Best Web Hosting Provider In India 2024
Prasanna Vadanam OTT Release date: తెలుగులో వచ్చిన లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ప్రసన్న వదనం ఓటీటీలోకి వచ్చేస్తోంది. నెల రోజులు కాదు కదా.. మూడు వారాల్లోనే ఈ సినిమా ఆహా ఓటీటీలో అడుగుపెడుతోంది. మే 3న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ విషయాన్ని ఆహా ఓటీటీయే సోషల్ మీడియా ద్వారా అధికారికంగా వెల్లడించింది.
ప్రసన్న వదనం ఓటీటీ రిలీజ్ డేట్
అంబాజీపేట మ్యారేజీ బ్యాండు మూవీ తర్వాత సుహాస్ నటించిన మూవీ ప్రసన్న వదనం. ఈ క్రైమ్ థ్రిల్లర్ భారీ అంచనాల మధ్య రిలీజై పాజిటివ్ టాకే తెచ్చుకుంది. అయితే నెల తర్వాతే ఓటీటీలోకి వస్తుందని భావించిన ఈ సినిమా.. ఇప్పుడు మూడు వారాల్లోనే రానుండటం విశేషం. మే 3న థియేటర్లలో రిలీజైన సినిమా.. మే 24 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
సుహాస్ సూపర్ హిట్ మూవీ అంబాజీపేట మ్యారేజీ బ్యాండులాగానే ఈ ప్రసన్న వదనం సినిమా డిజిటల్ హక్కులను కూడా ఆహా ఓటీటీనే దక్కించుకుంది. “మొహం లేదు కానీ ధైర్యం లేక కాదు. మన చూపులకందని ఓ హీరో ప్రయాణం. గ్రిప్పింగ్ థ్రిల్లర్ డ్రామా ప్రసన్న వదనం ఆహాలో..” అనే క్యాప్షన్ తో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ను ఆహా అనౌన్స్ చేసింది.
వాళ్లకు 24 గంటలు ముందుగానే..
ఆహా ఓటీటీలో మే 24న సినిమా రిలీజ్ అవుతున్నా.. దీనిని ఒక రోజు ముందే చూసే అవకాశం కూడా ఉంది. అయితే ఇది కేవలం ఆహా గోల్డ్ సబ్‌స్క్రిప్షన్ ఉన్న వాళ్లకు మాత్రమే. ఏడాదికి రూ.899తో ఈ గోల్డ్ సబ్‌స్క్రిప్షన్ తీసుకోవచ్చు. ఈ ప్రసన్న వదనం మూవీయే కాదు.. ఆహాలో వచ్చే సూపర్ హిట్ సినిమాలను 24 గంటలు ముందుగానే చూసే అవకాశం ఈ సబ్‌స్క్రైబర్లకు ఉంటుంది.
ప్రసన్న వదనం ఎలా ఉందంటే?
క్రైమ్ మర్డర్ మిస్టరీ సినిమాల్లో చాలా వరకు హీరో అనుకోకుండా నేరంలో చిక్కుకోవడం, ఆ క్రైమ్ నుంచి బయటపడేందుకు తన తెలివితేటలతో వేసిన ఎత్తులు, చివరకు హంతకుడిని పట్టుకోవడంతో ముగుస్తుంటాయి. ప్రసన్న వదనం కూడా అలాంటి మూవీనే.
కానీ ఫేస్ బ్లైండ్‌నెస్ అనే కొత్త పాయింట్‌ను ఈ క్రైమ్ కథలో మిక్స్ చేసి ఆడియెన్స్‌ను థ్రిల్ చేసేందుకు దర్శకుడు అర్జున్ ప్రయత్నించారు. ఈ ఫేస్ బ్లైండ్‌నెస్ అనే పాయింట్‌తో గతంలో తెలుగులో సినిమాలు రాకపోవడంతో పాటు సుహాస్ కామెడీ టైమింగ్, నాచురల్ యాక్టింగ్ ఈ సినిమా ప్లస్సయ్యాయి.
ప్రసన్నవదనం కొత్త ఎక్స్‌పీరియన్స్‌ను పంచే క్రైమ్ థ్రిల్లర్ మూవీ. సస్పెన్స్ జోనర్ మూవీస్‌నే ఇష్టపడే వారిని తప్పకుండా మెప్పిస్తుంది. నటుడిగా సుహాస్‌ను కొత్త కోణంలో చూపించిన మూవీ ఇది.
అతడికెరీర్‌లో డిఫరెంట్ మూవీగా ప్రసన్నవదనం నిలుస్తుంది. పోలీస్ ఆఫీసర్‌గా రాశీ సింగ్ యాక్టింగ్‌కు ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్‌లో కనిపించింది. అంబాజీపేట మ్యారేజీబ్యాండులో విలన్‌గా కనిపించిన నితిన్ ప్రసన్న ప్రసన్నవదనంలో కీలక పాత్ర చేశాడు. హీరో ప్రియురాలిగా పాయల్ రాధాకృష్ణ, స్నేహితుడిగా వైవా హర్ష నవ్వించారు.