OTT Movie: చైన్ బిజినెస్ మోసాలు.. ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసిన ఫ్యామిలీ ఎమోషన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Best Web Hosting Provider In India 2024

Sharathulu Varthisthai OTT Release: చైత‌న్య రావు, భూమి శెట్టి జంట‌గా న‌టించిన సినిమా ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి. కుమార‌స్వామి(అక్ష‌ర‌) ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీని స్టార్ లైట్ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై నాగార్జున సామ‌ల‌, శ్రీష్ కుమార్ గుండా, డాక్ట‌ర్ కృష్ణ‌కాంత్ చిత్త‌జ‌ల్లు నిర్మించారు.

షరతులు వర్తిస్తాయి సినిమా మార్చి 15న గ్రాండ్‌గా థియేట్రికల్ రిలీజ్ అయింది. సినిమాకు మొదటి నుంచి మంచి బజ్ క్రియేట్ కాగా విడుదల తర్వాత కూడా పాజిటివ్ టాక్ వచ్చింది. మిడిల్ క్లాస్ బయోపిక్ చిత్రంగా షరతులు వర్తిస్తాయి సినిమాను పేర్కొన్నారు ఆడియెన్స్. గ్రామాల్లో, పలు ప్రాంతాల్లో చైన్ బిజినెస్ గురించి చెప్పే మోసం చేసే కథాంశంతో షరతులు వర్తిస్తాయి తెరకెక్కింది.

కరీంనగర్ బ్యాక్‌డ్రాప్‌లో పక్కా తెలంగాణ యాసలో షరతులు వర్తిస్తాయి మూవీని రూపొందించారు. చైన్ బిజినెస్ మోసం వల్ల కుటుంబాలకు ఎలాంటి నష్టం జరిగింది, వారి జీవితాల్లో ఏర్పడిన అంధకారం ఏంటీ, మరి ఆ మోసాన్ని ఓ మిడిల్ క్లాస్ వ్యక్తి ఎలా బయటపెట్టాడు, ఈ మోసాలు చేసేవారిపై కామన్ మ్యాన్ చేసిన పోరాటం ఏంటీ అనే అంశాలతో కామెడీ అండ్ థ్రిల్లింగ్‌గా సినిమా ఉందని రివ్యూలు వచ్చాయి.

షరతులు వర్తిస్తాయి చిత్రంలో ఫ్యామిలీ ఎమోషన్‌ను బాగా చూపించారని, భార్యా భర్తల అనుబంధం, పల్లెటూళ్లలో మనుషుల మధ్య ఉండే ఆత్మీయతకు సంబంధించిన సీన్స్ బాగున్నాయని టాక్ వచ్చింది. క్లైమాక్స్ మాత్రం వెనువెంటనే సినిమాటిక్‌గా తెరకెక్కించారని ఆడియెన్స్‌తోపాటు పలు రివ్యూల్లో పేర్కొన్నారు.

ఐఎమ్‌డీబీ సంస్థ నుంచి 10కి 7.7 రేటింగ్ తెచ్చుకున్న షరతులు వర్తిస్తాయి సినిమా ఎట్టకేలకు రెండు నెలలకు ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో మే 18 నుంచి అంటే ఇవాళ్టి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. కాబట్టి థియేటర్‌లో మిస్ అయినవాళ్లు ఈ ఫ్యామిలీ ఎమోషన్, ఫీల్ గుడ్ మిడిల్ క్లాస్ బయోపిక్ మూవీని ఎంచక్కా కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేయొచ్చు.

యూట్యూబ్ పాపులర్ మినీ సిరీస్ 30 వెడ్స్ 21తో చాలా పాపులర్ అయ్యాడు చైతన్య రావు. ఆ తర్వాత సినిమాల్లో సైడ్ హీరోగా చేస్తూ అలరించాడు. ప్రస్తుతం మెయిన్ హీరోగా ఆకట్టుకుంటున్నాడు. ఇటీవలే కీడా కోలాలో హీరోగా చేసి తనదైన నటనతో మెప్పించాడు. త్వరలో తెప్పసముద్రం మూవీలో పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు.

కాగా షరతులు వర్తిస్తాయి సినిమాకు బాగానే ప్రమోషన్స్ నిర్వహించారు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు కమెడియన్, హీరో ప్రియదర్శి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సినిమాకు పడిన కష్టాల గురించి చైతన్య రావు ఆసక్తికర విషయాలు తెలిపాడు.

షరతులు వర్తిస్తాయి సినిమా ప్రారంభమైనప్పటి నుంచి ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నట్లు, అప్పుడు నిర్మాతలు చాలా సపోర్ట్ చేసినట్లు తెలిపారు. తమ కెరీర్‌లో ఇది గుర్తుండిపోయే సినిమా అవుతుందని, అలాంటి సినిమా తనకు అందించినందుకు డైరెక్టర్ కుమారస్వామికి రుణపడి ఉంటానని ఆ వేదికగా చైతన్య రావు పేర్కొన్నాడు.

అలాగే సినిమాలో తన పాత్రకు మెగాస్టార్ చిరంజీవి పేరు పెట్టడంతో భయమూ, భక్తితో నటించానని చైతన్య రావు చెప్పుకొచ్చాడు. అలాగే ఇందులో హీరోయిన్‌గా చేసిన భూమి శెట్టి కన్నడ బిగ్ బాస్ ద్వారా చాలా పాపులర్ అయింది.

IPL_Entry_Point

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024