



ఎన్టీఆర్ జిల్లా / నందిగామ టౌన్ :
నందిగామ మండల పరిషత్ కార్యాలయంలో నూతనంగా మంజూరైన పెన్షన్లను లబ్ధిదారులకు పంపిణీ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ జగన్ మోహన్ రావు గారు ..
పి.ఆర్. & ఆర్.డి ఈవో గా స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన అక్కిరాజు అనురాధ గారి సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
నందిగామ మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మండల పరిధిలో నూతనంగా మంజూరైన వైయస్సార్ పెన్షన్లను లబ్ధిదారులకు శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు పంపిణీ చేశారు ,
అనంతరం పంచాయతీరాజ్ రూలర్ డెవలప్మెంట్ (పి.ఆర్.& ఆర్.డి ) విస్తరణాధికారి అక్కిరాజు అనురాధ గారి స్వచ్ఛంద పదవీ విరమణ సన్మాన మహోత్సవంలో పాల్గొని ఆమెను ఘనంగా సత్కరించారు , ఈ సందర్భంగా 28 సంవత్సరాల పాటు ఉత్తమమైన బాధ్యతతో -అంకితభావంతో పనిచేసి మంచి అధికారిగా పేరు తెచ్చుకున్న ఆమెకు అభినందనలు తెలిపి, శేష జీవితం ఆయురారోగ్యాలతో సుఖమయంగా సాగాలని కోరుకున్నట్లు తెలిపారు ,
ఈ కార్యక్రమంలో నందిగామ ఎంపీపీ అరిగెల సుందరమ్మ ,జడ్పిటిసి గాదెల బాబు , మండల పార్టీ అధ్యక్షులు నెలకొదుటి శివ నాగేశ్వరరావు , వైస్ ఎంపీపీలు అన్నం పిచ్చయ్య , ఆకుల రంగ తదితరులు పాల్గొన్నారు ..