Prabhas: నా బుజ్జిని చూస్తారా: కల్కి 2898 ఏడీపై ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ వైరల్

Best Web Hosting Provider In India 2024

Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. శుక్రవారం (మే 17) ఉదయం చేసిన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ఎంత వైరల్ అయిందో తెలుసు కదా. అది చూసి అతని పెళ్లి అని అందరూ తప్పుగా అర్థం చేసుకునేలోపు సాయంత్రం మరో పోస్ట్ చేశాడు. ఈసారి నా బుజ్జిని చూస్తారా అంటూ కల్కి 2898 ఏడీ మూవీ ప్రమోషన్లను సరికొత్తగా అతడు ప్రారంభించాడు.

ప్రభాస్ బుజ్జి ఎవరో తెలుసా?

ప్రభాస్ శుక్రవారం (మే 17) సాయంత్రం తన ఇన్‌స్టాగ్రామ్ లో మరో స్టోరీ పోస్ట్ చేశాడు. అందులో స్క్రాచ్ ఎపిసోడ్ 04 (Skratch Episode 04) శనివారం (మే 18) సాయంత్రం 5 గంటలకు రిలీజ్ కానున్నట్లు వెల్లడించాడు. ఆ పోస్ట్ లోనే కింద.. “డార్లింగ్స్.. నా బుజ్జిని మీరు చూడాలని ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాను” అని అతడు రాయడం విశేషం.

దీంతో ఆ బుజ్జి ఎవరన్న చర్చ మొదలైంది. అయితే కల్కి 2898 ఏడీ మూవీ ప్రమోషన్ల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన కారునే ప్రభాస్ బుజ్జి అని పిలుస్తున్నాడు. ఏడాది కిందట ఈ మూవీ టీమ్ యూట్యూబ్ లో స్క్రాచ్ (Skartch) పేరుతో కొన్ని వీడియోలో రిలీజ్ చేసిన సంగతి తెలుసు కదా. అందులో ఓ ప్రత్యేకమైన కారును తయారు చేయడం చూడొచ్చు.

ఆ కారు తయారీ వీడియో నాలుగో ఎపిసోడ్ శనివారం (మే 18) సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేయనున్నారు. ఈ కారును బుజ్జి అని ప్రభాస్ ముద్దుగా పిలుస్తున్నాడు. ఆ కారును తన అభిమానులకు చూపించడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. ఈ కారులోనే మేకర్స్ మూవీ ప్రమోషన్లను జోరుగా నిర్వహించనున్నారు. నిజానికి కల్కి 2898 ఏడీ మూవీ కోసం ఎన్నో రకాల వాహనాలను తాము తయారు చేసినట్లు గతంలోనే డైరెక్టర్ నాగ్ అశ్విన్ వెల్లడించాడు.

ప్రభాస్ ఇన్‌స్టా స్టోరీ

ప్రభాస్ ఉదయం కూడా ఓ ఇన్‌స్టా స్టోరీ పోస్ట్ చేశాడు. అందులో త్వరలోనే మన జీవితంలోకి ఓ ప్రత్యేకమైన వాళ్లు వస్తున్నారు.. వెయిట్ చేయండి అని అన్నాడు. దీంతో ఇది అతని పెళ్లి గురించే అయి ఉంటుందని చాలా మంది భావించారు. తీరా అది కల్కి 2898 ఏడీ మూవీ ప్రమోషన్ల కోసమే అని తర్వాత తేలింది. ఇప్పుడు బుజ్జి అంటూ ప్రభాసే ఆ పోస్ట్ పై ఓ క్లారిటీ ఇచ్చాడు.

మన జీవితాల్లోకి రాబోతున్న ఆ ప్రత్యేకమైన వ్యక్తి ఈ బుజ్జి అనే కారే అని తేలిపోయింది. మరి ఆ కారు ఎలా ఉండబోతోందో శనివారం తేలనుంది. దీనికోసం ఫ్యాన్స్ అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కల్కి 2898 ఏడీ మూవీ జూన్ 27న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. రూ.600 కోట్ల భారీ బడ్జెట్ మూవీ కోసం దేశవ్యాప్తంగా జోరుగా ప్రమోషన్లు నిర్వహించనున్నారు.

ఈ సినిమాలో ప్రభాస్ తోపాటు దీపికా పదుకోన్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీలాంటి వాళ్లు నటిస్తున్నారు.

IPL_Entry_Point

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024