Best Web Hosting Provider In India 2024
Suriya Launched Hit List Teaser: తమిళ డైరెక్టర్ విక్రమన్ కొడుకు విజయ్ కనిష్క హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా హిట్ లిస్ట్. ఈ సినిమాలో పాపులర్ నటీనటులు సముద్రఖని, శరత్ కుమార్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ ముఖ్యపాత్రలో నటించారు. ఈ సినిమాకు సూర్య కతిర్ కాకల్లార్, కే. కార్తికేయన్ దర్శకత్వం వహించారు.
హిట్ లిస్ట్ మూవీ ఆర్. కె. సెల్యులాయిడ్స్ బ్యానర్‌పై డైరెక్టర్ కె. ఎస్. రవికుమార్ నిర్మిస్తున్నారు. గతంలో ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లు సినిమా పైన అంచనాలను పెంచగా. మే 17న ఈ సినిమాకి సంబంధించిన టీజర్ వెర్సటైల్ హీరో సూర్య చేతుల మీదుగా లాంచ్ చేశారు.
యాక్షన్, సస్పెన్స్, క్రైమ్ జోనర్‌లో వస్తున్న ఈ సినిమా టీజర్ చాలా బాగుంది. ప్రెసెంట్ ఆడియన్స్‌ని ఎక్కువగా క్రైమ్, సస్పెన్స్ జానర్ మూవీస్ అట్రాక్ట్ చేస్తున్నాయి. ఇది కూడా ఆ జానర్‌లోకి రావడం అదే విధంగా టీజర్ సినిమా పైన అంచనాలను పెంచేస్తోంది.
టీజర్ చూసిన అనంతరం హీరో సూర్య మాట్లాడుతూ.. “టీజర్ చాలా బాగుంది. సినిమా ఇంకా బాగుంటుందని ఆశిస్తున్నాను. కచ్చితంగా ఈ సినిమా విజయ్ కనిష్కకి ఈ టీంకి మంచి సక్సెస్ ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను” అని తెలిపారు.
ఇదిలా ఉంటే, హిట్ లిస్ట్ మూవీలో హీరోగా విజయ్ కనిష్క, శరత్ కుమార్, సముద్ర ఖని, గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వీరితోపాటు మునిష్కాంత్ కింగ్స్ లే, సితార, స్మృతి వెంకట్, రామచంద్ర రాజు (కే జి ఎఫ్ గరుడ), రామచంద్రన్, ఐశ్వర్య దత్త, అభి నక్షత్రం తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ చిత్రానికి ఎడిటర్‌గా జాన్ అబ్రహం బాధ్యతలు చేపట్టగా సి. సత్య సంగీతం అందించారు. డీవోపీగా కే. రామ్ చరణ్, కథ ఎస్. దేవరాజ్ అందించారు. హిట్ లిస్ట్ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో శ్రీ శ్రీనివాస స్క్రీన్స్, శ్రీ శ్రీనివాస ఇన్ఫ్రా, బెక్కం ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై విడుదల చేస్తున్నారు. ఈ సినిమా విడుదల తేది ఇంకా ప్రకటించలేదు. త్వరలో అనౌన్స్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే కోలీవుడ్ స్టార్ హీరో సూర్య విభిన్న చిత్రాలు చేస్తూ సత్తా చాటుతున్నాడు. త్వరలో కంగువ అనే సినిమాతో రానున్నాడు. ఇందులో సూర్య చాలా డిఫరెంట్ లుక్‌లో కనిపించిన విషయం తెలిసిందే. ఈ మూవీలో బాలీవుడ్ హాట్ భామ దిశా పటానీ హీరోయిన్‌గా చేయగా.. యానిమల్ విలన్ బాబీ డియోల్ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నాడు.