Best Web Hosting Provider In India 2024
AP TS Local Issue: తెలంగాణలో జూన్ 2వ తేదీ తర్వాత ఏపీ విద్యార్ధులకు వర్తించే స్థానికేతర కోటా 15శాతం రద్దు చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఈ విద్యా సంవత్సరం కొనసాగించాలని ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో అమలవుతున్న స్థానికేతర కోటాలు జూన్2 తర్వాత రద్దు కానున్నాయి. పదేళ్ల పాటు మాత్రమే ప్రయోజనాలు కొనసాగించాలని విభజన చట్టంలో పేర్కొన్న నేపథ్యంలో జూన్ 2 తర్వత జరిగే కామన ఎంట్రన్స్ టెస్ట్‌లకు లోకల్ రిజర్వేషన్ రద్దు చేస్తున్నట్టు కొద్ది రోజుల క్రితం తెలంగాణ ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అమలు చేస్తున్న 15% స్థానికేతర కోటాపై సందిగ్ధత నెలకొంది. జూన్ 2 తర్వాత విడుదల చేసే ప్రవేశ పరీక్షల నోటిఫికేషన్లకు 15% కోటా ఉండదని ఇప్పటికే తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఏపీ విద్యార్ధుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాదికి 15% కోటా కొనసాగించాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వానికి ఏపీ ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు లేఖ రాశారు.
కోటా రద్దు అవుతుందని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ విజ్ఞప్తిపై ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే సమాధానం ఆధారంగా ఏపీలో 15% కోటా అమలుపై నిర్ణయం తీసుకోనున్నారు.
ఆంధ్రప్రదేశ రాష్ట్ర విభజనకు జూన్ 2తో పదేళ్లు పూర్తవు తుంది. విభజన చట్టం ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 15% ఓపెన్ కోటా అమల్లో ఉంటుంది. ఎక్కడి వారు ఎక్కడైనా ఈ కోటాలో అడ్మిషన్లు పొందే అవకాశం ఉంటుంది. జూన్2 తర్వాత ఇచ్చే ప్రకటనలకు సంబంధించిన సీట్ల కేటాయింపుపై రెండు తెలుగు రాష్ట్రాలు నిర్ణయం తీసు కోవాల్సి ఉంది.
ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవే శాలకు జరిగే ఈఏపీ సెట్‌ల ప్రవేశాల కోసం ఏపీ విద్యార్ధుల నుంచి నాన్‌లోకల్ సీట్లకు ఓపెన్ కోటాకు డిమాండ్ ఉంటుంది. తెలంగాణలో స్థిరపడిన ఏపీ విద్యార్ధులు, ఏపీ వారు తెలంగాణలో ప్రవేశ పరీక్షలకు హాజరవుతారు. ఇప్పటికే తెలంగాణ ఈఏపీ సెట్ పూర్తైంది.
మే నెలలోనే ఏపీలో కూడా పరీక్షలు జరుగుతున్నందున ఈ ఏడాది ఓపెన్ కోటా కొనసాగుతుంది. మరోవైపు తెలంగాణలో కొన్ని ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు, యూనివర్శిటీల్లో ప్రవేశాలకు నాన్‌లోకల్ కోటా ఉపయోగపడేది. యూనివర్శిటీల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్ పీజీ ఎంట్రన్స్ నోటిఫికేషన్ బుధవారం విడుదలైంది.
జూన్2తో ఉమ్మడి హక్కులు రద్దు…
తెలంగాణ విద్యా సంస్థలతో ఆంధ్రప్రదేశ్ విద్యార్ధుల బంధం ముగింపు దశకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం గడువు ముగియనుండటంతో ఇకపై ఏపీ విద్యార్ధులు నాన్‌లోకల్ కానున్నారు.
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో (AP ReOrganizaton Act) విద్యా సంస్థల్లో ఉమ్మడి ప్రవేశాల Common Admissions గడువు ముగియనుండటంతో తెలంగాణ విద్యా శాఖ అధికారులు అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు. పదేళ్ల పాటు రెండు రాష్ట్రాల విద్యా సంస్థల్లో ఉమ్మడి ప్రవేశాలకు వీలు కల్పించిన నిబంధన గడువు జూన్ 2తో ముగియనుంది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి పదేళ్లు పూర్తి కానుండటంతో విభజన చట్టంలోని నిబంధనల చెల్లుబాటు కూడా ముగియనుంది.
