
Best Web Hosting Provider In India 2024

Shrimad Ramayanam Serial: మహా ఇతిహాసం ‘రామాయణం’ ఆధారంగా చాలా సినిమాలు, సీరియల్స్ వచ్చాయి. వాటిలో చాలా విజయవంతం అయ్యాయి. అయితే, ప్రేక్షకులు ఈ ఇతిహాసం గురించి వీక్షించేందుకు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. అందుకే, రామాయణంపై కొత్తగా సినిమాలు, సీరియల్స్ ఉంకా వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే శ్రీమద్ రామాయణం సీరియల్ తెలుగులో ప్రసారం అయ్యేందుకు సిద్ధమైంది. ఈ సీరియల్ ప్రారంభ తేదీ, టెలికాస్ట్ టైమింగ్స్ ఖరారయ్యాయి. అలాగే, ఈ సీరియల్ ప్రారంభం సందర్భంగా ఓ కాంటెస్ట్ కూడా జెమినీ టీవీ నిర్వహిస్తోంది.
శ్రీమద్ రామాయణం తేదీ, టైమింగ్స్
శ్రీమద్ రామాయణం డైలీ సీరియల్ మే 27వ తేదీ నుంచి జెమినీ టీవీ ఛానెల్‍లో టెలికాస్ట్ కానుంది. మే 27 నుంచి సోమవారం నుంచి శనివారం వరకు ప్రతీ రోజు సాయంత్రం 6.30 గంటల నుంచి 7.30 గంటల వరకు ఈ సీరియల్ ప్రసారం అవుతుంది. అంటే ప్రతీ ఎపిసోడ్ గంట పాటు ఉండనుందని జెమినీ టీవీ వెల్లడించింది.
వాల్మీకి రామాయణం ఆధారంగా శ్రీమద్ రామాయణం సీరియల్ రూపొందింది. హైక్వాలిటీ గ్రాఫిక్స్‌తో ఈ సీరియల్ తెరకెక్కిందని జెమినీ పేర్కొంది. హిందీలో ప్రసారం అవుతున్న ‘శ్రీమద్ రామాయణ్’కు తెలుగు డబ్బింగ్‍లో ఈ సీరియల్ మే 27 నుంచి జెమినీలో ప్రసారం కానుంది.
ప్రేక్షకులకు కాంటెస్ట్ ఇదే..
శ్రీమద్ రామాయణం సీరియల్ ప్రారంభం సందర్భంగా జెమినీ టీవీ ఓ కాంటెస్ట్ నిర్వహించనుంది. మే 27న ఈ సీరియల్ ప్రారంభం కానుండగా.. ఆ రోజు నుంచి జూన్ 1వ తేదీ వరకు ఆరు ఎపిసోడ్లలో ప్రేక్షకులకు ప్రశ్నలు ఇవ్వనుంది. ఆ ప్రశ్నలకు మిస్డ్ కాల్ ద్వారా సమాధానాలు తెలియజేసే ప్రేక్షకులకు రూ.1000 నగదు బహుమతి అందించనుంది. లక్కీడ్రా ద్వారా ప్రతీ రోజు 500 మంది విజేతలను ఈ బహుమతికి ఎంపిక చేయనున్నట్టు జెమినీ టీవీ వెల్లడించింది.
హిందీ నుంచి డబ్బింగ్..
శ్రీమద్ రామాయణ్ సీరియల్ హిందీలో సోనీ ఎంటర్‌టైన్‍మెంట్ టీవీ ఛానెల్‍లో ప్రసారం అవుతోంది. ఈ ఏడాది జనవరి 1 నుంచి ఈ సీరియల్ వస్తోంది. దీన్ని ఇప్పుడు తెలుగు డబ్బింగ్‍లో జెమినీ టీవీ తీసుకొస్తోంది. మే 27 నుంచి ప్రసారం చేయనుంది. రామాయణంలోని దాదాపు ప్రముఖ ఘట్టాలు ఈ సీరియల్‍లో ఉంటాయని జెమినీ టీవీ పేర్కొంది.
శ్రీమద్ రామాయణం సిరీయల్‍లో శ్రీరాముడిగా సుజయ్ రేణు, సీతాదేవిగా ప్రాచీ భన్సాల్, లక్ష్మణుడిగా బసంత్ భట్, హనుమంతుడిగా నిర్భయ్ వాద్వా, రావణుడిగా నిఖితన్ ధీర్ నటిస్తున్నారు. ఈ సీరియల్‍కు కమల్ మోంగా, లోక్‍నాథ్ పాండే, సుమీస్ థాకూర్ దర్శకత్వం వహిస్తున్నారు.
బాలీవుడ్‍లో మరో మూవీ
రామాయణం ఆధారంగా బాలీవుడ్‍లో మరో సినిమా రూపొందుతోంది. స్టార్ డైరెక్టర్ నితేశ్ తివారీ రూపొందిస్తున్న ఈ చిత్రంలో శ్రీరాముడిగా రణ్‍బీర్ కపూర్, సీతాదేవిగా సాయిపల్లవి నటిస్తున్నారు. రావణుడి పాత్రను యశ్ పోషిస్తున్నారు. భారీ బడ్జెట్‍తో ఈ మూవీ రూపొందుతోంది. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం వేగంగా సాగుతోంది. 2025లో ఈ సినిమా ఫస్ట్ పార్ట్ రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.