Hari Om OTT: దేశంలోనే తొలి భక్తి ఓటీటీ హరి ఓం.. ప్రారంభిస్తున్న అడల్ట్ కంటెంట్ ఓటీటీ ఉల్లు.. పాపం నుంచి పుణ్యం!

Best Web Hosting Provider In India 2024

Hari Om OTT Platform Launch: ఇప్పటికీ దేశంలో అనేక ఓటీటీ సంస్థలు ఉన్నా విషయం తెలిసిందే. వాటిలో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, జీ5, జియో సినిమా వంటివి ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్నాయి. ఇక తెలుగు ఓటీటీలుగా ఆహా, ఈటీవీ విన్ సంస్థలు ముందంజలో ఉన్నాయి.

ఈ ఓటీటీల్లో హారర్, క్రైమ్ థ్రిల్లర్, సైన్స్ ఫిక్షన్, టైమ్ ట్రావెల్, కామెడీ, యాక్షన్ ఇలా వివిధ రకాల జోనర్లలో సినిమాలు, వెబ్ సిరీసులు అందుబాటులో ఉంటున్నాయి. అయితే, ఇవేవి కాకుండా కేవలం అడల్ట్ కంటెంట్ మాత్రమే ప్రసారం చేసే ఒకే ఒక్క ఓటీటీ సంస్థ ఉల్లు. ఈ ఓటీటీలో అఫైర్స్, శృంగారం, ఘాటు కిస్సింగ్ సీన్స్ వంటి ఫ్యామిలీతో చూడలేని బోల్డ్ కంటెంట్‌ అందుబాటులో ఉంటుంది.

అడల్ట్ కంటెంట్ కోసమే ప్రత్యేకంగా ఉన్న ఓటీటీగా ఉల్లు పేరు తెచ్చుకుంది. ఇప్పుడు ఇదే ఓటీటీ సంస్థ మేకర్స్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రక్తి నుంచి భక్తి వైపుకు పయనిస్తున్నారు. ప్రత్యేకంగా అడల్ట్ కంటెంట్ కోసం ఉల్లు ఉన్నట్లే కేవలం భక్తి మాత్రమే ప్రసరించేలా సరికొత్త డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌ను తీసుకురానున్నారు.

ఓన్లీ డివోషనల్ కంటెంట్‌తో రానున్న ఓటీటీ పేరు హరి ఓం. ఈ హరి ఓం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఉల్లు ఓటీటీ అధినేత విభు అగర్వాల్ తెలిపారు. ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టారు. కేవలం భక్తి కోసమే అన్నట్లుగా హరి ఓం ఓటీటీ లోగో స్పష్టంగా తెలిసేలా ఉంది.

గుండ్రని ఆకారంలో మొత్తం కాషాయ రంగు ఉండి లోపల తెలుపు రంగులో నారాయణుడి ముద్ర ఉంది. దానికింద హరి ఓం అని ఇంగ్లీషులో రాసి ఉంది. చాలా క్రియేటివ్‌గా కొత్తగా హరి ఓం ఓటీటీ లోగో ఉంది. ఈ ఓటీటీలో భారతీయ పురాణాలు, సాంప్రదాయాలు, గుళ్లు, గోపురాలు, దైవ సన్నిధి క్షేత్రాలకు సంబంధించిన కంటెంట్‌ను అందించినట్లు తెలుస్తోంది

భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికతపై యూత్ ఆడియెన్స్‌లో ఆసక్తి పెరుగుతున్న క్రమంలో వారిని ఆకట్టుకునేలా ఈ ఓటీటీని రూపొందిస్తున్నట్లు ఉల్లు ఓటీటీ అధినేత విభు అగర్వాల్ తెలిపారు. భారతీయ సాంప్రదాయాలను అన్వేషించే గేట్ వేగా ఈ హరి ఓం ఓటీటీ ఉపయోగపడుతుందని ఆయన అన్నారు.

ఈ హరి ఓం ఓటీటీని ఈ ఏడాది జూన్‌లో తీసుకురానున్నట్లు విభు అగర్వాల్ వెల్లడించారు. ఈ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లో కేవలం యూ రేటెడ్ కంటెంట్ మాత్రమే ఉంటుందని చెప్పారు. కుటుంబం అంతా కూర్చోని భక్తి పరమైన కంటెంట్‌ను చూసే అవకాశం కలుగుతుందన్నారు. ఈ వీడియో కంటెంట్‌తో పాటు ఆడియో ఫార్మాట్‌లో కూడా భజనలను అందించనున్నట్లు చెప్పుకొచ్చారు.

పిల్లల కోసం, పౌరాణికాలకు సంబంధించి క్యూరేటెడ్ యానిమేటెడ్ కంటెంట్‌ను కూడా హరి ఓం ఓటీటీలో పొందుపరచనున్నారట. దీంతో పాపం నుంచి పుణ్యం కట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారా అంటూ నెటిజన్స్ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఇప్పటికే విభు అగర్వాల్ ఉల్లు ఓటీటీ యాప్, ఆత్రంగి టీవీని స్టార్ట్ చేశారు. జూన్ 2022లో ఆత్రంగి టీవీ ఛానెల్‌ను ప్రారంభించగా అది ఏడాది కాలంలోనే పూర్తిగా ఓటీటీగా మారిపోయింది. దీంతో టీవీ సేవలు నిలిపివేశారు.

IPL_Entry_Point

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024