Best Web Hosting Provider In India 2024
Keerthy Suresh Prabhas Kalki 2898 AD: ప్రభాస్ క్రేజియెస్ట్ మూవీ కల్కి 2898 ఏడీలో ఇప్పటికీ అతిపెద్ద భారీ తారాగణం నటిస్తోన్న విషయం తెలిసిందే. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, యూనివర్స్ హీరో కమల్ హాసన్, స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె, దిశా పటానీ నటిస్తున్నట్లు అధికారికంగా వెల్లడించారు.
అయితే మరికొంతమంది స్టార్ హీరోలు సైతం కల్కిలో నటిస్తున్న ప్రచారం జోరుగా నడిచింది. కానీ, వాటిలో ఎలాంటి క్లారిటీ అయితే ఇప్పటికీ లేదు. కానీ, ఇటీవల కల్కి 2898 ఏడీ నుంచి విడుదలైన బుజ్జి మేకింగ్ వీడియోలో సరికొత్త సర్‌ప్రైజ్ మాత్రం వినిపించింది. కల్కి సినిమాలో మహానటి కీర్తి సురేష్ కూడా భాగమైంది.
మాగ్నమ్ ఓపస్ కల్కి 2898 ఏడీ చుట్టూ ఉన్న ఎగ్జయిట్‌మెంట్ ప్రపంచవ్యాప్తంగా సినీ ఔత్సాహికులలో నెక్ట్స్ లెవల్‌కు చేరుకుంది. మే 22, 2024న భైరవ ప్రాణ స్నేహితుడైన బుజ్జిని రివల్ చేయనున్నట్లు అధికారిక అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. ‘ఫ్రమ్ స్క్రాచ్ EP4: బిల్డింగ్ ఎ సూపర్‌స్టార్’ అనే పేరుతో బిహైండ్ ది స్క్రీన్ గ్లింప్స్‌తో మరింత క్యూరియాసిటీ పెంచారు మేకర్స్. ఈ వీడియోలోనే బుజ్జి వాహనాన్ని రివీల్ చేయనున్నట్లు చివరిలో చూపించారు.
2 నిమిషాల 22 సెకన్ల వీడియోలో గ్యారేజ్ సెట్టింగ్‌తో ప్రారంభమైంది. ఓ చెత్త నుంచి బుజ్జి బ్రెయిన్‌ను (రోబోట్) చూపించారు. ఆ మనిషికి మెదడు ఎలా కంట్రోలింగ్ ఆబ్జెక్టో.. బుజ్జి వెహికిల్‌కు దాని బ్రెయిన్ కంట్రోల్. ఆ బ్రెయిన్‌కు మహానటి కీర్తి సురేష్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. అది భలే సరదాగా ఉంది. ఆద్యంతం తన మాటలతో కీర్తి సురేష్ బాగా అలరించింది.
కల్కి సినిమాలో భైరవకు అంటే ప్రభాస్‌కు బుజ్జి అనే వాహనం ప్రాణ స్నేహితుడు. అలాంటి ప్రాణ స్నేహితుడు బ్రెయిన్ కంట్రోల్‌తో నడుస్తాడు. ఆ బ్రెయిన్ కంట్రోల్‌కు వాయిస్ ఓవర్ ఇచ్చింది కీర్తి సురేష్. ఇలా ప్రభాస్‍కు బెస్ట్ ఫ్రెండ్‌గా కీర్తి సురేష్ కల్కి సినిమాలో భాగమైంది. బుజ్జి వెహికిల్‌కు బ్రెయిన్ ఫిక్స్ చేశాకా దాని కంట్రోల్‌తోనే వాహనం నడుస్తుంది. అంటే, బుజ్జి వాహనానికి ఏఐ వాయిస్‌లా కీర్తి సురేష్ గాత్రం అందించనుంది.
ఏమైనా బుజ్జి అంటూ కీర్తి సురేష్ వాయిస్‌తో డైరెక్టర్ నాగ్ అశ్విన్ అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చాడనే చెప్పాలి. కల్కికి కీర్తి సురేష్ వాయిస్ ఓవర్ అదనపు అట్రాక్షన్‌గా నిలవనున్నట్లు తెలుస్తోంది. మే 22న బుజ్జికి సంబంధించిన వీడియో ద్వారా మరిన్ని డీటెల్స్ తెలియనున్నాయి. అందులో ఇంకెన్ని సర్‌ప్రైజెస్ ఉంటాయో వేచి చూడాలి.
ఇదిలా ఉంటే, జూన్ 2020లో దర్శకుడు నాగ్ అశ్విన్ గొప్ప విజన్‌తో ఫ్రమ్ స్క్రాచ్ మొదటి ఎపిసోడ్ ప్రారంభించినప్పటి నుంచి కల్కిపై అంచనాలు పెరిగిపోయాయి. “సూపర్‌హీరో”, “భైరవ’గా ప్రజెంట్ చేసిన వీడియోలతో క్రియేటర్‌లు ప్రేక్షులను అద్భుతమైన ప్రయాణంలో తీసుకెళ్తున్నారు.
ఇక తాజాగా ‘బెస్ట్ ఫ్రెండ్,” “బెస్ట్ కంపానియన్” బుజ్జి.. నెటిజన్లను గెస్సింగ్‌లో ఉంచడంతోపాటు 5వ సూపర్‌స్టార్ గురించి మరింత తెలుసుకోవడానికి ఆసక్తిని కలిగిస్తుంది. అంటే బుజ్జి ఐదో సూపర్ స్టార్‌గా నిలవనుంది. కాగా ఇటీవల కల్కి 2898 AD నుంచి విడుదలైన అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ పాత్ర ప్రేక్షకులని మంత్రుముగ్దులని చేసిన విషయం తెలిసిందే.