TG Govt New Emblem : మరిన్ని సంప్రదింపులు…! తెలంగాణ అధికారిక చిహ్నం ఆవిష్కరణ వాయిదా

Best Web Hosting Provider In India 2024

TG Govt New Emblem Updates : తెలంగాణ అధికారిక చిహ్నంలో మార్పులు సర్వత్రా చర్చనీయాంశగా మారింది. జూన్ 2వ తేదీన ఆవిష్కరించాలని ప్రభుత్వం భావించింది. ఇందుకోసం కళాకారుడు రుద్ర రాజేశం రూపొందించిన పలు నమూనాలను సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. పలు నమూనాలను పరిశీలించగా… వీటిలో ఒకటిని ఫైనల్ చేసి ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న విడుదల చేయాలని భావించారు.

రాష్ట్ర చిహ్నంలో పలు మార్పులు చేయటంపై పలువర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ప్రభుత్వానికి అనేక సూచనలు రావటంతో  మరిన్ని సంప్రదింపులు జరపాలని తాజా సర్కార్ నిర్ణయించింది. తొందరపాటుగా ముందుకెళ్లకుండా… మరిన్ని సంప్రదింపులు చేయాలని భావించింది. ఫలితంగా జూన్ 2వ తేదీన విడుదల చేయలనుకున్న తెలంగాణ రాష్ట్ర అధికార చిహ్నం ఆవిష్కరణను వాయిదా వేయాలని నిర్ణయించింది.

ఇక జూన్ 2వ తేదీన కేవలం రాష్ట్ర గీతాన్ని మాత్రమే విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది.

IPL_Entry_Point

టాపిక్

Telangana NewsTrending TelanganaGovernment Of TelanganaCm Revanth Reddy
Source / Credits

Best Web Hosting Provider In India 2024