TS POLYCET Results 2024 : తెలంగాణ ‘పాలిసెట్’ అప్డేట్స్ – జూన్ 3న ఫలితాలు..!

Best Web Hosting Provider In India 2024

TS POLYCET Results 2024 Updates : తెలంగాణ పాలిసెట్ – 2024 ఫలితాల కోసం విద్యార్థులు ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. అయితే విద్యార్థులకు కీలక అప్డేట్ వచ్చేసింది. జూన్ 3వ తేదీన ఫలితాలను ప్రకటించనున్నట్లు అధికారులు తెలిపారు. https://polycet.sbtet.telangana.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లి ర్యాంక్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చని వెల్లడించారు.

How to Check TS POLYCET Results 2024: పాలిసెట్ ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి

  • తెలంగాణ పాలిసెట్ పరీక్ష రాసిన అభ్యర్థులు https://polycet.sbtet.telangana.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • హోంపేజీలో కనిపించే Rank Crad అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  • ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ ను ఎంట్రీ చేయాలి సబ్మిట్ బటన్ పై నొక్కాలి. మీ ర్యాంక్ కార్డు డిస్ ప్లే అవుతుంది.
  • ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.

NOTE : ఈ లింక్ పై క్లిక్ చేసి పాలిసెట్ ర్యాంక్ కార్డును పొందవచ్చు.

తెలంగాణ పాలిసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ :

Telangana POLYCET Counselling 2024 : తెలంగాణ పాలిసెట్ – 2024 కౌన్సెలింగ్ షెడ్యూల్ వచ్చేసింది. జూన్ 20వ తేదీ నుంచి ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ప్రకటించింది.

జూన్ 22వ తేదీ నుంచి ఫస్ట్ ఫేజ్ వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునే అవకాశం ఉండగా…. జూన్ 30వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుంది. ఇక జూలై 7వ తేదీ నుంచి నుంచి సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ మొదలు కానుంది. జులై 13వ తేదీన సీట్లను కేటాయించనున్నారు.

జూలై 23వ తేదీన స్పాట్‌ ఆడ్మిషన్లకు గైడ్ లైన్స్ విడుదలవుతాయి. జూలై 24వ తేదీలోపు ప్రవేశాల ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు.

తెలంగాణలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాల కోసం పాలిసెట్ – 2024 పరీక్షను నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఎగ్జామ్ ఇవాళ(మే 24) రాష్టవ్యాప్తంగా జరిగింది. ఈసారి నిర్వహించిన పాలిసెట్ పరీక్ష కోసం 92 వేల మందికిపైగా అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. గతేడాదితో పోల్చితే ఈసారి అప్లికేషన్ల సంఖ్య స్వల్పంగా తగ్గింది.

IPL_Entry_Point

టాపిక్

Ts PolycetTelangana NewsTrending TelanganaEducation
Source / Credits

Best Web Hosting Provider In India 2024