్లోకి పారిపోయాడు. నిఖిల్ ఏవీ మోహన్ రెడ్డి మీద జరిగిన దాడి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు.
భూమా అఖిలప్రియ బాడీగార్డ్‌పై జరిగిన హత్యాయత్నం ఘటనపై పోలీసులు పలువురిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఏవీ సుబ్బారెడ్డితో పాటు మరో ఐదుగురిపై కేసు నమోదు చేశారు. ఈ దాడి ఘటనతో అలర్ట్ అయిన పోలీసులు ఎలాంటి ఘర్షణలు తలెత్తకుండా భూమా అఖిల ప్రియ, ఏవీ సుబ్బారెడ్డి ఇంటి వద్ద భారీగా పోలీసులను మోహరించారు. అఖిల ప్రియ బాడీ గార్డ్‌పై దాడి జరగడంలో ఆళ్లగడ్డలో ఉద్రిక్తత నెలకొంది.
అసలేం జరిగింది?
నిన్న రాత్రి అఖిల ప్రియ బాడీ గార్డ్ నిఖిల్ పై జరిగిన దాడి సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. నిఖిల్ మరో వ్యక్తితో కలిసి రోడ్డు దాటుతుండగా… వేగంగా వచ్చిన కారు నిఖిల్ ను ఢీకొట్టింది. దీంతో అతడు ఎగిరి పడ్డాడు. అనంతరం కారులోంచి దిగిన ముగ్గురు వ్యక్తులు నిఖిల్ పై రాడ్డుతో దాడికి పాల్పడ్డారు. ఇంతలో అక్కడున్న వాళ్లు గట్టిగా కేకలు వేయడంతో, నిఖిల్ ఇంట్లోకి పరుగులు పెట్టాడు. అతడిని వెంబడించిన వాళ్లు ఇంటి సమీపంలోకి వచ్చి తిరిగి కారులో పరారయ్యారు. ఈ దాడి ఘటన సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. ఈ దాడిలో గాయపడిని నిఖిల్ ను స్థానిక ఆసుపత్రికి తరలించారు. అతడి తలకు బలమైన గాయం అయ్యిందని వైద్యులు తెలిపారు.
గతంలో ఏవీ సుబ్బారెడ్డి నిఖిల్ దాడి
దాడి ఘటనపై అఖిలప్రియ దాడి ఆరా తీశారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించగా, వారు సీసీ పుటేజ్‌ను పరిశీలించి కేసు నమోదు చేశారు. గతంలో నంద్యాలలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర సమయంలో ఆ పార్టీ నేత ఏవీ సుబ్బారెడ్డిపై అఖిలప్రియ బాడీగార్డ్ నిఖిల్ దాడి చేశాడు. ఈ నేపథ్యంలో ఏవీ సుబ్బారెడ్డి వర్గీయులు తిరిగి నిఖిల్‌పై దాడి చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఏవీ సుబ్బారెడ్డితో సహా మరో ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
సంబంధిత కథనం
టాపిక్