Best Web Hosting Provider In India 2024
Kiara Advani on Game Changer: గ్లోబల్ స్టార్ రామ్‍చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా కోసం సినీ ప్రేక్షకులు చాలా ఎదురుచూస్తున్నారు. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ‘జరంగండి’ అంటూ మార్చిలో తొలి సాంగ్ వచ్చింది. ఈ మాస్ బీట్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే, ఈ జరగండి పాట షూటింగ్ గురించి ఈ మూవీలో హీరోయిన్‍గా నటిస్తున్న కియారా అడ్వానీ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‍లో పాల్గొన్న కియారా ఆ పాట గురించి వెల్లడించారు.
ఇంతకు ముందెప్పుడు ఇలా చేయలేదు
జరగండి పాట షూటింగ్ 10 రోజుల పాటు జరిగిందని కియారా అడ్వానీ వెల్లడించారు. ఒకపాటకు ఇన్ని రోజుల షూటింగ్ ఇంతకు ముందెప్పుడు తాను చేయలేదని చెప్పారు. అయితే, ఈ పాట చేయడాన్ని తాను చాలా ఎంజాయ్ చేశానని ఈ అందాల భామ వెల్లడించారు.
జరగండి పాట కోసం ప్రతీ రోజు 3 నుంచి నాలుగు గంటల పాటు రిహార్సల్స్ చేశానని కియారా చెప్పారు. రామ్‍చరణ్, తాను అన్ని స్టెప్‍లను మ్యాచ్ చేసేందుకు శ్రమించాల్సి వచ్చిందని అన్నారు. “జరగండి పాట నేను చేసిన దాంట్లో కష్టమైనది. ప్రభుదేవా ఈ పాటకు కొరియోగ్రఫీ చేశారు. చాలా రిహాల్సస్ జరిగాయి. షూటింగ్ తర్వాత కూడా 3 నుంచి 4 గంటలకు రిహార్సల్స్ చేయాల్సి వచ్చేది” అని కియార్ చెప్పారు.
చాలా కష్టమైన స్టెప్స్.. కానీ ఎంజాయ్ చేశా..
జరగండి పాటలో చాలా కష్టమైన స్టెప్స్ ఉన్నాయని కియారా అడ్వానీ చెప్పారు. అయితే, ఆ ప్రాసెస్ అంతా తాను ఎంజాయ్ చేశానని అన్నారు. “అది చాలా మంచి ఎక్స్‌పీరియన్స్. నేను శంకర్‌తో పని చేయాలని ఎప్పటి నుంచో అనుకున్నా. ఆయన చాలా ప్యాషన్ ఉన్న ఫిల్మ్ మేకర్. చాలా పెద్ద విజన్ ఉంది. ముందటి సినిమా కంటే చాలా అత్యుత్తమంగా ఉండాలని కష్టపడతారు. నాకు అది చాలా ఇష్టం” అని కియారా అడ్వానీ చెప్పారు.
గేమ్ ఛేంజర్ సినిమా నుంచి జరగండి లిరికల్ సాంగ్ రిలీజ్ అయ్యాక తనకు చాలా ప్రశంసలు వచ్చాయని కియారా అడ్వానీ చెప్పారు. తన మాసీ స్టెప్స్ చూసి కాల్ చేసి చాలా మంది పొగిడారని తెలిపారు.
గేమ్ ఛేంజర్ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు. హీరో రామ్‍చరణ్ పుట్టిన రోజు సందర్భంగా మార్చి 27న ఈ జరగండి పాట వచ్చింది. మాస్ బీట్‍తో ఈ సాంగ్ అదిరిపోయింది.
మరోవైపు గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ డేట్ కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్ లేకపోతే డిసెంబర్‌లో విడుదల చేసేందుకు మూవీ టీమ్ ప్లాన్ చేస్తోంది. ఇంకా ఈ చిత్రం షూటింగ్ సాగుతోంది. ఆర్ఆర్ఆర్ గ్లోబల్ హిట్ తర్వాత రామ్‍చరణ్ చేస్తున్న మూవీ కావటంతో గేమ్ ఛేంజర్‌పై పాన్ ఇండియా రేంజ్‍లో సూపర్ క్రేజ్ ఉంది.
గేమ్ ఛేంజర్ సినిమాలో చరణ్ సరసన కియారా అడ్వానీ హీరోయిన్‍గా నటిస్తున్నారు. అంజలి, ఎస్‍జే సూర్య, జయరాం, సునీల్, శ్రీకాంత్, సముద్రఖని కీరోల్స్ చేస్తున్నారు.