Harom Hara Release Date: హరోం హర కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఆ పోటీ నుంచి తప్పుకున్న సుధీర్ బాబు మూవీ

Best Web Hosting Provider In India 2024

Harom Hara Release Date: హరోం హర మూవీ సుధీర్ బాబు కెరీర్లో మోస్ట్ అవేటెడ్ సినిమా. జ్ఞానసాగర్ ద్వారక డైరెక్ట్ చేసిన ఈ ప్రమోషన్లు ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి. తాజాగా మంగళవారం (మే 21) ఈ సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు. గతేడాది హంట్, మామా మశ్చీంద్రా సినిమాలతో వచ్చినా.. అతడు పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయాడు.

హరోం హర రిలీజ్ డేట్

హరోం హర మూవీ మే 31న రిలీజ్ కావాల్సి ఉన్నా.. మేకర్స్ వాయిదా వేశారు. అదే రోజు మరో ఐదు సినిమాలు రిలీజ్ కావాల్సి ఉన్నాయి. దీంతో ఈ సినిమాను జూన్ 14వ తేదీకి వాయిదా వేశారు. ఈ కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ.. మేకర్స్ ఓ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. అందులో సుధీర్ బాబు చేతిలో ఓ గన్ పట్టుకొని ఇంటెన్స్ లుక్ లో కనిపించాడు.

మే 31న చాలా సినిమాల నుంచి పోటీ ఉన్నా.. జూన్ 14న మాత్రం హరోం హర సోలో రిలీజ్ కానుంది. ఇది కచ్చితంగా ఆ సినిమా కలెక్షన్లపై సానుకూల ప్రభావం చూపనుంది. ఇక ఈ కొత్త రిలీజ్ డేట్ తోపాటు ఓ చిన్న క్లిప్ కూడా మేకర్స్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. బ్యాక్‌గ్రౌండ్ లో టైటిల్ సాంగ్ ప్లే అవుతుండగా.. ఈ వీడియో ప్లే అయింది.

హరోం హర మూవీ ఏంటంటే?

హరోం హర మూవీ టీజర్ గతేడాది డిసెంబర్లోనే రిలీజైంది. ఈ సినిమాలో సుధీర్ బాబుతోపాటు మాళవిక శర్మ నటిస్తోంది. ఈ మూవీ 1989లో చిత్తూరులోని కుప్పం నేపథ్యంలో తెరకెక్కింది. చైతన్ భరద్వాజ్ మ్యూజిక్ అందించగా.. సుమంత్ జి నాయుడు నిర్మించాడు. టీజర్ రిలీజ్ సందర్భంగానే ఈ మూవీ మంచి హిట్ సాధిస్తుందన్న నమ్మకాన్ని అతడు వ్యక్తం చేశాడు. అంతేకాదు ఇందులో తాను చేసిన యాక్షన్ సీన్స్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు.

తాను జాకీ చాన్ అభిమానినని, చిన్నప్పటి నుంచీ అతని సినిమాలు ఎన్నో చూసినట్లు సుధీర్ బాబు చెప్పాడు. హరోం హర మూవీలో తాను చేసిన యాక్షన్ సీన్స్ ఇంత వరకూ ఏ హీరో చేయలేదని చెప్పడం విశేషం. “ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాను. ఓ జాకీ చాన్ అభిమానిగా డైరెక్టర్ అంచనాలను అందుకోవడానికి ప్రయత్నించాను. నా స్టంట్స్ ను చాలా వరకూ నేనే చేశాను.

నా చిన్నతనంలో జాకీ చాన్ యాక్షన్ సీన్స్ చూసిన స్ఫూర్తితో ఈ సీన్స్ చేశాను. ఈ సినిమాలో నేను చేసిన యాక్షన్ సీన్స్ ఏ హీరో ఎప్పుడూ చేయలేదని నేను నమ్మకంగా చెప్పగలను. అందుకే ఈ సినిమాపై నాకు నమ్మకం ఉంది” అని సుధీర్ అన్నాడు.

నిజానికి మే 31న రిలీజ్ కావాల్సి ఉన్నా.. ఆ రోజు విశ్వక్సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, కాజల్ సత్యభామ, కార్తికేయ భజే వాయు వేగం, చాందిని చౌదరి మ్యూజిక్ షాప్ మూర్తి, ఆనంద్ దేవరకొండ గం గం గణేశా మూవీస్ కూడా రిలీజ్ కానున్నాయి.

IPL_Entry_Point

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024