
Best Web Hosting Provider In India 2024

IRCTC Simhachalam Arakku Tour : టూరిజం ప్రదేశాలను చూసేందుకు కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తూనే ఉంది ఐఆర్‌సీటీసీ టూరిజం. దేశవ్యాప్తంగానూ టూరిస్ట్ ప్లేస్ లను చూసేందుకు తక్కువ ధరలోనే వీటిని ఆపరేట్ చేస్తోంది.
తాజాగా ‘వైజాగ్ రీట్రీట్’ పేరుతో మరో ప్యాకేజీని తీసుకువచ్చింది. ఇందులో భాగంగా విశాఖ, అరకు, సింహాచలానికి వెళ్లి రావొచ్చు. ప్రస్తుతం 21 మే 2024వ తేదీన ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది. 2 రాత్రులు, 3 రోజుల టూర్ ప్యాకేజీ ఇది.
వైజాగ్ రీట్రీట్ ప్యాకేజీ షెడ్యూల్ – ముఖ్య వివరాలు
- అరకు,సింహాచలం చూసేందుకు ‘వైజాగ్ రీట్రీట్’ పేరుతో ఐఆర్‌సీటీసీ టూరిజం ప్యాకేజీని ప్రకటించింది.
- ఈ టూర్ ప్యాకేజీని వైజాగ్ నుంచి ఆపరేట్ చేస్తుంది.
- 2 రాత్రులు, 3 రోజుల టూర్ ప్యాకేజీ ఇది.
- ప్రస్తుతం 21 మే 2024వ తేదీన ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది. ఈ తేదీ మిస్ అయితే మరో తేదీలో వెళ్లొచ్చు.
- ఫస్ట్ డే – మార్నింగ్ విశాఖపట్నం విమానాశ్రయం, రైల్వేస్టేషన్, బస్‌స్టాండ్ నుంచి టూరిస్టులను పికప్ చేసుకొని హోటల్‌కు తీసుకెళ్తారు. బ్రేక్ ఫాస్ట్ తర్వాత తొట్లకొండ బుద్ధిస్ట్ కాంప్లెక్స్, కైలాసగిరి, రుషికొండ బీచ్, రామానాయుడు ఫిలిం స్టూడియో, ఫిషింగ్ హార్బర్ లాంటి టూరిస్ట్ స్పాట్స్‌కి తీసుకెళ్తారు. రాత్రి వైజాగ్ లోనే ఉంటారు.
- సెకండ్ డే – ఉదయం 8 గంటలకు అరకు బయల్దేరుతారు. ఈ జర్నీచాలా బాగుంటుంది. దారిలో పద్మపురం గార్డెన్స్, ట్రైబల్ మ్యూజియం, అనంతగిరి కాఫీ తోటలు, గాలికొండ వ్యూ పాయింట్, బొర్రా గుహలను సందర్శించిన తర్వాత రాత్రికి విశాఖపట్నం చేరుకుంటారు.
- మూడో రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత సింహాచలం హాఫ్ డే టూర్ ఉంటుంది. ఆ తర్వాత విశాఖపట్నం తిరిగి రావాలి. లంచ్ తర్వాత Submarine Museum ను చూడొచ్చు,
- టూరిస్టులు ఎయిర్‌పోర్ట్, రైల్వేస్టేషన్, బస్‌స్టాండ్ దగ్గర దిగొచ్చు. దీంతో ప్యాకేజీ ముగుస్తుంది.
- వైజాగ్ రీట్రీట్ టూర్ ప్యాకేజీ ధరలు : కంఫర్ట్ క్లాస్ లో ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర రూ.7990, డబుల్ ఆక్యుపెన్సీ ధర రూ.10980, సింగిల్ ఆక్యుపెన్సీ ధర రూ.19950గా ఉన్నాయి.
- 5 – 11 ఏళ్ల చిన్నారులకు వేర్వురు ధరలు ఉన్నాయి.
- https://www.irctctourism.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి బుకింగ్ తో పాటు పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు
టాపిక్
IrctcIrctc PackagesTravelAndhra Pradesh News