Love Me Trailer: భయపెడుతున్న వైష్ణవి చైతన్య లవ్ మి ట్రైలర్.. ఇంతకీ ఆ దెయ్యం ఎవరు?

Best Web Hosting Provider In India 2024

Love Me Trailer: బేబీ మూవీ ఫేమ్ వైష్ణవి చైతన్య నటిస్తున్న మూవీ లవ్ మి (Love Me). ఇదొక హారర్ లవ్ స్టోరీ కావడం విశేషం. దిల్ రాజు అన్న కొడుకు ఆశిష్ నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్ గురువారం (మే 16) రిలీజైంది. జానర్ కు తగినట్లే ఓవైపు హారర్, మరోవైపు లవ్ స్టోరీ కలగలిపి ట్రైలర్ మొత్తం చాలా ఆసక్తికరంగా సాగింది. లవ్ మి మూవీకి ఇఫ్ యు డేర్ అనే ట్యాగ్‌లైన్ పెట్టడం విశేషం.

లవ్ మి ట్రైలర్

బేబీ మూవీతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన నటి వైష్ణవి చైతన్య. ఆమె నటిస్తున్న మూవీ లవ్ మి. అరుణ్ భీమవరపు డైరెక్ట్ చేసిన ఈ సినిమా ట్రైలర్ రిలీజైంది. అందరూ భయపడే ఓ దెయ్యం చుట్టూ తిరుగుతూ ప్రేమిస్తున్నానని వెంటనే పడే హీరోగా ఆశిష్ ఇందులో కనిపించాడు. రెండు నిమిషాల ఈ ట్రైలర్ ఆసక్తికరంగా, భయపెట్టేలా సాగింది.

ప్రతి రోజూ రాత్రి 8 గంటలకు ఓ అలారం మోగుతుంది అనే వాయిస్ ఓవర్ తో ఈ ట్రైలర్ ప్రారంభమైంది. ఆ సమయానికి ఊళ్లోని వాళ్లందరూ భయంతో తలుపులు మూసుకుంటే.. శోభనం రాత్రిలో ఉన్న ఓ జంట మాత్రం తలుపు తెరుస్తుంది. బయట ఏదో కనిపించి పెళ్లి కూతురు గట్టిగా అరుస్తుంది. అక్కడ కట్ చేస్తే హీరో ఇంట్రడక్షన్ మొదలవుతుంది.

ఎవరైనా ఏదైనా పని చేయొద్దు అంటే చేయాలనిపిస్తుంది.. ఎవరైనా అటు డేంజర్ వెళ్లొద్దు అంటే అటే వెళ్లాలనిపిస్తుంది అనే డైలాగ్ తో హీరో ఎంట్రీ ఇస్తాడు. ఆ తర్వాత ఆ దెయ్యంతో అతని ఆటలు, అతన్ని ప్రేమించే ప్రియ (వైష్ణవి చైతన్య) అక్కడికి వెళ్లొద్దంటూ భయపడటం, ఇంతమందిని చంపిన ఆ దెయ్యం నిన్ను వదిలేస్తుందా అనే ఫ్రెండ్స్ బెదిరింపులతో ట్రైలర్ మొత్తం ఆసక్తికరంగా సాగిపోయింది.

దెయ్యంతో ప్రేమలో పడే మనిషి

ట్రైలర్ చూస్తుంటే సినిమా అసలు పాయింట్ ఏందనేది స్పష్టంగా తెలిసిపోతుంది. దెయ్యంతో ప్రేమలో పడే మనిషి కథే ఈ లవ్ మి. ఈ కొత్త పాయింట్ తోనే దర్శకుడు ప్రేక్షకులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ హారర్ థ్రిల్లర్ మూవీ ట్రైలర్ ను కూడా అందుకు తగినట్లే కట్ చేశారు. ఇక ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి తన బీజీఎంతో మరింత భయపెట్టాడు.

ఈ సినిమా గత నెలలోనే రిలీజ్ కావాల్సి ఉన్నా.. ఆలస్యమైంది. మేకర్స్ ఇప్పటికీ రిలీజ్ డేట్ ను ఇంకా అనౌన్స్ చేయలేదు. ట్రైలర్ ఆసక్తికరంగా ఉండటంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. వైష్ణవి చైతన్యకు ఉన్న క్రేజ్ కూడా ఈ సినిమాకు అదనపు బలం కానుంది.

ఇదొక్కటే కాదు బేబీ తర్వాత ఆమెకు సినిమాలు క్యూ కడుతున్నాయి. ల‌వ్ మీతో పాటు సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ‌తో యాక్ష‌న్ మూవీ చేస్తోంది. ఈ సినిమాకు బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్నాడు. బేబీ త‌ర్వాత ఆనంద్ దేవ‌ర‌కొండ‌తో మ‌రో సారి రొమాన్స్ చేయ‌నుంది వైష్ణ‌వి చైత‌న్య‌. వాటితో పాటు మ‌రో రెండు సినిమాల‌కు ఆమె గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం.

IPL_Entry_Point

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024