US Student Visa Updates: జూన్‌లో యూఎస్‌ స్టూడెంట్ వీసా స్లాట్ల విడుదల,ఆగస్టులో ఇంటర్వ్యూలు, అందుబాటులో అదనపు స్లాట్లు ..

Best Web Hosting Provider In India 2024

US Student Visa Updates: అమెరికాలో విద్యాభ్యాసం చేయాలని భావిస్తోన్న విద్యార్ధులకు కాన్సులేట్ కీలక అప్టేట్ ఇచ్చింది. అమెరికాలో గ్రాడ్యుయేట్, మాస్టర్స్‌ చేయాలనుకుంటోన్న విద్యార్ధుల కోసం జూన్‌లో దశల వారీగా స్లాట్లు విడుదల చేయనున్నారు.

వీసాకు దరఖాస్తు చేయాలని భావిస్తున్న విద్యార్థులకు జూన్, జులై, ఆగస్టు కోటాల్లో అదనంగా స్టూడెంట్‌ వీసా(ఎఫ్-1) ఇంటర్వ్యూ స్లాట్లు విడుదల చేయాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించింది. అమెరికాలో పాల్ ఎడ్యుకేషన్ సీజన్ ఆగస్టు- సెప్టెంబరు నెలలలో ప్రారంభం అవుతుంది.

ఏటా అమెరికాలో అడ్మిషన్ల సమయంలో.. ఒక సారి ఇంటర్వ్యూలో వీసా దక్కని వారికి వారికి, ఆ సీజన్ చివరి వారంలో మరోసారి ఇంటర్వ్యూకు హాజరయ్యేందుకు అవకాశం కల్పిస్తారు. ఈ ఏడాది ఆగస్టు నెలాఖరు వరకు స్టూడెంట్ వీసా స్లాట్లు విద్యార‌్థులకు అందుబా టులో ఉంచాలని నిర్ణయించారు. రానున్న పాల్ సీజన్లో అమెరికా వెళ్లేందుకు ఇప్పటికే స్లాట్లు బుక్‌ చేసుకున్న విద్యార్థులకు గత సోమవారం నుంచి హైదరా బాద్‌లోని అమెరికా కాన్సులేట్ జనరల్ కార్యాలయంలో వీసా ఇంటర్వ్యూలను ప్రారంభించారు.

ఆగస్టుతో మొదలయ్యే విద్యా సంవత్సరంలో అడ్మిషన్లకు సంబంధించిన తొలి విడత ఇంటర్వ్యూ తేదీలను (స్లాట్ల)ను మే రెండో వారంలో ప్రారంభించారు. ఈ సారి పెద్దసంఖ్యలో భారతీయ విద్యార్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు దశలవారీగా స్లాట్లు విడుదల చేస్తున్నారు.

స్టూడెంట్ వీసా సీజన్లో ఆగస్టు చివరి వరకు ఇంటర్వ్యూ స్లాట్లు అందుబాటులో ఉంచాలని నిర్ణ యించినట్లు అమెరికా కాన్సులేట్ మంగళవారం ప్రకటించింది. చివరి నిమిషంలో యూఎస్‌లో విద్యాభ్యాసం కోసం వెళ్లాలని నిర్ణయించుకున్న వారికి కూడా ఇవి అందుబాటులో ఉంటాయి. త్వరలో మరిన్ని స్లాట్లు విడుదల చేయనున్నారు. ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యా లయంతో పాటు, హైదరాబాద్, చెన్నై, ముంబయి, కోల్కతాలలోని కాన్సుల్ జనరల్ కార్యాలయాల్లో ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు అధికారిక వెబ్ సైట్లో స్లాట్లు అందుబాటులో ఉన్నాయని కాన్సు లేట్ జనరల్ కార్యాలయం ప్రకటించింది.

అమెరికా విద్యపై అవగాహన కార్యక్రమం..

ప్రస్తుత పాల్ సీజన్‌ అడ్మిషన్లతో పాటు 2025 స్ప్రింగ్ సీజన్‌లో అడ్మిషన్లు పొందాలని భావిస్తున్న వారి కోసం కాన్సులేట్ వర్గాలు అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నాయి.

అమెరికాలో చదవాలని భావిస్తున్న విద్యా ర్థుల కోసం హైబ్రిడ్ విధానంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ నెల 24వ తేదీన వర్చువల్ పద్ధతిలో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ఆసక్తి ఉన్నవారు. https://us06web.zoom.us/meeting/register/tZAldO-uqDstE9YUBkcxhV3TgTVltv1uFMjM#/registration లో దరఖాస్తు చేసుకోవచ్చు. హైదరాబాద్‌లో నేరుగా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. దీనికి హాజరు కావాలనుకునే వారి కోసం ఎస్.ఎల్. జూబ్లీ కాంప్లెక్స్, 4 ఫ్లోర్, రోడ్ నంబర్ 36, జూబ్లీహిల్స్‌లో శుక్రవారం మే 24న మధ్యాహ్నం మూడు నుంచి నాలుగు గంటల మధ్య కార్యక్రమం నిర్వ హిస్తున్నారు. ఈ కార్యక్రమంలో అమెరికా వీసా కాన్సులర్ అధికారి వీసా దర ఖాస్తు ప్రక్రియపై అవగాహన కల్పిస్తారు.

స్టూడెంట్ వీసా అవగాహన కార్యక్రమాలు..

U.S. ఎంబసీ/కాన్సులేట్ కార్యాలయాల ద్వారా కాన్సులర్ ల ఆధ్వర్యంలో విద్యార్థి వీసా సెషన్‌లపై అవగాహన కల్పిస్తారు. U.S. విద్యార్థి వీసా దరఖాస్తు ఫారమ్, ఇంటర్వ్యూ ప్రక్రియ, F-1 వీసా నిబంధనలను అర్థం చేసుకోవడంలో సహాయం చేస్తారు.

శుక్రవారం, మే 24| 3:00-4:00 PM IST | విద్యార్థి వీసా సెషన్ – YAF హైదరాబాద్ (హైబ్రిడ్)

శుక్రవారం, జూన్ 14 | 3:00-4:00 PM IST | విద్యార్థి వీసా సెషన్ – USIEF చెన్నై (హైబ్రిడ్)

శుక్రవారం, జూలై 19 | 3:00-4:00 PM IST | విద్యార్థి వీసా సెషన్ – USIEF న్యూఢిల్లీ (హైబ్రిడ్)

అవగాహన కార్యక్రమాల్లో పాల్గొనడానికి పేర్లను నమోదు చేసుకోడానికి ఈ లింకును అనుసరించండి.

https://us06web.zoom.us/meeting/register/tZAldO-uqDstE9YUBkcxhV3TgTVltv1uFMjM#/registration

అమెరికాలో స్టూడెంట్ వీసాకు దరఖాస్తు చేసే సమయంలో తలెత్తే సందేహాలు, దరఖాస్తు ప్రక్రియ, ప్రాథమిక వివరాల కోసం ఈ లింకును అనుసరించండి. https://www.usief.org.in/images/pdfs/Student-Visas-Factsheet-Indian-Students-April-2023.pdf

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్

EducationUsUsa News TeluguNri News Usa TeluguTelugu NewsLatest Telugu NewsBreaking Telugu News
Source / Credits

Best Web Hosting Provider In India 2024