Brahmamudi May 18th Episode: బ్రహ్మముడి- కిడ్నాపర్ల నుంచి బయటపడిన కావ్య.. భార్యను కొట్టబోయిన రాజ్.. మరదలిపై ఫైర్

Best Web Hosting Provider In India 2024

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ నేటి ఎపిసోడ్‌లో రాజ్‌కు కావ్య కిడ్నాప్ అయిన విషయం చెబుతుంది అప్పు. దాంతో రాజ్ షాక్ అవుతాడు. మల్కాజిగిరి పాతబస్తీ దగ్గర నలుగురు వచ్చి కిడ్నాప్ చేశారు. మనం త్వరగా వెళ్లి కాపాడాలి బావ అని అప్పు అంటుంది. హేయ్.. కిడ్నాప్ చేయడం ఏంటీ. అక్కడికి ఎందుకు వెళ్లారు అని రాజ్ అడుగుతాడు. మాయ కోసం అని అప్పు చెబుతుంది.

బయటకు వెళ్తామా

మీ అక్కకు అసలు బుద్ధి లేదు అని రాజ్ అంటే.. అక్క దొరికాక బుద్ధి ఉందా లేదా అని సర్టిఫికేట్ ఇద్దురు గానీ. ఆ వ్యాన్ నెంబర్ ఉంది. వెళ్లేటప్పుడు ఫొటో తీశాను అని అప్పు అంటుంది. సరే పదా అని ఇద్దరు బయలుదేరుతారు రాజ్, అప్పు. మరోవైపు కావ్య ఉన్న చోట ఉన్న మిగతా అమ్మాయిలు అందరూ ఏడుస్తుంటారు. ఆపండి.. ఇలా ఏడిస్తే.. మనం బయటకు వెళ్తామా అని కావ్య అంటుంది. అంతకుమించి ఏం చేయగలం అక్కా. వాళ్ల ముందు మనమెంత అని అక్కడున్న అమ్మాయి అంటుంది.

ఇక్కడికి ఒక్కో అమ్మాయి వస్తుందే తప్పా. ఇక్కడి నుంచి ఒక్కరు కూడా బయటపడలేదు. వాళ్లు మనల్ని దుబాయ్‌ పంపిస్తారట. మాట్లాడుకుంటే విన్నాను అని ఆ అమ్మాయి అంటుంది. మనలోనే ఉంటూ ఇంతపెద్ద రాకెట్ నడుపుతున్నారా. ఇలా ఏడవం కాదు. ఏదో ఒకటి చేయాలి. మనం తలుచుకుంటే బయటపడగలం అని కావ్య ధైర్యం చెబుతుంది. ఇంతలో భైరవ వచ్చి ఫోన్‌లో గంటలో చెక్ పోస్ట్ దాటాలి, అరగంటలో వ్యాన్ ఇక్కడికి రావాలి అని చెబుతాడు.

అరగంటలో ఏం చేయాలి

ఆ దుబాయ్ పార్టీ వాడు తెగ అడుగుతున్నాడు. ఈ రాత్రికే వీళ్లను పంపించేయాలి అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. వీళ్లు బంగారు బాతులు. జాగ్రత్తగా చూసుకో అని అక్కడున్న రౌడీకి వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు భైరవ. ఇక్కడి నుంచి బయట పడేందుకు చాలా తక్కువగా ఉన్న సమయం అరగంట. ఈ అరగంటలో ఏం చేయాలి అని కావ్య ఆలోచిస్తుంది. మరోవైపు కారులో బయలుదేరుతూ పోలీస్‌లతో ఎలాగైనా పట్టుకోవాలని రాజ్ అంటాడు.

మీరిచ్చిన వ్యాన డీటేల్స్ ఫేక్ అయిండొచ్చు. లేదా ఆ అడ్రస్ రాంగ్ అయిండొచ్చు అని పోలీస్ అంటాడు. నాకు కావాల్సింది కారణాలు కాదు నా వైఫ్ అని రాజ్ అంటాడు. మీకేమైనా డబ్బు ఇవ్వమని కాల్స్ వచ్చాయా అని పోలీస్ అడిగితే లేదని రాజ్ చెబుతాడు. ఈ మధ్య సిటీలో వుమెన్ ట్రాఫికింగ్ ఎక్కువగా జరుగుతుంది. ఇలాగే ఎత్తుకెళ్లిపోతున్నారు. వాళ్లు తర్వాత చనిపోయి కనిపిస్తున్నారు. మేము ఎలాగైనా పట్టుకుంటాం అని పోలీస్ అంటాడు.