AP ఏపీ స్థానికత కలిగిన విద్యార్ధులకు telangana తెలంగాణ విద్యా సంస్థల్లో ప్రవేశాలకు ఈ ఏడాదే చివరి అవకాశం కానుంది. ఇకపై ఏపీ విద్యార్ధులు నాన్ లోకల్ కోటాలోనే ప్రవేశాలు పొందాల్సి ఉంటుంది.
తెలంగాణలో వివిధ విద్యా సంస్థల్లో Admissions ప్రవేశాల కోసం అయా యూనివర్శిటీలు, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో ఏటా కామన్ ఎంట్రన్స్ పరీక్షల్ని నిర్వహిస్తుంటాయి. ఈఏపీ సెట్(గతంలో ఎంసెట్), ఐసెట్, లాసెట్, ఎడ్ సెట్ వంటి పరీక్షలతో పాటు పీజీ ఎంట్రన్స్‌లను ఆయా వర్శిటీలు నిర్వహించేవి. ఈ విద్యా సంస్థల్లో తెలంగాణ విద్యార్ధులతో పాటు గత పదేళ్లుగా ఏపీ విద్యార్ధులకు కూడా ప్రవేశాలు దక్కాయి.
రాష్ట్ర విభజన గడువు ముగియనుండటంతో ఈ ఏడాది జూన్2లోపు జరిగే ప్రవేశ పరీక్షలకు మాత్రమే రిజర్వేషన్లు వర్తింప చేయనున్నట్టు తెలంగాణ విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం స్పష్టత ఇచ్చారు. ఏపీ విభజన చట్టం ప్రకారం విద్యా సంస్థల్లో ఉమ్మడి ప్రవేశాల నిబంధనకు గడువు 2024 జూన్2తో ముగిసిపోతుంది.
ఇకపై తెలంగాణ విద్యా సంస్థల్లో ఉన్న సీట్లు మొత్తం తెలంగాణ స్థానికత కలిగిన వారికే అందుబాటులోకి వస్తాయి. ఏపీ విద్యార్ధులు తెలంగాణ ప్రవేశ పరీక్షలు రాసినా నాన్ లోకల్ క్యాటగిరీలో మాత్రమే ప్రవేశాలు కల్పిస్తారు. తెలంగాణ విద్యా సంస్థల్లో ఎలాంటి రిజర్వేషన్లు వర్తించవని విద్యాశాఖ కార్యదర్శి స్పష్టత ఇచ్చారు.
ఇప్పటికే మెడికల్ కాలేజీల్లో రిజర్వేషన్లు రద్దు…
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కొత్తగా ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీల్లో ఏపీ విద్యార్ధులకు రిజర్వేషన్లు వర్తించవని గతంలోనే తెలంగాణ ప్రభుత్వం జీవోలు విడుదల చేసింది. ఆ తర్వాత ఏపీ కూడా అదే బాటలో కొత్త మెడికల్ కాలేజీల్లో ఏపీ విద్యార్థులకు మాత్రమే ప్రవేశాలు కల్పిస్తూ జీవో జారీ చేసింది.
తెలంగాణ రాష్ట్రంతో ఏపీకి ఉన్న బంధం జూన్ 2 తర్వాత శాశ్వతంగా ముగియనుంది. ఇకపై దేశంలోని ఇతర రాష్ట్రాల మాదిరే ఏపీ స్థానికత కలిగిన వారు కూడా తెలంగాణలో విద్యాభ్యాసం కొనసాగించవచ్చు. అయితే వారికి ప్రత్యేకంగా ఎలాంటి ప్రభుత్వ పథకాలు, రిజర్వేషన్లు వర్తించవు. ఫీజు రియింబర్స్‌మెంట్ పథకాలు కూడా వారికి వర్తించవు.
సంబంధిత కథనం
టాపిక్