Bujji and Bhairava Animated series: బుజ్జి, భైరవ కలిసి చేసిన అడ్వెంచర్.. యానిమేటెడ్ సిరీస్ ట్రైలర్ చూశారా?

Best Web Hosting Provider In India 2024

Bujji and Bhairava Animated series: కల్కి 2898 ఏడీ టీమ్ త సినిమా ప్రమోషన్లను వినూత్నంగా నిర్వహించడానికి ప్రయత్నిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తీసిన ఈ సినిమాకు అదే స్థాయి ఓపెనింగ్స్ రావాలంటే పెద్ద ఎత్తున ప్రమోషన్లు అవసరం. అందులో భాగంగా ఈ మధ్యే బుజ్జిని పరిచయం చేసిన టీమ్.. ఇప్పుడు బుజ్జి, భైరవ కలిసి చేసిన అడ్వెంచర్లను ఓ యానిమేటెడ్ సిరీస్ రూపంలో తీసుకొస్తోంది.

బుజ్జి, భైరవ సాహసం

కల్కి 2898 ఏడీ మూవీలో రెబల్ స్టార్ ప్రభాస్ భైరవ అనే పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఇక మూవీలో అతడు వాడిన వెహికిల్ పేరు బుజ్జి. ప్రత్యేకంగా సినిమా కోసమే తయారైన ఈ ఆరు టన్నుల బరువున్న కారును ఈ మధ్యే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇక ఇప్పుడీ బుజ్జి, భైరవ కలిసి చేసిన సాహసాలపై ఓ యానిమేటెడ్ సిరీస్ రూపొందించారు.

దీనికి సంబంధించిన ట్రైలర్ ను గురువారం (మే 30) రిలీజ్ చేయగా.. ఈ సిరీస్ శుక్రవారం (మే 31) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ మూవీని నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడతడే ప్రభాస్, బుజ్జి, బ్రహ్మానందం పాత్రలో ఈ సిరీస్ రూపొందించాడు. ఈ సిరీస్ ప్రైమ్ వీడియోలోకి రాబోతోంది.

బీ అండ్ బీ యానిమేటెడ్ సిరీస్

బీ అండ్ బీ బుజ్జి అండ్ భైరవ అనే టైటిల్ తో ఈ యానిమేటెడ్ సిరీస్ ను తీసుకొస్తున్నారు. ఇందులో భైరవ పాత్రకు ప్రభాసే డబ్బింగ్ చెప్పగా.. బుజ్జికి మాత్రం కీర్తి సురేశ్ తన క్యూట్ వాయిస్ అందించింది. మధ్యలో బ్రహ్మానందం పాత్రను కూడా ఇంట్రడ్యూస్ చేయడం విశేషం. ఈ యానిమేటెడ్ సిరీస్ ను తీసుకొచ్చే ముందు ట్రైలర్ ను లాంచ్ చేశారు.

ఇందులో బుజ్జి, భైరవ డైలాగ్స్ నవ్వు తెప్పించేలా ఉన్నాయి. నీకు ఇంపాజిబుల్ ఏమో నాకు కాదు.. మన ఫ్యూచర్ సంగతేంటి అంటూ భైరవతో బుజ్జి చెప్పే డైలాగులు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇందులో అడ్వెంచర్, స్నేహం, ఒకరినొకరు కలవడం చూడొచ్చని మేకర్స్ ట్రైలర్ చివర్లో చెప్పారు.

2896 ఏడీ ఏడాదిలో కాశీలో జరిగిన స్టోరీగా ఈ ట్రైలర్ లో చూపించారు. అంటే కల్కి 2898 ఏడీ మూవీ నేపథ్యానికి రెండేళ్ల ముందు బుజ్జి, భైరవ మధ్య బంధం ఎలా బలపడిందో ఈ సిరీస్ ద్వారా చూపించే ప్రయత్నం చేయనున్నారు. ఈ యానిమేటెడ్ సిరీస్ శుక్రవారం నుంచి తెలుగుతోపాటు ఇంగ్లిష్, హిందీ, స్పానిష్ భాషల్లో అందుబాటులోకి వస్తుంది.

కల్కి 2898 ఏడీ మూవీ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగానే ఈ సిరీస్ ను తీసుకొస్తున్నారు. వైజయంతీ మూవీస్ ఏకంగా రూ.600 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఇందులో ప్రభాస్ తోపాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకోన్, దిశా పటానీలాంటి వాళ్లు నటించారు. ఈ సినిమా జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది.

IPL_Entry_Point

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024