అప్పు రాజ్ ఫైర్

దాంతో రాజ్ కంగారుపడిపోతుంటే.. భయపడకు బావ అక్కకు ఏం కాదు అని అప్పు అంటుంది. కిడ్నాప్ చేసింది మీ పిన్ని కొడుకా. ఏం కాదని ఎలా చెబుతున్నావ్. మీ అక్కకు కామన్ సెన్సే ఉండదు. సమస్య వస్తే ఒక్కత్తె పరుగెత్తుకుంటూ వెళ్తుంది. ఇలా నెత్తిమీదకు సమస్య తీసుకొస్తుంది అని అప్పుపై ఫైర్ అవుతాడు రాజ్. మరోవైపు రౌడీలీ దూరంగా మాట్లాడుకుంటారు. మరో రౌడీ వచ్చి మరో అరగంటలో వ్యాన్ వస్తుందని చెబుతాడు.

ఇంకో అరగంటలో వ్యాన్ వస్తుందట. అందులో ఎక్కితే మనం బయటపడటం కష్టం అని కావ్య చెబుతుంది. ఇప్పుడు ఏం చేయాలి అక్క అని ఓ అమ్మాయి అంటుంది. మరో రౌడీ పాస్‌కని వెళ్లిపోతాడు. అప్పుడు కావ్య ఆ అమ్మాయిలందరికి ఏదో ప్లాన్ చెబుతుంది. మరోవైపు రాజ్‌కు పోలీస్ కాల్ చేస్తాడు. వ్యాన్ మల్కాజిగిరి సిగ్నల్ క్రాస్ చేసింది. ఆ వ్యాన్ నడుపుతుంది జేమ్స్. వాళ్లు ఇలాగే కిడ్నాప్ చేస్తుంటారు. వాళ్లు ఎలా చేస్తారో తెలియదు కానీ రెండు రోజుల్లో పట్టుకోకపోతే దుబాయ్‌కు పంపిస్తారు అని పోలీస్ చెబుతాడు.

6 నెలలుగా వెతుకుతున్నాం

వీళ్ల కోసం 6 నెలలుగా వెతుకుతున్నాం. ఇన్నాళ్లకు మీ వల్ల ఒక క్లూ దొరికింది. కమిషనర్ గారూ పట్టుకోమ్మని ఆర్డర్ వేశారు. బెస్ట్ టీమ్‌ను ఈపాటికే పంపించారు. మీరు కంగారుపడకండి. మేము ఇవాళ ఎలాగైనా పట్టుకుంటాం అని పోలీస్ అంటాడు. 6 నెలలుగా దొరకని వాళ్లు ఇప్పుడెలా దొరుకుతారు. మనం కూడా ట్రై చేద్దాం అని అప్పు అంటుంది. రాజ్ కారు ఆపుతాడు. పదా బస్తీలోకి వెళ్లి వెతుకుదాం అని రాజ్ అంటాడు. అక్కపై అంత ప్రేమ పెట్టుకుని ఎప్పుడూ కోపంగా ఎందుకుంటావ్ అని అప్పు అడుగుతుంది.

ఇప్పుడు కూడా కోపంగానే ఉన్నా అని రాజ్ చెబుతాడు. మరోవైపు అమ్మాయిల గదిలోకి రౌడీ వచ్చి ఫోన్ చూస్తుంటాడు. తర్వాత అంతా అమ్మాయిలు అందరూ వచ్చి వదిలేయమని కావాలనే బతిమిలాడుతారు. వాళ్లందరూ రౌడీని చుట్టుముడితే కావ్య మెల్లిగా వెళ్లి ఫోన్ తీసుకుని రాజ్‌కు మెసేజ్ చేస్తుంది. అమ్మాయిలను రౌడీ కొట్టడంతో వాడిపై అరుస్తుంది కావ్య . తర్వాత లొకేషన్ షేర్ చేసింది చూసిన రౌడీ నువ్వేగా ఇది చేసింది అని అడుగుతాడు రౌడీ.

