Best Web Hosting Provider In India 2024
AP Inter Supplementary: ఆంధ్రప్రదేశ్ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. రోజుకు రెండు విడతల్లో పరీక్షల్ని నిర్వహించనున్నారు. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి 12 వరకు, సెకండియర్ పరీక్షల్ని మధ్యాహ్నం రెండున్నర నుంచి ఐదున్నర వరకు నిర్వహిస్తారు.
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 861 కేంద్రాలను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో 33 సమస్యాత్మక పరీక్షా కేంద్రాలు ఉన్నట్టు గుర్తించారు. మరో 37 సున్నితమైన కేంద్రాలను కూడా ఇంటర్ బోర్డు గుర్తించింది.
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5,03,459మంది హాజరయ్యారు. మొదటి సంవత్సరం విద్యార్ధుల్లో 1,77,012 బాలురు, 1,69,381మంది బాలికలతో మొత్తం 3,46,393మంది పరీక్షలు రాస్తున్నారు. వీరితో పాటు ఫస్టియర్‌లో మరో 19,479మంది ఒకేషనల్ విద్యార్థులు కూడా పరీక్షలకు హాజరవుతారు. ఇంటర్ ఫస్టియర్‌లో 3,65,872మంది పరీక్షలు రాస్తున్నారు.
ఇంటర్ సెకండియర్‌లో 67,129మంది బాలురు, 54416మంది బాలికలతో 1,21,545మంది పరీక్షలు రాస్తున్నారు. ఒకేషనల్ కోర్సుల్లో 9499 బాలురు, 6543 మంది బాలికలు పరీక్షలు రాస్తున్నారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో మొత్తం 1,37,587మంది పరీక్షలు రాస్తున్నారు. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్‌లలో కలిపి 5,03,459మంది ఇంటర్ పరీక్షలకు హాజరు కానున్నారు.
వేసవి నేపథ్యంలో ప్రతి పరీక్ష కేంద్రంలో ఆరోగ్య శాఖకు చెందిన ఉద్యోగి విధులు నిర్వర్తించనున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద రద్దీని దృష్టిలో ఉంచుకుని విద్యార్ధులు అరగంట ముందే చేరుకోవాలని ఇంటర్ బోర్డు కార్యదర్శి సూచించారు.
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ నేపథ్యంలో తాడేపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు గ్రీవెన్స్ సెల్ అందుబాటులో ఉండనుంది. పరీక్షా కేంద్రాల వద్ద తలెత్తే ఇబ్బందులపై 08645-277702 ల్యాండ్ లైన్ నంబర్, టోల్ ఫ్రీ నంబర్ 1800-4251531 నంబర్లకు కాల్ చేయాలని సూచించారు.
ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి నిర్వహించనున్నారు. సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్లను ఇవాళ బోర్డు విడుదల చేయనున్నట్లు సమాచారం. మే 24 నుంచి జూన్1వ తేదీ వరకు ఇంటర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. సప్లిమెంటరీ పరీక్షలను రోజుకు రెండు షిఫ్టుల్లో నిర్వహిస్తారు. ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు నిర్వహించనున్నారు.
ఇంటర్ ఫస్టియర్ సప్లమెంటరీ పరీక్షల తేదీలు :
- మే 24 – సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 1
- మే25 – ఇంగ్లిష్ పేపర్ 1
- మే 27 – పార్ట్ 3లో మ్యాథ్స్ పేపర్ 1ఎ, బోటని పేపర్ 1, సివిక్స్ పేపర్ 1
- మే 28 -మ్యాథ్స్ పేపర్ 1బి, జువాలజీ పేపర్ 1, హిస్టరీ పేపర్ 1
- మే 29 -ఫిజిక్స్ పేపర్ 1, ఎకనామిక్స్ పేపర్ 1
- మే 30 -కెమిస్ట్రీ పేపర్ 1, కామర్స్ పేపర్ 1, సోషియాలజీ పేపర్ 1, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్ 1
- మే 31 – పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 1, లాజిక్ పేపర్ 1, బైపీసీ విద్యార్థులకు బ్రిడ్జి కోర్స్ మ్యాథ్స్ పేపర్ 1
- జూన్ 1 -మోడ్రన్ లాంగ్వేజ్, జాగ్రఫీ పేపర్ 1
- జూన్ 6 -ఎథిక్స్ అండ్ హ్యుమన్ వాల్యూస్
- జూన్ 7- ఎన్విరాన్‌మెంట్ ఎడ్యుకేషన్
ఇంటర్ సెకండియర్ సప్లమెంటరీ పరీక్షల తేదీలు :
- మే 24 -సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 2
- మే 25 -ఇంగ్లీష్ పేపర్ 2
- మే 27 -పార్ట్ 3లో మ్యాథ్స్ పేపర్ 2ఎ, బోటనీ పేపర్ 2, సివిక్స్ పేపర్ 2
- మే 28 -మ్యాథ్స్ పేపర్ 2బి, జువాలజీ పేపర్ 2, హిస్టరీ పేపర్ 2
- మే 29 -ఫిజిక్స్ పేపర్ 2, ఎకనామిక్స్ పేపర్ 2
- మే 30 – కెమిస్ట్రీ పేపర్ 2, కామర్స్ పేపర్ 2, సోషియాలజీ పేపర్ 2, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్ 2
- మే 31 – పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 2, లాజిక్ పేపర్ 2, బైపీసీ విద్యార్థులకు బ్రిడ్జి కోర్స్ మ్యాథ్స్ పేపర్ 2
- జూన్ 1 -మోడరన్ లాంగ్వేజ్, జాగ్రఫీ పేపర్ 2.
సంబంధిత కథనం
టాపిక్