Chandini Chowdary: కొత్తగా పెళ్లైన జంట ఎదుర్కొనే సమస్యతో మూవీ- గామి హీరోయిన్ చాందినీ చౌదరి మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

Best Web Hosting Provider In India 2024

Chandini Chowdary Santana Praptirastu: విశ్వక్ సేన్ గామి (Gaami Movie) సినిమాలో హీరోయిన్‌గా తనదైన మార్క్ చూపించింది బ్యూటిఫుల్ చాందినీ చౌదరి. ఆమె హీరోయిన్‌గా నటిస్తోన్న మరో లేటెస్ట్ సినిమా సంతాన ప్రాప్తిరస్తు. ఇందులో హీరోగా విక్రాంత్ (Vikranth) చేస్తున్నాడు. ఈ సంతాన ప్రాప్తిరస్తు సినిమా ఇటీవల హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది.

ఈ సినిమాను మధుర ఎంటర్ టైన్‌మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్‌పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సంతాన ప్రాప్తిరస్తు చిత్రానికి సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా, ఏక్ మినీ కథ లాంటి చిత్రాలకు స్క్రీన్ ప్లే అందించిన రచయిత షేక్ దావూద్ జి ఈ సినిమాకు స్క్రీన్ ప్లే రాస్తున్నారు.

మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా సంతాన ప్రాప్తిరస్తు సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత, వ్యాపారవేత్త అంబికా కృష్ణ కెమెరా స్విచ్ఛాన్ చేయగా.. వసుధ ఫౌండేషన్ ఛైర్మన్ మంతెన వెంకట రామరాజు క్లాప్ నిచ్చారు. మధుర శ్రీధర్ రెడ్డి ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు. ఇద్దరు ప్రొడ్యూసర్స్ స్క్రిప్ట్‌ను దర్శకుడు సంజీవ్ రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా మూవీ టీమ్ చిత్ర విశేషాలు తెలియజేసింది.

“మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రమిది. ఇవాళ ఫ్యామిలీ ఆడియెన్స్ థియేటర్స్‌కు రావడం లేదు. వాళ్లను రప్పించేలా మూవీ పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చేలా ఉంటుంది. ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటూనే ఒక కాంటెంపరరీ ఇష్యూను కథలో చూపిస్తున్నాం” అని డైరెక్టర్ సంజీవ్ రెడ్డి తెలిపారు.

“వరంగల్ అమ్మాయి, హైదరాబాద్ అబ్బాయి మధ్య కథ జరుగుతుంది. కొత్తగా పెళ్లైన జంట ఎదుర్కొనే ఓ సమస్యను వినోదాత్మకంగా మూవీలో తెరకెక్కిస్తున్నాం” అని సంతాన ప్రాప్తిరస్తు దర్శకుడు సంజీవ్ రెడ్డి పేర్కొన్నారు.

“ఈ రోజు మా సినిమా సంతాన ప్రాప్తిరస్తు లాంఛనంగా ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది. ముహూర్తపు సన్నివేశానికి కెమెరా స్విచ్ఛాన్ చేసిన అంబికా కృష్ణ గారికి, క్లాప్ నిచ్చిన వసుధ ఫౌండేషన్ ఛైర్మన్ మంతెన వెంకట రామరాజుకి కృతజ్ఞతలు” అని నిర్మాతలు మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి తెలిపారు.

“మంచి మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది. సునీల్ కశ్యప్ మా చిత్రానికి సూపర్ హిట్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. వచ్చే నెల 8వ తేదీ నుంచి మా సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. హైదరాబాద్, వరంగల్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుతాం” అని నిర్మాతలు పేర్కొన్నారు.

కాగా సంతాన ప్రాప్తిరస్తు సినిమాలో హీరో హీరోయిన్ విక్రాంత్, చాందినీ చౌదరితోపాటు కమెడియన్స్ వెన్నెల కిషోర్, అభినవ్ గోమఠం, మురళీధర్ గౌడ్, జీవన్ కుమార్, తాగుబోతు రమేష్, రచ్చ రవి తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా ఇటీవల గామి సినిమాతో ప్రేక్షకులను అలరించింది చాందినీ చౌదరి. ఈ సినిమా టెక్నికల్‌గా బాగున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద అంతగా కలెక్షన్స్ రాబట్టలేకపోయింది.

ప్రస్తుతం జీ5 ఓటీటీలో గామి మంచి రెస్పాన్స్‌తో అలరిస్తోంది. సంతాన ప్రాప్తిరస్తు మూవీ కాకుండా ఏవమ్ అనే మరో చిత్రం చేస్తోంది చాందినీ చౌదరి. ఇందులో ఆమె పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తోంది.

IPL_Entry_Point

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024