Best Web Hosting Provider In India 2024
TS POLYCET Exam 2024 Updates : తెలంగాణ పాలిసెట్ – 2024 ఎంట్రెన్స్ పరీక్ష హాల్ టికెట్లు వచ్చేశాయ్. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://polycet.sbtet.telangana.gov.in/ వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మే 24వ తేదీన ఈ ప్రవేశ పరీక్ష జరగనుంది. ఇందుకోసం ఏర్పాట్లను సిద్ధం చేశారు.
How to Download TS POLYCET Hall Tickets 2024 : టీఎస్ పాలిసెట్ హాల్ టికెట్లు ఇలా పొందండి….
- తెలంగాణ పాలిసెట్ – 2024 కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://polycet.sbtet.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోంపేజీలో కనిపించే HallTicket ఆప్షన్ పై నొక్కాలి.
- ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ లేదా మొబైల్ నెంబర్ ను ఎంట్రీ చేయాలి.
- సబ్మిట్ బటన్ పై నొక్కితే మీ హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది.
- ప్రింట్ అప్షన్ పై నొక్కి హాల్ టికెట్ కాపీని పొందవచ్చు.
- ఎగ్జామ్ సెంటర్ లోకి వెళ్లాలంటే హాల్ టికెట్ తప్పనిసరి.
టాపిక్
Ts PoliceTs PoliticsEducationTelangana News