Best Web Hosting Provider In India 2024
Average Student Nani: డైరెక్టర్లు హీరోలుగా మారడం దక్షిణాది సినీ పరిశ్రమలో కొత్తేమీ కాదు. దాసరి నారాయణరావు నుంచి ఎస్‌జే సూర్య, సముద్రఖని వరకు తెలుగు, తమిళ భాషల్లో పలువురు దర్శకులు హీరోగా మారి సినిమాలు చేశారు. విజయాల్ని అందుకున్నారు. తాజాగా ఓ టాలీవుడ్ దర్శకుడు హీరోగా ఎంట్రీ ఇస్తోన్నాడు.
మెరిసే మెరిసే మూవీతో…
మెరిసే మెరిసే చిత్రంతో పవన్ కుమార్ కొత్తూరి దర్శకుడిగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయ్యారు. దినేష్ తేజ్, శ్వేత అవస్తి జంటగా నటించిన ఈ మూవీ 2021లో ప్రేక్షకుల ముందుకొచ్చింది. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీని తెరకెక్కించి దర్శకుడిగా ఆకట్టుకున్నాడు పవన్ కుమార్ కొత్తూరి. తాజాగా అతడు హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్దమయ్యాడు. ‘యావరేజ్ స్టూడెంట్ నాని’ పేరుతో ఓ మూవీ చేస్తోన్నాడు.
యావరేజ్ స్టూడెంట్ నాని…
యావరేజ్ స్టూడెంట్ నాని లో హీరోగా నటిస్తూనే ఈ సినిమాకు దర్శకుడిగా, నిర్మాతగానూ పవన్ కుమార్ వ్యవహరిస్తున్నాడు. ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను రిలీజ్‌ను చేశారు. బోల్డ్ లుక్‌తో కూడిన ఈ పోస్టర్ ఆసక్తిని పంచుతోంది. సగం ముఖాలు మాత్రమే కనిపించేలా ఒంటిపై బట్టలు లేకుండా సెమీ న్యూడ్ లుక్‌లో ఈ పోస్టర్‌లో హీరోహీరోయిన్లు కనిపిస్తోన్నారు. ఈ పోస్టర్‌తోనే యావరేజ్ స్టూడెంట్ నాని మూవీలో బోల్డ్ కంటెంట్ ఏం రేంజ్‌లో ఉంటుందో దర్శకుడు చూపించేశాడు.
యూత్‌ఫుల్ లవ్ స్టోరీ…
యూత్‌ఫుల్ లవ్, యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా యావరేజ్ స్టూడెంట్ నాని మూవీ తెరకెక్కబోతున్నట్లు సమాచారం. ఇందులో నాని అనే పాత్రలో హీరో పవన్ కుమార్ కనిపించబోతున్నట్లు చెబుతోన్నారు. అతడి జీవితంలోకి ముగ్గురు అమ్మాయిలు ఎలా వచ్చారు? వారిలో నాని ఎవరిని ప్రేమించాడు అన్నదే ఈ మూవీ కథ అని సమాచారం.
ముగ్గురు హీరోయిన్లు…
యావరేజ్ స్టూడెంట్ నానిలో స్నేహా మాలవ్య, సాహిబా భాసిన్, వివియా సంత్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా టీజర్, ట్రైలర్‌ను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
యావరేజ్ స్టూడెంట్ నాని సినిమాకు సజీష్ రాజేంద్రన్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, కార్తీక్ బి కొడకండ్ల సంగీతం అందిస్తున్నారు. ఉద్ధవ్ ఎస్ బి ఈ చిత్రానికి ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. యావరేజ్ స్టూడెంట్ నానిలో ఝాన్సీ, రాజీవ్ కనకాల, ఖలేజా గిరితో పాటు టాలీవుడ్‌కు చెందిన పలువురు నటీనటులు కీలక పాత్రలు పోషించనున్నారు. సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు.
సందేశం ప్లస్ రొమాన్స్…
రొమాన్స్‌కు మెసేజ్‌ను జోడించి మెరిసే మెరిసే మూవీని తెరకెక్కించాడు పవన్ కుమార్ కొత్తూరి. సొంతంగా జీవితంలో పైకి రావాలనే తపించే యువత మనోభావాలను మెరిసే మెరిసే మూవీలో ఆవిష్కరించారు. క్లీన్ మూవీని తెరకెక్కించిన దర్శకుడు యావరేజ్ స్టూడెంట్ నానిని మాత్రం బోల్డ్ లవ్‌లవ్‌స్టోరీగా రూపొందిస్తోన్నట్లు చెబుతోన్నారు. మెరిసే మెరిసే సినిమాను పవన్‌కుమార్ స్వయంగా నిర్మించాడు. ఇప్పుడు ఈ మూవీకి నిర్మాణ బాధ్యతలు చేపట్టాడు. మెరిసే మెరిసే సినిమాకు పనిచేసిన చాలా మంది టీమ్ యావరేజ్ స్టూడెంట్ నానికి పనిచేయబోతున్నారు.
టాపిక్