Cucumber Lassi Benefits : దోసకాయ లస్సీ.. 5 నిమిషాల్లో రెడీ.. శరీరాన్ని చల్లబరుస్తుంది

Best Web Hosting Provider In India 2024

దోసకాయ వేసవిలో ఎంతో ఆరోగ్యకరమైనది. దీనిని లస్సీ చేసుకుని తాగితే పొందే ప్రయోజనాలు చాలా ఉంటాయి. దోసకాయతో తయారు చేసిన ప్రత్యేకమైన లస్సీ మీకు పెరుగు కంటే ఎక్కువ ప్రయోజనాలను అందిస్తాయి. దీనితోపాటుగా దోసకాయ ప్రయోజనాలను కూడా మీకు దొరుకుతాయి. అంతేకాదు ఇది ఎంత రుచికరంగా ఉంటుందంటే ఒక్కసారి తాగితే పెరుగు లస్సీని కూడా తాగడం మరిచిపోతారు. ఇతర పానీయాలకు కూడా దూరంగా ఉంటారు.

దోసకాయతో చేసే ఈ ప్రత్యేకమైన లస్సీతో పెరుగు ప్రయోజనాలను మాత్రమే కాకుండా దోసకాయ ప్రయోజనాలను కూడా పొందుతారు. ముఖ్యంగా ఇంటి నుండి బయలుదేరే ముందు, బయట నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఈ లస్సీ తాగాలి. చాలా మంది ఇలాంటి పరిస్థితుల్లో ఇంటికి చేరుకోగానే ఫ్రిజ్ లోంచి శీతల పానీయాలు తీసి తాగుతుంటారు. కానీ ఈ ఎనర్జీ డ్రింక్స్ శరీరాన్ని కాసేపు చల్లబరుస్తున్నప్పటికీ, హానికరమే ఎక్కువ. అలా కాకుండా కోల్డ్ దోసకాయ లస్సీ తాగితే దాని మజా వేరు. స్పెషల్ దోసకాయ లస్సీ చేయడం ఎలానో తెలుసుకుందాం..

దోసకాయ లస్సీ తయారీకి కావలసిన పదార్థాలు

దోసకాయ – 1

ఇంట్లో తయారుచేసిన పెరుగు – 1 కప్పు

తరిగిన అల్లం – 1 టేబుల్ స్పూన్

ఐస్ క్యూబ్ – 1/2

నల్ల ఉప్పు – రుచి ప్రకారం

నల్ల మిరియాలు – అర టీస్పూన్

దోసకాయ లస్సీ తయారీ విధానం

ముందుగా దోసకాయ, అల్లం, కొత్తిమీర ఆకులను కడిగి చాలా మెత్తగా కట్ చేసుకోవాలి. మీకు కావాలంటే దోసకాయను కూడా తురుముకోవచ్చు.

తర్వాత బ్లెండర్ తీసుకొని దానికి పెరుగు జోడించండి. రెండుసార్లు బాగా కలపండి లేదా నురుగు వచ్చేవరకు కలపండి.

దీని కోసం, ఇంట్లో తయారుచేసిన పెరుగు ఉపయోగించండి. మార్కెట్‌లో కొనుగోలు చేసిన పెరుగును కూడా ఉపయోగించవచ్చు. ఇంట్లో చేసినది అయితే రుచిగా ఉంటుంది.

ఇప్పుడు కొత్తిమీర ఆకులు, అల్లం, దోసకాయను మళ్లీ కలపాలి.

దోసకాయ లస్సీ చేయండి. ఇప్పుడు చల్లగా సర్వ్ చేయండి.

దోసకాయలో దాదాపు 96 శాతం నీరు ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది.

దోసకాయలో నీటి కంటెంట్, చాలా తక్కువ కేలరీలు ఉంటాయి. ఇది బరువు నియంత్రణలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

ఇందులో నీరు ఎక్కువగా ఉండటం వల్ల మన చర్మానికి కూడా మేలు చేస్తుంది.

మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

పెరుగు పొట్టను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది వేసవిలో కడుపుని చల్లబరుస్తుంది. అంతేకాకుండా జీర్ణశక్తి కూడా పెరుగుతుంది.

దోసకాయతో జీర్ణ సమస్యలు తగ్గుతాయి. మలబద్ధకం సమస్య నుంచి కూడా బయటపడవచ్చు. పేగు కదలికలకు దోసకాయ లస్సీ ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. కడుపుని శుభ్రపరుస్తుంది. దోసకాయతో బరువు కూడా తగ్గించుకోవచ్చు. కడుపు నిండుగా ఉన్న అనుభూతి కలిగిస్తుంది. ఆహార కోరికలను నియంత్రిస్తుంది. దోసకాయ జ్యూస్‌ను పొట్టుతోనే చేయాలి. అలా అయితేనే మీరు మరిన్ని ప్రయోజనాలు పొందుతారు. దోసకాయతో ఆరోగ్య ప్రయోజనాలు పొందేందుకు లస్సీ తయారు చేసుకుని తాగండి.

WhatsApp channel
Source / Credits

Best Web Hosting Provider In India 2024