Aarambham OTT: ఓటీటీలోకి వ‌చ్చేస్తోన్న‌ తెలుగు సైన్స్ ఫిక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ మూవీ – స్ట్రీమింగ్ ఎందులో అంటే?

Best Web Hosting Provider In India 2024

Aarambham OTT: తెలుగు సైంటిఫిక్ థ్రిల్ల‌ర్ మూవీ ఆరంభం థియేట‌ర్ల‌లో రిలీజైన రెండు వారాల్లోనే ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. ఆరంభం మూవీ మే 23 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ థ్రిల్ల‌ర్ మూవీ మే 10న థియేట‌ర్ల‌లో రిలీజైంది. రెండు వారాలు కూడా గ‌డ‌వ‌క‌ముందే ఓటీటీలో రిలీజ్ అవుతోంది.

టైమ్ లూప్ కాన్సెప్ట్‌…

ఆరంభం మూవీలో మోహ‌న్ భ‌గ‌త్‌, సుప్రిత స‌త్య‌నారాయ‌ణ్ హీరోహీరోయిన్లుగా న‌టించారు. భూషణ్ కళ్యాణ్, రవీంద్ర విజయ్ కీల‌క పాత్ర‌లు పోషించారు. వి అజ‌య్ నాగ్ ఈ మూవీతో ద‌ర్శ‌కుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. . ఓ క‌న్న‌డ న‌వ‌ల ఆధారంగా టైమ్ లూప్ అనే కాన్సెప్ట్‌తో ద‌ర్శ‌కుడు అజ‌య్ నాగ్ ఈ మూవీని తెర‌కెక్కించాడు.

కాలంలో వెన‌క్కి వెళ్ల‌డ‌మ‌నే అంశాన్ని ద‌ర్శ‌కుడు ఎలాంటి క‌న్ఫ్యూజ‌న్ లేకుండా చెప్పిన తీరుపై ప్ర‌శంస‌లు వ‌చ్చాయి. టీజ‌ర్స్‌, ట్రైల‌ర్స్‌తో ఈ చిన్న సినిమా తెలుగు ఆడియెన్స్‌లో క్యూరియాసిటీ క‌లిగించింది. ఆరంభం సినిమాకు సింజిత్ యెర్ర‌మిల్లి మ్యూజిక్ అందించాడు. దేవ్‌దీప్ గాంధీ కెమెరామెన్‌గా ప‌నిచేశాడు.

ఆరంభం క‌థ ఇదే…

ఓ మ‌ర్డ‌ర్ కేసులో మిగిల్ (మోహ‌న్ భ‌గ‌త్‌) అనే వ్య‌క్తికి ఉరి శిక్ష ప‌డుతుంది. మ‌రో రోజులో ఉరి తీస్తార‌న‌గా జైలు నుంచి మిగిల్ అదృశ్యం అవుతాడు. సెల్ తాళాలు, గోడ‌లు బ‌ద్ద‌లుకొట్ట‌కుండా విచిత్రంగా మిగిల్ జైలు నుంచి త‌ప్పించుకుంటాడు. అత‌డు పారిపోవ‌డం జైలు అధికారులు ఎవ‌రూ చూడ‌రు. మిస్ట‌రీగా మారిన ఈ కేసును సాల్వ్ చేసే బాధ్య‌త‌ను డిటెక్టివ్ చేత‌న్ (ర‌వీంద్ర విజ‌య్‌) చేప‌డ‌తాడు.చేత‌న్‌కు మిగిల్ రాసిన డైరీ దొరుకుతుంది.

ఆ డైరీతో పాటు అదే జైలులో ఉన్న మ‌రో ఖైదీ గ‌ణేష్ (మీసాల ల‌క్ష్మ‌ణ్‌) ద్వారా మిగిల్ గురించి షాకింగ్ సీక్రెట్స్ తెలుసుకుంటాడు చేత‌న్‌. అవేమిటి? మిగిల్‌కు ఫిజిక్స్ ఫ్రొఫెస‌ర్ మీసాల సుబ్ర‌హ్మ‌ణ్య‌రావు(భూష‌ణ్ క‌ళ్యాణ్‌)తో ఎలాంటి సంబంధం ఉంది? సుబ్ర‌హ్మ‌ణ్య‌రావు చేసిన ప్ర‌యోగం మిగిల్ జీవితాన్ని ఎలాంటి మ‌లుపులు తిప్పింది? మిగిల్ డైరీలో ఉన్న లీల‌మ్మ (సుర‌భి ప్ర‌భావ‌తి) శార‌ద‌(సుప్రిత స‌త్య‌నారాయ‌ణ్‌) పేర్ల‌తో మిగిల్‌కు ఉన్న ఎలాంటి అనుబంధం ఉంది అన్న‌దే ఈ మూవీ క‌థ.

కేరాఫ్ కంచెర‌పాలెం సినిమాలో..

కేరాఫ్ కంచెర‌పాలెం సినిమాతో మోహ‌న్ భ‌గ‌త్ న‌టుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇందులో మిగిల్‌గా ఓ డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్ చేశాడు.మ‌హేష్ బాబు మ‌హ‌ర్షితో పాటు తెలుగులో ప‌లు సినిమాల్లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా క‌నిపించాడు. మంగ‌ళ‌వారం, కీడాకోలా తో పాటు తెలుగులో ప‌లు సినిమాల్లో వైవిధ్య‌మైన పాత్ర‌లు చేశాడు ర‌వీంద్ర విజ‌య్‌. ది ఫ్యామిలీ మ్యాన్‌తో పాటు దూత‌, యాంగ‌ర్‌టేల్స్ వెబ్‌సిరీస్‌ల‌లో క‌నిపించాడు.

IPL_Entry_Point

టాపిక్

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024