రాజ్ ఎంట్రీ

అవును, బాగా కనిపెట్టావ్ అని కావ్య అంటే.. రౌడీ అరుస్తాడు. హేయ్.. మా ఆయనకు లొకేషన్ పెట్టా. అరగంటలో వస్తాడు. మీ తాట తీస్తాడు. మీ సంగతి ఏంటో చూసుకోండి అని కావ్య వార్నింగ్ ఇస్తుంది. దాంతో అన్నా అనుకుంటూ వెళ్లి భైరవకు జరిగిన విషయం చెబుతాడు. దాంతో రౌడీని ఒక్కటి పీకి వాళ్ల చేతులు కాళ్లు కట్టేయ్ అని చెబుతాడు భైరవ. ఆ రౌడీ అలాగే చేస్తాడు. కావ్య ఉన్న చోటుకు రాజ్ కారు వచ్చి ఆపుతాడు.

ఆ పిల్ల వాళ్లేరా వచ్చింది. చూద్దాం ఏం చేస్తారో అని బైరవ అంటాడు. రాజ్ అక్కడికి చూస్తుంటే ఎవరు కావాలి అని భైరవ అడుగుతాడు. ఎవరో కావాలి అని రాజ్ వెటకారంగా సమాధానం ఇస్తాడు. చుట్టూ చూస్తాడు రాజ్. రౌడీ గన్ తీస్తుంటే వద్దని భైరవ అంటాడు. చుట్టూ చూస్తున్న రాజ్‌ను ఇంకా ఎంత సేపు. నువ్ వెళితే మా పని చేసుకుంటాం అని భైరవ అంటాడు. నీ లొల్లి ఏందిరా భయ్. ఇప్పుడు నువ్ ఏం పని చేస్తున్నావ్ అని అప్పు అంటుంది.

దొరికిపోయిన ముఠా

ఓయ్.. అనుకుంటూ అప్పు పైకి పోతుంటాడు భైరవ. అతన్ని ఆపి లేడీస్, రెస్పెక్ట్ ఇవ్వు అని రాజ్ అంటాడు. అది మాకు తెలుసు. ముందు మీరు వెళ్లండి అని భైరవ అంటాడు. దాంతో అప్పు రాజ్ వెళ్లిపోతారు. అనంతరం వ్యాన్‌లో అందరిని ఎక్కిస్తారు. బయటకు తీసుకెళ్తారు. బయటకు వెళ్లదగానే అక్కడ రాజ్ అప్పు ఉంటారు. రాజ్‌ను చూసి భైరవ షాక్ అవుతాడు. వెనక్కి తిప్పుమంటే వెనుక పోలీసులు ఉంటారు. అలా భైరవను పోలీసులు పట్టుకుని అమ్మాయిలందరిని కాపాడుతారు.

కావ్య వచ్చి రాజ్‌ను ప్రేమగా హగ్ చేసుకుంటుంది. కావ్యను దూరంగా జరిపి పళ్లు రాలగొడతాను అని రాజ్ కొట్టబోతూ చేయి ఎత్తుతాడు. ఇంతలో పోలీస్ రావడంతో ఆగిపోతాడు. సర్ మీ వల్ల అంత మంది అమ్మాయిలను క్షేమంగా కాపాడగలిగాం అని పోలీస్ చెబుతాడు.

తర్వాత బావ వాడు ఇదే దారిలో వస్తాడని ఎలా గెస్ చేశావ్ అని అప్పు అడిగితే.. కావ్య ఒక ఇయర్ రింగ్ చూపిస్తాడు. అది ఎలా దొరికిందో చెబుతాడు. బావా నువ్ సూపర్ బావ అని అప్పు అంటుంది. తర్వాత ముగ్గురు వెళ్లిపోతారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

 
IPL_Entry_Point
 

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024