Infertility in Indians: పిల్లలు పుట్టక ఇబ్బందిపడుతున్న భారతీయ భార్యాభర్తలు, ఎందుకిలా?

Best Web Hosting Provider In India 2024

Infertility in Indians: భారతదేశంలోని జంటల్లో సంతానలేమి పెరిగి పోతోంది. ప్రస్తుతం మన దేశంలోని గణాంకాల ప్రకారం 27.5 మిలియన్ల జంటలు సంతానలేమితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. పునరుత్పత్తి సమస్యలు భార్యాభర్తలూ ఇద్దరినీ సమానంగా వేధిస్తున్నాయి. కనీసం 10-15 శాతం మంది వివాహిత జంటలు సంతానోత్పత్తి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇప్పటి యువత కెరీర్ కోసం పిల్లల్ని కనేందుకు ఆలస్యం చేయడం కూడా పునరుత్పత్తి సమస్యలు కారణం. పిల్లల్ని కనడాన్ని వాయిదా వేయడం వల్ల వయసు పెరిగిపోయి గర్భం ధరించడం కష్టంగా మారుతుంది. అయితే గర్భధారణ ఆలస్యం చేసే వారిలో 54% మంది సమస్యలను ఎదుర్కొంటున్నట్టు నివేదికలు చెబుతున్నాయి.

కుటుంబ నియంత్రణను అర్థం చేసుకోండి

భార్యాభర్తలిద్దరూ సంతానోత్పత్తి, దానిని ప్రభావితం చేసే కారకాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఒక కుటుంబాన్ని ఎప్పుడు ప్రారంభించాలనే దాని గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకుని నిర్ణయాలు తీసుకోవడంలో కీలకం. సంతానోత్పత్తి అనేది ఒక వ్యక్తి గర్భం ధరించడానికి, గర్భధారణను పూర్తి కాలానికి తీసుకువెళ్ళేందుకు ఆ వ్యక్తికి సామర్థ్యాన్ని సూచిస్తుంది. కొంతమంది జంటలు సులభంగా గర్భం ధరించవచ్చు, మరికొందరు ఆ మార్గంలో సవాళ్లను ఎదుర్కొంటారు. సంతానోత్పత్తిని ప్రభావితం చేసే కారకాలు వయస్సు, అంతర్లీన ఆరోగ్య పరిస్థితులు, చెడు జీవనశైలి, జన్యువులు. పురుషులు, మహిళలు ఇద్దరూ ఆరోగ్యంగా ఉంటేనే గర్భం ధరించడం సులభం.

పురుషులు, మహిళలు ఇద్దరినీ ప్రభావితం చేసే వివిధ సంతానోత్పత్తి సమస్యలు ఎన్నో ఉన్నాయి. మహిళల్లో పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (పిసిఒఎస్), ఎండోమెట్రియోసిస్, ఫెలోపియన్ ట్యూబుల్లో అడ్డంకులు వంటి పరిస్థితులు సంతానోత్పత్తి సమస్యలు వస్తాయి. వీటి వల్ల నెలసరులు సరిగా రావు. కటి భాగంలో నొప్పి వస్తుంది. హార్మోన్ల అసమతుల్యత వస్తుంది.

పురుషులలో, తక్కువ స్పెర్మ్ కౌంట్, పేలవమైన స్పెర్మ్ చలనశీలత వంటి సమస్యలు సంతానోత్పత్తిని ప్రభావితం చేస్తాయి. పురుష సంతానోత్పత్తి సమస్యల లక్షణాలు అంగస్తంభన రావడం, వృషణాలలో నొప్పి లేదా వాపు, వీర్య సమస్యలు వంటివి కనిపిస్తాయి. కొంతమందికి ఎలా లక్షణాలు కనిపించకుండానే ఈ సమస్యలు రావచ్చు.

గర్భం ధరించలేకనప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించడం చాలా అవసరం. ఏవైనా అంతర్లీన సమస్యలను ప్రారంభంలోనే గుర్తించడం, పరిష్కరించడం ద్వారా మీ సమస్యను వైద్యులు పరిష్కరిస్తారు. భార్యాభర్తల్లో సుమారు 40% పురుష సమస్యల వల్ల , 40% మహిళ అనారోగ్యాల వల్ల పిల్లలు కలగడం లేదని చెబుతున్నారు. మహిళల్లో వయసు పెరిగితే శరీరం పిల్లల్ని కనేందుకు సహకరించదు. హార్మోన్ల అసమతుల్యత అండాన్ని విడుదల కాకుండా అడ్డుకుంటుంది. భారతదేశంలో డయాబెటిస్, థైరాయిడ్, ప్రోలాక్టిన్ వంటి ఎండోక్రైన్ సమస్యలు మహిళల్లో ఎక్కువ. ఇవి అండోత్సర్గము లేదా అండం విడుదలను ప్రభావితం చేస్తాయి.

భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో క్షయ వంటి అంటువ్యాధులు ప్రబలుతున్నాయి, ఇవి శరీరంలోని ఫాలోపియన్ ట్యూబులను అడ్డుకుంటాయి. అండాశయ నిల్వలను తగ్గిస్తాయి. గర్భాశయంలోని పరిస్థితులను మారుస్తాయి. మగవారిలో, ఇది వీర్యం నాణ్యత, పరిమాణాన్ని తగ్గిస్తుంది. జీవనశైలి వల్ల అధిక బరువుతో ఎంతో మంది బాధపడుతున్నారు. ఇది సంతానోత్పత్తిని తగ్గిస్తుంది. కెఫిన్, ధూమపానం, ఆల్కహాల్ అధికంగా తీసుకోవడం వల్ల పునరుత్పత్తి సామర్థ్యం తగ్గుతుంది. ఆహారం, పర్యావరణం, కాలుష్యం, వృత్తి… ఇవన్నీ భారతీయ జంటల్లో పునరుత్పత్తి వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. ఈ కారణాల వల్ల కూడా పిల్లలు కలగకుండా ఎంతో ఇబ్బంది పడుతున్నారు.

WhatsApp channel

టాపిక్

Source / Credits

Best Web Hosting Provider In India 2024