Ramanarayanam IRCTC Package : సింహాచలం, శ్రీరామనారాయణం, విశాఖ బీచ్ ల సందర్శన- ఐఆర్సీటీసీ 2 రోజుల టూర్ ప్యాకేజీ వివరాలివే

Best Web Hosting Provider In India 2024

Visakha Ramanarayanam IRCTC Package : విశాఖలోని పర్యటక ప్రదేశాల సంద్శనతో పాటు విజయనగరం శ్రీ రామనారాయణం ఆలయం పర్యటనకు ఐఆర్సీటీసీ 2 రోజులు టూర్ ప్యాకేజీ అందిస్తోంది. విశాఖలోని ప్రముఖ ఆలయాలు, పర్యటక ప్రదేశాలను అతి తక్కువ ధరలో వీక్షించవచ్చు. రూ. 5885 కనీస ధరతో గ్లోరియస్ ఆంధ్ర విత్ శ్రీ రామనారాయం పేరిట ఐఆర్సీటీసీ ఈ టూర్ ప్యాకేజీ అందిస్తుంది. ఈ టూర్ లో సింహాచలం ఆలయం, తొట్ల కొండ బౌద్ధ సముదాయాలు, విజయనగరం శ్రీరామనారాయణం ఆలయాలతో పాటు సుందరమైన బీచ్ ను సందర్శించవచ్చు.

ఒక్కో వ్యక్తి ధర (01 నుంచి 03 వ్యక్తుల వరకు) :

క్లాస్సింగిల్ ఆక్యుపెన్సీడబుల్ ఆక్యుపెన్సీట్రిపుల్ ఆక్యుపెన్సీచైల్డ్ విత్ బెడ్చైల్డ్ వితవుట్ బెడ్
కంఫర్ట్రూ.13630రూ.7535రూ.5505రూ.4860రూ.3110

ఒక్కో వ్యక్తి ధర (04 నుంచి 06 వ్యక్తుల వరకు) :

క్లాస్ డబుల్ ఆక్యుపెన్సీట్రిపుల్ ఆక్యుపెన్సీచైల్డ్ విత్ బెడ్చైల్డ్ వితవుట్ బెడ్
కంఫర్ట్రూ.6330రూ.5885రూ.5180రూ.3815

ప్రయాణ వివరాలు

డే 1 టూర్

  • ఉదయం 07:00 – విశాఖ రైల్వే స్టేషన్/బస్ డిపో/విమానాశ్రయం నుంచి పికప్ చేసుకుని హోటల్‌కి తీసుకెళ్తారు. హోటల్ లో చెక్ ఇన్ అయ్యి అల్పాహారం చేస్తారు.
  • 09:00 నుంచి 09:30 వరకు – బ్రేక్ ఫాస్ట్ తర్వాత హోటల్ నుంచి రుషికొండ బీచ్‌కి వెళ్తారు. (14 కిమీ, 30 నిమిషాల ప్రయాణం).
  • 09:30 నుంచి 11:30 వరకు – రుషికొండ బీచ్‌ సందర్శన
  • 11:30 నుంచి 11:45 వరకు – రుషికొండ బీచ్ నుంచి తొట్లకొండ బౌద్ధ సముదాయానికి ప్రయాణం(6 కిమీ, 15 నిమిషాలు) అవుతారు.
  • 11:45 AM నుంచి 12:15 PM వరకు – తొట్లకొండ బౌద్ధ సముదాయం సందర్శన
  • 12:15 నుంచి 12:30 వరకు – తొట్లకొండ బౌద్ధ ఆలయం నుంచి పురాతన బావికొండకు ప్రయాణం అవుతారు.
  • 12:30 PM నుంచి 1 :00 PM వరకు – బావికొండ పురాతన బౌద్ధ విహారం సందర్శన ఉంటుంది.
  • 1:00 నుండి 2:00 వరకు – సమీపంలోని రెస్టారెంట్/హోటల్‌లో మధ్యాహ్న భోజనం(సొంత ఖర్చుతో)
  • 2:00 నుండి 4:00 వరకు – మధ్యాహ్న భోజనం తర్వాత కైలాషగిరి హిల్స్ పార్క్ సందర్శన
  • 4:00 నుండి 5:20 వరకు – కైలాషగిరి హిల్స్ పార్క్ నుంచి శ్రీరామనారాయణ దేవాలయం(విజయనగరం) సందర్శనకు ప్రయాణం మొదలవుతుంది. (50 కి.మీ., 1 గంట 20 నిమిషాల ప్రయాణం)
  • 5:20 నుంచి 7:00 PM వరకు – శ్రీ రామనారాయణం ఆలయం సందర్శన, లేజర్ షో వీక్షిస్తారు.
  • సాయంత్రం 7:00 నుంచి 8:30 వరకు – రామనారాయణం ఆలయం నుంచి విశాఖపట్నంలోని హోటల్‌కు తిరుగు ప్రయాణం అవుతారు. (52 కిమీ, 1 గంట 30 నిమిషాల ప్రయాణం). హోటల్‌లో డిన్నర్ చేసి రాత్రి బస చేస్తారు.

