Best Web Hosting Provider In India 2024
Mohan Lal Birthday: ఓటీటీ కారణంగా సినిమాల పరంగా భాషాపరమైన హద్దులు చెరగిపోయాయి. భాషాభేదాలతో సంబంధం లేకుండా స్టార్ హీరోలు సినిమాలు పాన్ ఇండియన్ లెవెల్‌లో రిలీజ్ అవుతోన్నాయి. పాన్ ఇండియన్ కల్చర్ వల్ల మలయాళ సినిమాలు దేశవ్యాప్తంగా అద్భుతమైన ఆదరణను సొంతం చేసుకుంటున్నాయి. మోహన్‌లాల్, మమ్ముట్టి వంటి స్టార్స్ సినిమాలకు అన్ని భాషల్లో క్రేజ్ ఏర్పడింది. డబ్బింగ్ సినిమాలతో పాటుగా మంచి కథ, క్యారెక్టర్స్ దొరికితే తెలుగులో స్ట్రెయిట్ సినిమాలు చేస్తున్నారు మలయాళం స్టార్ హీరోలు.
ప్రభాస్ సలార్‌లో…
తెలుగులో ప్రభాస్ సలార్ మూవీలో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషించాడు. మమ్ముట్టి కూడా యాత్రతో పాటు అఖిల్ ఏజెంట్ మూవీలో కనిపించాడు. వీరితో పాటు మోహన్‌లాల్ కూడా తెలుగులో మనమంతాతో పాటుఎన్టీఆర్ జనతా గ్యారేజ్ సినిమాల్లో నటించాడు. జనతా గ్యారేజ్‌లో పవర్‌ఫుల్ రోల్‌లో తన యాక్టింగ్‌తో అభిమానులను మెప్పించాడు. ఈ రెండు సినిమాలు 2016లోనే ప్రేక్షకుల ముందుకొచ్చాయి.
బాలకృష్ణ గాండీవంలో…
అయితే ఈ రెండు సినిమాల కంటే ముందుగానే 22 క్రితమే తెలుగులో మోహన్‌లాల్ ఓ సినిమా చేశాడు. అయితే ఫుల్ లెంగ్త్ రోల్ కాదు. అతిథి పాత్రలో కనిపించాడు. అది కూడా ఓ పాటలో మెరిశాడు. అక్కినేని నాగేశ్వరరావు ప్రధాన పాత్రలో బాలకృష్ణ హీరోగా గాండీవం పేరుతో 1994లో ఓ మూవీ తెరకెక్కింది. ఈ తెలుగు మూవీకి మలయాళ టాప్ డైరెక్టర్ ప్రియదర్శన్ దర్శకత్వం వహించాడు.
ఈ సినిమాలోని గోరువంక వాలగానే గోపురానికి అనే పాటలో అక్కినేని నాగేశ్వరరావు, బాలకృష్ణలతో కలిసి మోహన్‌లాల్ నటించారు. ఈ పాటలో షిప్ కెప్టెన్ డ్రెస్‌లో ఏఎన్ఆర్, బాలకృష్ణలతో కలిసి మోహన్‌లాల్ స్టెప్పులు వేశారు. దర్శకుడు ప్రియదర్శన్‌తో ఉన్న అనుబంధం కారణంగానే మోహన్‌లాల్ ఈ పాటలో నటించడానికి అంగీకరించారు.
మ్యూజికల్‌గా గాండీవం మూవీ పెద్ద హిట్టయింది. ముఖ్యంగా మోహన్‌లాల్ గెస్ట్ పాత్రలో కనిపించిన గోరువంక వాలగానేగోపురానికి పాట అప్పట్లో మ్యూజిక్ లవర్స్‌ను తెగ ఆకట్టుకున్నది. ఇప్పటికీ ఈ పాటకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. కానీ కమర్షియల్‌గా సినిమా ఫెయిలవ్వడంతో మోహన్‌లాల్ గెస్ట్ రోల్ ఎవరికి పెద్దగా తెలియకుండాపోయింది.
22 ఏళ్ల తర్వాత రీఎంట్రీ…
గాండీవం తర్వాత చాలా ఏళ్ల పాటు తెలుగులో స్ట్రెయిట్ సినిమా చేయలేదు మోహన్‌లాల్. మనమంతాతో 2016లో టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు. గాండీవం సినిమాలో రోజా హీరోయిన్‌గా నటించింది. తెలుగులో ప్రియదన్శన్ ఇప్పటివరకు రెండు సినిమాలను మాత్రమే తెరకెక్కించాడు. అందులో నాగార్జున నిర్ణయం హిట్టవ్వగా..గాండీవం మాత్రం ఫెయిలైంది.
భక్త కన్నప్పలో…
ప్రస్తుతం తెలుగులో మంచు విష్ణు తెరకెక్కిస్తోన్న భక్త కన్నప్పలో మోహన్‌లాల్ ఓ ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాడు. తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను కూడా మోహన్‌లాల్ పూర్తిచేసుకున్నట్లు సమాచారం. భక్తి ప్రధాన కథాంశంతో రూపొందుతోన్న ఈ సినిమాలో మోహన్‌బాబు, మంచు విష్ణుతో పాటు ప్రభాస్, అక్షయ్ కుమార్ కీలక పాత్రలు చేస్తోన్నారు.
మలయాళంలో నాలుగు సినిమాలు…
ప్రస్తుతం మలయాళంలో స్వీయ దర్శకత్వంలో బరోజ్ అనే సినిమాను తెరకెక్కిస్తోన్నాడు మోహన్‌లాల్. ఈ మూవీతో పాటు లూసిఫర్ సీక్వెల్, రామ్, వృషభ సినిమాల్లో మోహన్‌లాల్ హీరోగా నటిస్తోన్నాడు.