Krishna mukunda murari serial:ముకుందకు మురారి సేవలు.. మీరా నెల తప్పిందన్న భవానీ, షాక్ లో కృష్ణ

Best Web Hosting Provider In India 2024

Krishna mukunda murari serial today may 17th episode: ఆదర్శ్, ముకుంద పెళ్లి బాధ్యతను భవానీ కృష్ణ వాళ్ళకి అప్పగిస్తుంది. ఇద్దరి జాతకాలను బట్టి వచ్చే శుక్రవారం ముహూర్తం ఉందని పంతులు చెప్పడంతో కృష్ణ వాళ్ళు షాక్ అవుతారు. వారం రోజుల్లో పెళ్లి పనులు అంటే అయిపోతాయా అంటే ఎందుకు అవవు అని ఆదర్శ్ ఆత్రంగా అంటాడు.

బ్లాక్ మెయిల్ కి దిగిన మీరా

ఆదర్శ్ ని చూసి మీరా తెగ సిగ్గుపడిపోతుంది. మురారి వాళ్ళు తన వైపు చూసేసరికి ఫేస్ ఫీలింగ్స్ మార్చేస్తుంది. పంతులు లగ్నపత్రిక రాస్తాడు. మీరా కృష్ణ వాళ్ళని పక్కకి తీసుకొచ్చి మాట్లాడుతుంది. నువ్వు కడుపు లేకపోయినా మ్యానేజ్ చేస్తున్నావు.

మీరు నా గురించి ఆలోచిస్తున్నారా లేదా అని అడుగుతుంది. పెద్దమ్మ ఇంత త్వరగా ముహూర్తాలు పెట్టిస్తుందని ఊహించలేదని మురారి అంటాడు. కృష్ణకి గర్భసంచి పోతుందని మీరు ఊహించారా? పోయింది మీ బిడ్డని నా కడుపులో మోయాల్సి వస్తుందని ఊహించారా? కానీ మోస్తున్నాను.

పెళ్లి ముహూర్తాలు పెట్టేశారు. తొందరగా ఏదో ఒకటి చేయండి లేదంటే మన ముగ్గురి కుట్ర బయట పడుతుందని బెదిరిస్తుంది. మీరా కుట్రలు ఎవరు చేయడం లేదు తెలియకుండా ఇరుక్కుపోయి ఎలా బయటకు రావాలో తెలియడం లేదని కృష్ణ అంటుంది.

పెళ్లి ఇష్టం లేదని చెప్పను

పెళ్లి ఆపడానికి ఏదో ఒక ప్రయత్నం చేస్తారు. అది ఏదైనా అయితే పెళ్లి కూతురి కడుపులో మా బిడ్డ పెరుగుతుందని చెప్పలేరు కదా. అప్పుడు ఆదర్శ్ కావాలని మీరు ఈ పెళ్లి చెడగొట్టారని అనుకుంటారు. అది అందరి దృష్టిలో కుట్ర కిందకు వస్తుంది కదా.

ఎలాగైనా పెళ్ళికి ఆపమని చెప్తుంది. ఈ పెళ్లి ఇష్టం లేదని ఒక్క మాట చెప్తే ఇంతవరకు వచ్చి ఉండేది కాదని కృష్ణ నిలదీస్తుంది. నేను ఎందుకు చెప్పలేనవ నీకు కారణం చెప్పాను కదా. పెద్దావిడ నాకోసం ఇంత చేశారు. ఇప్పుడు కోడలిని చేసుకుంటానంటే కాదని అనగలనా? ఇప్పుడు ఏ కారణం చెప్పి కాదని చెప్పాలి.

ఈ పెళ్లి కోసం నేనేదో ఆశ పడుతున్నానని అనుకోవద్దు. మీరు ఈ పెళ్లి క్యాన్సిల్ చేసేయండి. హ్యాపీగా మీ బిడ్డని మీకు కనిపెడతాను. నా నోటితో ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్తానని అనుకోవద్దని చెప్తుంది. టెన్షన్ తీసుకోవద్దు బిడ్డకు ప్రాబ్లం అవుతుందని మురారి అంటాడు.

మీరా కావాలని చేస్తుంది

భవానీ సంతోషంగా ఉంటుంది. రేవతి వచ్చి కృష్ణ ఎప్పుడు హుషారుగా ఉంటుంది. కానీ ఇది కృష్ణకి నచ్చినట్టు లేదు ఇందాక మీరు ఆ మాట అన్నప్పుడు మొహం మాడ్చుకుందని చెప్తుంది. తను అలా మొహం మాడ్చుకుంటే చూస్తూ కూర్చోలేనని భవానీ అంటుంది.