డే 2 టూర్

  • ఉదయం 08:00 గంటలకు -బ్రేక్ ఫాస్ట్ తర్వాత, హోటల్ నుంచి చెక్-అవుట్ అయ్యి సింహాచలం ఆలయానికి ప్రయాణం అవుతారు.(18 కిమీ, 1 గంట ప్రయాణం)
  • 09:00 – సింహాచలం దేవాలయానికి చేుకుంటారు.
  • 09:00 నుంచి 11:00 వరకు – సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుంటారు.
  • 11:00 నుంచి 11:45 వరకు – సింహాచలం దేవస్థానం నుంచి విశాఖ మ్యూజియం సందర్శనకు ప్రయాణం అవుతారు. (20 కిమీ, 45 నిమిషాలు).
  • 11:45 నుంచి 12:15 వరకు – విశాఖ మ్యూజియంలో సందర్శన ఉంటుంది. (శుక్రవారం సెలవు)
  • 12:15 నుంచి 12:20 వరకు – విశాఖ మ్యూజియం నుంచి మత్స్య దర్శిని చూసేందుకు బయలుదేరతారు (2 కిమీ, 5 నిమిషాలు).
  • 12:20 నుంచి మధ్యాహ్నం 1:00 వరకు – మత్స్య దర్శిని సందర్శన
  • 1:00 నుంచి 2:00 వరకు – సమీపంలోని రెస్టారెంట్/హోటల్‌లో భోజనం (కస్టమర్ సొంత ఖర్చుతో)
  • 2:00 నుంచి 3:00 వరకు – భోజనం తర్వాత ఎయిర్‌క్రాఫ్ట్ మ్యూజియం సందర్శిస్తారు.
  • 3:00 నుంచి 4:00 వరకు- జలాంతర్గామి మ్యూజియం సందర్శన
  • 4:00 నుంచి 4:30 వరకు – ఆర్కే బీచ్ సందర్శిస్తారు.
  • 4:30 నుంచి 5:00 వరకు – ఆర్కే బీచ్ నుంచి బయలుదేరి రైల్వే స్టేషన్/బస్ డిపో/విమానాశ్రయం వద్ద డ్రాప్ చేస్తారు. దీంతో టూర్ ముగుస్తుంది.

గ్లోరియస్ ఆంధ్ర విత్ శ్రీ రామనారాయణం టూర్ ప్యాకేజీ పూర్తి వివరాలు, బుకింగ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

IPL_Entry_Point

టాపిక్

IrctcIrctc PackagesTourismAp TourismTourist PlacesVisakhapatnamVizianagaram
Source / Credits

Best Web Hosting Provider In India 2024