Best Web Hosting Provider In India 2024
OTT Telugu Recent Release: ఓటీటీల్లో తెలుగులో కొత్త సినిమాలు చూడాలనుకునే వారికి ఈవారం (మే నాలుగో వారం) నాలుగు అందుబాటులోకి వచ్చాయి. మూడు తెలుగు సినిమాలు స్ట్రీమింగ్‍కు రాగా.. ఓ తమిళ మూవీ డబ్బింగ్‍లో వచ్చేసింది. ఇందులో రెండు ఒకే ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో అడుగుపెట్టాయి. ఈ వారం తెలుగులో ఓటీటీలోకి వచ్చిన చిత్రాలు ఏవో ఇక్కడ చూడండి.
కలియుగం పట్టణంలో..
కలియుగం పట్టణంలో క్రైమ్ థ్రిల్లర్ సినిమా మే 23వ తేదీన ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. విశ్వకార్తికేయ, ఆయుషీ పటేల్, చిత్రా శుక్లా ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం సడెన్‍గా ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఈ ఏడాది మార్చి 29వ తేదీన ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ అయింది. కలియుగం పట్టణంలో మూవీకి రమాకాంత్ రెడ్డి దర్శకత్వం వహించారు. కవల అన్నదమ్ములైన ఇద్దరిలో నేరాలకు పాల్పడుతోంది ఎవరనే విషయం చుట్టూ ఈ థ్రిల్లర్ స్టోరీ సాగుతుంది.
ప్రసన్న వదనం
ప్రసన్న వదనం సినిమా ఈవారంలోనే మే 24వ తేదీన ‘ఆహా’ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. ఈ చిత్రంలో సుహాస్ హీరోగా నటించారు. ఫేస్ బ్లైండ్‍నెస్ అనే కాన్సెప్ట్ చుట్టూ క్రైమ్ థ్రిల్లర్‌గా ఈ మూవీ రూపొందింది. ఈ చిత్రానికి అర్జున్ వైకే దర్శకత్వం వహించారు. థియేటర్లలో మే 3వ తేదీన ప్రసన్న వదనం సినిమా రిలీజ్ అయింది. సుమారు రూ.5కోట్ల వసూళ్లను దక్కించుకుంది. ఇప్పుడు ఈ మూవీని ఆహా ఓటీటీలో చూడొచ్చు. ప్రసన్న వదనం సినిమాలో సుహాస్‍తో పాటు పాయల్ రాధాకృష్ణ, రాశీ సింగ్, వైవా హర్ష కీరోల్స్ చేశారు.
రత్నం తెలుగు డబ్బింగ్‍లో..
తమిళ హీరో విశాల్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ రత్నం సినిమా మే 23వ తేదీన ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ చిత్రం ఏప్రిల్ 26వ తేదీన థియేటర్లలో తమిళంతో పాటు తెలుగులోనూ రిలీజ్ అయింది. అయితే, అనుకున్న స్థాయిలో కలెక్షన్లను రాబట్టలేకపోయింది. దీంతో నెల తిరగకుండానే అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో అందుబాటులోకి వచ్చేసింది. తమిళంతో పాటు తెలుగు డబ్బింగ్ వెర్షన్‍లోనూ ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం స్ట్రీమ్ అవుతోంది. రత్నం మూవీకి హరి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో విశాల్ సరసన ప్రియాభవానీ శంకర్ హీరోయిన్‍గా నటించగా.. సముద్రఖని, యోగిబాబు, గౌతమ్ మీనన్ కీలకపాత్రలు పోషించారు. దేవీ శ్రీప్రసాద్ సంగీతం అందించారు.
ఆరంభం
ఆరంభం సినిమా మే 23వ తేదీన ‘ఈటీవీ విన్’ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. డెజావూ కాన్సెప్ట్‌తో సైన్స్ ఫిక్షన్ డ్రామాగా ఈ మూవీ వచ్చింది. మోహన్ భగత్ హీరోగా నటించిన ఈ మూవీకి అజయ్ నాగ్ దర్శకత్వం వహించారు. మే 10వ తేదీన థియేటర్లలో విడుదలైన ఆరంభం సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. అయితే, లాంగ్ రన్ రాలేదు. దీంతో రెండు వారాల్లోనే ఈటీవీ విన్ ఓటీటీలోకి ఆరంభం మూవీ వచ్చేసింది.