Jr NTR Donation: ఏపీలోని ఆలయానికి భారీ విరాళం ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్: వివరాలివే

Best Web Hosting Provider In India 2024

Jr NTR Donation: మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు. భారీ యాక్షన్ థ్రిల్లర్ దేవర మూవీలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్నారు. అలాగే, బాలీవుడ్ సినిమా ‘వార్ 2’లోనూ హృతిక్ రోషన్‍తో కలిసి ఎన్టీఆర్ ప్రధాన పాత్ర చేస్తున్నారు. ఈ రెండు చిత్రాల షూటింగ్‍లో ఎన్టీఆర్ పాల్గొంటున్నారు. ఈనెల మే 20వ తేదీన ఎన్టీఆర్ తన 41వ పుట్టిన రోజును జరుపుకోనున్నారు. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్‍లోని ఓ ఆలయానికి విరాళం ఇచ్చారు ఎన్టీఆర్.

ఏ ఆలయానికి అంటే..

కోనసీమ జిల్లా (ఉమ్మడి తూర్పుగోదావరి) చెయ్యేరులోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవాలయానికి జూనియర్ ఎన్టీఆర్ రూ.12.5లక్షల విరాళం అందించారు. ఈ విషయాన్ని ఓ నెటిజన్ ఎక్స్ (ట్విట్టర్‌)లో పోస్ట్ చేశారు. “శ్రీభద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయానికి తారక్ రూ.12,50,000 విరాళం ఇచ్చారు” అని పోస్ట్ చేశారు. ఈ విషయాన్ని ఎన్టీఆర్ టీమ్.. హిందుస్థాన్ టైమ్స్‌కు కన్ఫర్మ్ చేసింది.

కుటుంబ సభ్యుల పేర్లతో..

కుటుంబ సభ్యుల పేర్లతో ఆ దేవాలయ నిర్మాణానికి ఎన్టీఆర్ విరాళం ఇచ్చారు. “తన పుట్టిన రోజుకు ముందు తారక్ ఈ విరాళం ఇచ్చారన్నది నిజం. తన తల్లి (శాలినీ). భార్య (లక్ష్మి ప్రణతి), తన పిల్లలు (అభయ్, భార్గవ్) పేర్లతో ఆయన ఈ డొనేషన్ చేశారు. ఆయన తన సేవా కార్యక్రమాలను బయటికి చెప్పుకునేందుకు పెద్దగా ఇష్టపడరు. తూర్పు గోదావరి ఉమ్మడి జిల్లా నుంచి కొందరు ఆన్‍లైన్‍లో ఫొటోలు షేర్ చేయటంతో ఈ విషయం బయటికి వచ్చింది” అని ఎన్టీఆర్ టీమ్ తెలిపింది.

జూనియర్ ఎన్టీఆర్ విరాళం ఇచ్చినట్టు ఆలయం దగ్గర ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది నిజమేనని కూడా స్పష్టమైంది.

ఎన్టీఆర్ ఇంతకు ముందు కూడా చాలాసార్లు సేవా కార్యక్రమాలకు విరాళాలు ఇచ్చారు. వరద బాధితులకు సాయం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.25లక్షలను గతంలో అందించారు. కరోనా సమయంలో సినీ పరిశ్రమలో రోజువారి వర్కర్లకు సాయం చేసే కార్యక్రమానికి కూడా రూ.25లక్షలు ఇచ్చారు. అలాగే, మరిన్ని సేవా కార్యక్రమాలకు కూడా విరాళాలు ఇచ్చారు ఎన్టీఆర్.

దేవర ఫస్ట్ సాంగ్

కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమా నుంచి తొలి పాట వచ్చేస్తోంది. ఎన్టీఆర్ పుట్టిన రోజు మే 20న ఉండగా.. ఆ సందర్భంగా ఒక్కరోజు ముందు మే 19న ఈ చిత్రం నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని మూవీ టీమ్ అధికారంగా ఖరారు చేసింది. ‘ఫియర్ సాంగ్’ అంటూ పాట వచ్చేస్తోందని పేర్కొంది. దేవర మూవీకి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.

దేవర సినిమాలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‍గా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. అక్టోబర్ 10వ తేదీన ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్టు మూవీ టీమ్ వెల్లడించింది. అలాగే, ఎన్టీఆర్ పుట్టిన రోజున ప్రశాంత్ నీల్‍తో సినిమా అప్‍డేట్ కూడా వస్తుందనే అంచనాలు ఉన్నాయి.

 
IPL_Entry_Point
 

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024