కృష్ణ మీద భవానీ ప్రేమ చూసి రేవతి మురిసిపోతుంది. మీరా ఇదంతా కావాలని చేస్తున్నట్టు అనిపిస్తుందని కృష్ణ అనుమానపడుతుంది. అలా ఏమి లేదని మీరాని మురారి నమ్ముతాడు. అనవసరంగా మీరాని అనుమానించడం మానేయమని చెప్తాడు.

నిజం చెప్పేశారా?

భవానీ కృష్ణని పిలుస్తుంది. పెళ్లి పనులు చూసుకోవడానికి ఇంట్లో చాలా మంది ఉన్నారు రెస్ట్ తీసుకోమని భవానీ కృష్ణకి చెప్తుంది. పెళ్లి పనులు చూసుకోవడానికి ఈవెంట్ మేనేజర్ తీసుకుని వస్తాడు మధు. పెళ్లి పనులన్నీ చేస్తాడని చెప్తాడు. నీ పేరెంటి అంటే పనిలేని సుధాకర్ అంటాడు.

పనిలేని అంటే పని లేకపోవడం కాదు అది తన ఇంటి పేరు అని చెప్తాడు. కాసేపు నవ్వు రాని కామెడీ చేస్తాడు. నిన్ను దగ్గరుండి చూసుకోవడానికి మనుషులను పిలిపిస్తున్నానని భవానీ చెప్తుంది. ఎవరని కృష్ణ రేవతిని అడుగుతుంది. మీరా వచ్చి పెళ్లి ఆపేందుకు నిజం చెప్పారా అని డ్రామా ఆడుతుంది.

ముకుందకు మురారి సేవలు

అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర భోజనం చేస్తూ ఉంటారు. ముకుందకి వాంతులు అవుతాయి. మురారి పరుగున వెళ్ళి తన చెవులు మూస్తాడు. అప్పుడే ఆదర్శ్ వచ్చి వాళ్ళ వైపు కోపంగా చూస్తాడు. నీతో ఈ సేవలు చేయించుకోవడం కోసం నీ బిడ్డని నా కడుపులో పెట్టుకున్నాను.

ఇక నుంచి నేను నీ వెంట పడటం కాదు నువ్వే నా వెంట పడతావని ముకుంద మనసులో అనుకుంటుంది. కడుపుతో ఉన్న కృష్ణకి వాంతులు కావడం లేదు పెళ్లి కానీ ముకుంద వాంతులు చేసుకుందని రజిని అనేస్తుంది. రేవతి తనకి గడ్డి పెడుతుంది. వాంతి చేసుకోగానే మురారి పరిగెత్తాడని అంటుంది.

ముకుంద తల్లి కాబోతుందా?

చిన్నగా అందరిలో డౌట్ మొదలైంది ఇంకో రెండు సార్లు ఇలా జరిగితే మొత్తం తెలిసిపోతుందని అనుకుంటుంది. ఏమైందని ప్రాబ్లం ఏంటి ఎవరితోనూ చెప్పలేకపోతే నాతో అయినా చెప్పు అని ఆదర్శ్ ప్రేమగా అడుగుతాడు. ఎవరితోనూ చెప్పుకోలేని ప్రాబ్లం ఏమై ఉంటుంది.

ఒకవేళ ముకుంద కూడా తల్లి కావడం లేదు కదాని భవానీ అనుమానపడుతుంది. దానికి ఆదర్శ్ కారణం కాదు కదా అని అనుకుంటుంది. ఇంట్లో ఎవరు నెల తప్పారో నాకు అర్థం కావడం లేదని రజిని గొణుగుతుంది. అక్కడితో నేటి కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.

తరువాయి భాగంలో..

భవానీ కృష్ణని పిలిచి మాట్లాడుతుంది. మీరా నెల తప్పిందని భవానీ అనగానే కృష్ణ షాక్ అయిపోతుంది. తనకి పెళ్లి కాలేదు కదా అంటే నీకు అంత నమ్మకం లేకపోతే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయమని భవానీ అంటుంది. వాళ్ళ మాటలు ముకుంద వింటూ ఉంటుంది.

 
IPL_Entry_Point
 

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024