Best Web Hosting Provider In India 2024
Sweetcorn Dosa: స్వీట్ కార్న్ మార్కెట్లో అధికంగానే లభిస్తుంది. ఇది తక్కువ ధరకే అందుబాటు ధరలో ఉంది. కాబట్టి రకరకాల రెసిపీలను ప్రయత్నించవచ్చు. ఇక్కడ మేము స్వీట్ కార్న్ దోశ రెసిపీ ఇచ్చాము. దీన్ని చేయడం చాలా సులువు. పిల్లలు ఇష్టంగా తింటారు. ఎప్పుడు ఒకేలాంటి దోశ తిని బోర్ కొట్టిన వారికి ఈ స్వీట్ కార్న్ దోశ నచ్చడం ఖాయం. దీన్ని సులువుగా ఎలా చేయాలో ఇక్కడ ఇచ్చాము. ఈ రెసిపీని ఫాలో అవ్వండి.
స్వీట్ కార్న్ దోశ రెసిపీకి కావలసిన పదార్థాలు
బియ్యం – ఒక కప్పు
స్వీట్ కార్న్ – ఒక కప్పు
పచ్చిమిర్చి – రెండు
ఉప్పు – రుచికి సరిపడా
నూనె – తగినంత
జీలకర్ర – అర స్పూను
స్వీట్ కార్న్ దోశ రెసిపీ
1. బియ్యాన్ని నాలుగు గంటల పాటు ముందుగానే నానబెట్టుకోవాలి.
2. తర్వాత మిక్సీలో ఆ బియ్యాన్ని వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
3. ఆ రుబ్బులోనే స్వీట్ కార్న్, జీలకర్ర, పచ్చిమిర్చి, రుచికి సరిపడా ఉప్పును కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
4. దీన్ని పావుగంట సేపు పక్కన పెట్టుకోవాలి.
5. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి నూనె రాయాలి.
6. ఈ పిండిని దోశలాగా వేసుకోవాలి.
7. రెండు వైపులా ఎర్రగా కాల్చుకొని సర్వ్ చేసుకోవాలి.
8. దీన్ని కొబ్బరి చట్నీతో, టమాటా చట్నీతో, పల్లీల చట్నీతో తింటే చాలా బాగుంటుంది. పిల్లలకు ఇది మంచి బ్రేక్ ఫాస్ట్ రెసిపీ.
స్వీట్ కార్న్ ఆరోగ్యానికి అంతా మేలే చేస్తుంది. ఇందులో ఫాస్ఫరస్ అధికంగా ఉంటుంది. ఎముకల ఆరోగ్యానికి, కిడ్నీలను కాపాడేందుకు ఇది సహాయపడుతుంది. అలాగే ఇందులో ఉండే మెగ్నీషియం గుండెకు రక్షణగా నిలుస్తుంది. స్వీట్ కార్న్ తో చేసిన ఆహారాలు తినడం వల్ల చర్మం మెరుపు సంతరించుకుంటుంది. అలాగే రక్తహీనత సమస్యతో బాధపడుతున్న పిల్లలు, మహిళలు కూడా వీటిని ఆహారంలో భాగం చేసుకోవాలి.
డయాబెటిస్ ఉన్నవారు స్వీట్ కార్న్‌ను తినడం మంచిది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. అలాగే శరీర బరువును తగ్గించుకోవడానికి కూడా ఇది సహాయపడుతుంది. కంటిచూపు సమస్యలు ఉన్నవారు కూడా స్వీట్ కార్న్ తినడం మంచిది. దీన్ని తినడం వల్ల మతిమరుపు రాకుండా ఉంటుంది. మంచి కొలెస్ట్రాల్ ను శరీరంలో ఉత్పత్తి చేసే శక్తి స్వీట్ కార్న్ కి ఉంది. దీన్ని సూపర్ ఫుడ్ గా చెప్పుకోవాలి. ఇలా స్వీట్ కార్న్ దోశెలు చేసుకుని తింటే అందులో ఉన్న పోషకాలు అన్నీ శరీరానికి అందుతాయి.
టాపిక్