Pushpa 2 Anasuya First Look: పుష్ప 2 నుంచి అనసూయ ఫస్ట్ లుక్.. దాక్షాయణి మళ్లీ వచ్చింది

Best Web Hosting Provider In India 2024

Pushpa 2 Anasuya First Look: ఈ ఏడాది మోస్ట్ అవేటెడ్ మూవీ పుష్ప 2 నుంచి అనసూయ భరద్వాజ్ ఫస్ట్ లుక్ వచ్చేసింది. ఈ మూవీలో దాక్షాయణిగా ఆమె కనిపించనుంది. పుష్ప ది రైజ్ లో ఇదే పాత్రలో ఆమె అదరగొట్టిన విషయం తెలిసిందే. విలన్ మంగళం శీను భార్య దాక్షాయణిగా అనసూయ నటనకు మంచి మార్కులు పడ్డాయి.

పుష్ప 2 అనసూయ లుక్

అనసూయ బుధవారం (మే 15) తన పుట్టిన రోజు జరుపుకుంది. ఈ సందర్భంగా పుష్ప 2 మూవీ టీమ్ ను ఈ కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది. నోట్లో పాన్ వేసుకొని ఓ సీరియస్ లుక్ లో అనసూయ కనిపిస్తోంది. “టాలెంటెడ్ అనసూయకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. దాక్షాయణి పాత్రలో ఆమె పుష్ప 2లో మరోసారి రాబోతోంది. ఈ సినిమా ఆగస్ట్ 15న రిలీజ్ కానుంది” అనే క్యాప్షన్ తో ఈ పోస్టర్ రిలీజ్ చేశారు.

బుల్లి తెర నుంచి వెండితెరకు వచ్చిన అనసూయ ఎన్నో పాత్రలు పోషించినా రంగస్థలంలో రంగమ్మత్త పాత్ర, ఈ పుష్పలోని దాక్షాయణి పాత్ర మాత్రం బాగా పేరు తెచ్చి పెట్టాయి. పుష్పలో మాత్రం తనదైన విలనీని పోషించి సునీల్ కు పోటాపోటీగా నటించింది. ఇప్పుడు పుష్ప 2లో ఆమె పాత్ర ఎలా ఉండబోతోందో అన్న ఆసక్తి నెలకొంది.

పుష్ప తొలి పార్ట్ లో ఆమె పాత్ర నిడివి తక్కువగానే ఉంది. అయితే రెండో భాగంలో మాత్రం ఆమె మరింత కీలకపాత్ర పోషించబోతున్నట్లు సమాచారం. ఇక తొలి పార్ట్ లో కేవలం 15 రోజుల షూటింగ్ లోనే అనసూయ పాల్గొన్నట్లు వార్తలు వచ్చాయి. ఇక ఒక్కో రోజుకు ఈ సినిమా కోసం ఆమె లక్ష నుంచి లక్షన్నర వరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలిసింది.

అనసూయ బర్త్‌డే

అనసూయ తన 45వ పుట్టిన రోజు జరుపుకుంది. మొదట్లో న్యూస్ ప్రెజెంటర్ గా తన కెరీర్ ప్రారంభించి, తర్వాత జబర్దస్త్ ప్రోగ్రామ్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. తర్వాత సోగ్గాడే చిన్ని నాయనా మూవీతో మెల్లగా సినిమాల వైపు అడుగులు వేసింది.

అనసూయ భరద్వాజ్ ఈ మధ్య సినిమాల జోరు పెంచింది. గతేడాది ఏకంగా ఆరు సినిమాల్లో ఆమె కనిపించింది. మైఖేల్, రంగ మార్తాండ, ప్రేమ విమానంలాంటి సినిమాలు ఉన్నాయి. ఇక ఈ మధ్యే రజాకార్ సినిమాలోనూ లీడ్ రోల్లో కనిపించింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది.

ఇప్పుడు పుష్ప 2తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ఆగస్ట్ 15న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. గతే నెలలోనే అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా పుష్ప 2 నుంచి ఫస్ట్ సింగిల్ కూడా రిలీజైంది. గ్లింప్స్, ఫస్ట్ సింగిల్, ఫస్ట్ లుక్స్ తో మూవీ ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. మరో మూడు నెలల సమయం ఉండటంతో మేకర్స్ పాన్ ఇండియా స్థాయిలో ప్రమోషన్ల జోరును మరింత పెంచనున్నారు.

IPL_Entry_Point

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024